సంచిక – పద ప్రతిభ – 23

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. లక్ష్మీదేవిని కలిగి ఉన్న ఒక సంవత్సరం పేరు(3)
3. దేశ వ్యవహార నిర్వహణమునకై వ్రాయఁబడిన నిబంధనలు. (3)
5. సంజాయిషీ కోరుచు హెచ్చరికగా పంపు లేఖ అడ్డం ఒకటి లాగానే వినబడుతుంది  (3)
7. దగ్ధము కాదు తినఁబడినది (3)
8. ఖర్జూరము (3)
9.  స్తుతింపబడినది (3)
11. చందనము (3)
12. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జ్వాలాముఖిలో ఉన్న అమ్మవారి పేరు (5)
14. నీటిలో పుట్టునది కాబట్టి తామర మాత్రమే కాదు ఉప్పు కూడా కావచ్చు (3)
15. శుభ్రము కాదు బెజ్జము (3)
17. బుద్ధదేవుడు (2)
18. బీజాక్షర చక్రము (2)
19. ఇండియన్ క్రికెట్ టీం లో ఉన్న ఒక ప్రఖ్యాత బౌలర్ ను ఇలా పిలుస్తారు – భూమి అని కూడా అర్థం  (2)
20. 10000000000  (2)
21. మోసగింపబడినది (3)
23. ప్రసిద్ధికెక్కినది – వాతము అనుకునేరు సుమీ – కాదు  (3)
25. నాగవల్లి  పిడతలు –   ఏకవచనంలో  (5)
27. మునిమనుమరాలు (3)
29. గుర్రం జాషువా కవిగారి జీవిత చరిత్ర (3)
30. కందగాని నల్లేరుగాని యెనిపి పులుసు పెట్టివండినది (3)
32. రత్నాకరుడు (3)
33. తామరల గుంపు (3)
34. సన్మానము (3)
35. పొదరిల్లు (3)

నిలువు:

1. ఈయన కూడా బుద్ధభగవానుడే (4)
2. తెడ్డు (3)
3. మేము రావడం లేదు – మారాము చేయొద్దు (2)
4. నీరు (2)
5. ఉభయ కావేరి మధ్యమున నున్న ఒక దివ్య క్షేత్రము (3)
6. తునుకలు – ప్రపంచ పటంలో కూడా కనిపిస్తాయి (4)
10. నేర్పు (3)
12.  ఇంద్రునిటెక్కెము (5)
13. ప్రపంచమంతా ప్రసిద్ధి కెక్కిన అని అర్థం (5)
14.  పొగడ్తను తనలో దాచుకున్నయదార్ధము (3)
16. తెలుగువాడి  ఫేస్ (3)
22. శ్వాస – నాగార్జున తో కార్తీ కలిసి నటించిన హిట్ సినిమా (3)
24. భగవంతునికి పాడే మేలుకొలుపు (4)
26. మదపుటేనుగు (4)
28.  కలర్స్ స్వాతి నటించిన హారర్ చిత్రం (3)
29. దేవతా స్త్రీ (3)
31. సారము (2)
32.  చిత్తూరు ప్రాంతంలో పంటలో సగము ధాన్యమునిచ్చు పద్ధతి – మేడిపాలు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 23 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 21 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 21 జవాబులు:

అడ్డం:   

1.పిళ్ళారి 3. నన్నయ 5. అభిని 7. వాసిగ 8. జ్వలనం 9. కణుజు 11. గంబుర 12. ద్రాక్షారామము 14. రుద్రాక్ష 15. త్యాగము 17. త్వచ 18. రత్నం 19. లీల 20. రమ్యం 21. కంగిస  23. జలజం 25. మువ్వన్నె విల్లు 27. రుధిరం 29. సావేరి 30. జవనం 32. పండుగ 33. డిబ్బెన 34. దిగుడు  35. రంగము

నిలువు:

1.పిష్టకము 2. రివాజు 3. నగ 4.యజ్వ 5. అనంగం 6. నికరము 10. ఆరామం 12. ద్రాక్షరసము 13. ముత్యాల జల్లు 14. రుచకం 16. మురజం 22. మన్నెము 24. పోరుదిండి 26. పారిజము  28. రంజన 29. సాగరం 31. నంది 32. పండు

సంచిక – పద ప్రతిభ 21 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here