Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 16

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పాదుక పట్టాభిషేకం చేసిందీయనే (4)
4.సామాన్యమైన ఒక సంవత్సరం (4)
8. తలుపులకు మాత్రమే కాదు పాటలకు కూడా దీనిని వేస్తారు (2)
9. స్పర్శమాత్రాన ఇనుమునో, మరేదైనా లోహాన్నో బంగారంగా మార్చే సాధనం (5)
11. నూరు లక్షలు ఇస్తే ఈ సంగీత దర్శకుడు దొరుకుతాడా? (2)
13. శత్రుత్వం చివర తేలికయింది (3)
15. కారణము గలది / చేయునది తిరగబడింది (4)
17.  జల్లికట్టు కాదు నిరోధించు (4)
18. చంద్రుడు (7)
19. వేల్పుఁబ్రోలు (4)
20. రంగువేయు (4)
22. అసురశిల్పి (3)
24. దండ (2)
25. చిరంజీవి అందరికి కావలసినవాడే కాని అటు ఇటు అయ్యాడు (5)
26. పితికేవీ పంచుకునేవీ (2)
29. ఉత్తర రామ చరిత్ర నాటక కర్త /శివుడే విద్యాసంపదగా కలవాడు – ఆషాఢభూతి మాత్రం కాదు సుమండీ (4)
30. కల్ప వృక్షము (4)

నిలువు:

2. రాయలసీమలో గొడవ (2)
3. తిరగబడినది వీరుడు కాదు ఉపశమనం (4)
4. “పవిత్ర గానాల వేదం” (4)
5. అందమైనది/ ఒప్పిదమైనది (2)
6.  క్రిందిలోకము,   బడబాగ్ని (4)
7.. ఇది లంకకు చేటు అని జన వాక్యం (4)
10. ఘంటసాలవారు కీర్తించిన తెలుగు కోడలమ్మ (7)
12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. (5)
14. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు అంటూ జేసుదాస్ గారు పడిన పాట ఈ సినిమాలోదే – దర్శకేంద్రుడి సృష్టి (5)
16. ఇచ్చగలది (3)
17. తియ్యనైనది (3)
19. సహజముగా (4)
21. చక్రాయుధం (4)
22. దమయంతి కాదు అడవిమల్లె (4)
23. ఏఎన్నార్, వాణిశ్రీ, కాంచన నటించిన 1973 సినిమా: వి.మధుసూదనరావు దర్శకత్వంలో –కిందనుంచి పైకి (4)
27.అడ్డం 24 లోనిదే – తినేది కాదండోయ్ (2)
28. ఈవిడ గురించి బృహస్పతి -చంద్రుడు, వాలి – సుగ్రీవుడు తగవులు పడ్డారు: వాళ్లకి దొరికీ దొరకకుండా పోయి ఆకాశంలో కూర్చుంది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 16 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 03 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 14 జవాబులు:

అడ్డం:   

1.తాంబూలము 4. పణిదము 8. నాల 9. భవబంధాలు 11. దాత 13. మాగావి 15. సంకటము  17. తరవాణి  18. విచిత్రకుటుంబము  19. మహారాత్రం  20. లాలసీకం  22. సబరు 24. పక్కా 25. సప్తముద్రాలు 26.  శ్యామ 29. న్యాయవాది  30. లుషభము

నిలువు:

2.బూరం 3.ము ట వ మా 4. పరీధావి 5.దర్భ 6. సునాయాసం  7. ధ్వాంతమణి  10. బంగారుకుటుంబము 12. నటవిరాట్  14.కరములవా 16. ముచిత్రం 17. తబలా 19. మహాపద్మం  21. కంబమయ్య 22. సప్తపది 23. రుద్రాక్షలు  27. ఛాయ 28. శోభ

సంచిక – పద ప్రతిభ 14 కి సరైన సమాధానాలు పంపిన వారు:

ఎవరూ లేరు

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version