‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. – – – – – – తీర్చేవారు కాదు; మాటలతో ఓదార్చేవారేగాని (6) |
4. వశిష్ఠ మహర్షి భార్యని పిలవండి (4) |
8. అందము, రీతి (2) |
9. దేవసంబంధమైనది, దివ్యము (5) |
11. సాలెవాని సాధనవిశేషము, చివర లేదు (2) |
13. వార్తాకి వృక్షము (3) |
15. బొంతరటి చెట్టు (3) |
16. కుడినుంచి ఎడమకి – అలుకుట, పూత, భోజనము (4) |
18. వ్రతములు (3) |
19. తటిని, నది, ఏరు (4) |
20. జూదము (3) |
21. తడబడిన స్థూలించు, అధికమగు (3) |
24. చిన్న (2) |
25. కపాలం కలిగిన శివుడు, కానీ మద్యలో అక్షరం మారిపోయింది (5) |
26. పాపాయి (2) |
29. చలించినది, కదలిక (4) |
30. వెంకటేశ్వర స్వామి భార్య (6) |
నిలువు:
1. పరితాపము, ఆరటము (4) |
2. చిలుక బృహస్పతి, ఉపన్యాసకుడు (2) |
3. గొప్పతనం, ప్రేమ, వాత్సల్యము, ప్రీతి (4) |
5. రంజు లా ధ్వనించే ఒక విధమైన చర్మవాద్యము (2) |
6. – – – – – -. సహాయము చేసే వారు లేరు. అడ్డం 1, తో కలిపితే ఒక నానుడి అవుతుంది. (6) |
7. శ్రేష్ఠుడు, అధిపతి, నాటక మందలి ప్రధానపాత్ర (3) |
10. పశువులను మందగట్టుట (7) |
12. ఒక కొండ, మహేంద్రము (5) |
14. కార్యసాధన కోసం మాట్లాడకుండా చేసే దీక్ష (5) |
17. తల్లిదండ్రులు (6) |
21. శివుడు, క్రింద నించి పైకి వచ్చాడు (3) |
22. ఓ ఋషి, ధర్మరాజు సభలో వుండేవాడు. (వ్యాస భారతం, సభాపర్వం నాల్గవ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఈయన ప్రస్తావన ఉంటుంది) (4) |
23. గంగానది, ముత్త్రోవద్రిమ్మరి (4) |
27. బ్రహ్మ, తెలుగు సంవత్సరాలలో పదవది (2) |
28. వృశ్చికం (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 17 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 145 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 22 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 143 జవాబులు:
అడ్డం:
1) అతలాకుతలం 6) ఋష్యము/ఋశ్యము 8) పరాభవము 9) ఉష్ణీషి 10) ముర 12) పబ్బము 13) తగాదా 15) చిరుచాప 17) మేను 18) భారం 19) హఈ 21) హవాతమూజీ 22) పరాశరుడు 25) పనస 26) రుడుకహదే 28) తిర్లిక 29) కంచిగరుడసేవ
నిలువు:
1) అపరాజిత 2) తరా 3) లాభము 4) కువరము 5) తము 6) ఋషిపత్ని 7) మునుముకొను 11) చిగురు 14) గాలివాన 15) చిరంజీవ సప్తకం 16) పహరావాడు 18) భామూ 20) ఈశ 23) డువుదేసువ 24) రిమితి 25) పసిక 27) కట్టడ
సంచిక – పద ప్రతిభ 143 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- ఎం.వి.ఎస్. రంగనాధం, హైదరాబాదు
- మంజులదత్త కె, ఆదోని
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.