[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకరు – నూరు పాయలుగా ప్రవహించే నది కూడా కావచ్చు (3) |
3. దీనికి వాయువు తోడైతే ఇంక అంతే! (3) |
5. రసుము – ఈ తమలపాకులు అంటే చాల నాణ్యమైనవి అని అర్థం (3) |
7. చందమామను తలపించే ఒక రాగము – శోక, పంతు, శ్రీ (3) |
8. ఆరోగ్యం (3) |
9. తగినది (3) |
11. చేప కాదండీ తేప (3) |
12. ఆశ కలిగిన వెంకన్నగారి మామగారు (5) |
14. ఇత్తడి కాదు చిత్తడి కాదు – బంగారమే (3) |
15. ప్రభువు సమక్షము (3) |
17. తెలంగాణావారి పల్లకి (2) |
18. నూతన (2) |
19. ప్రపంచంలోనే మొట్ట మొదటి నాస్తిక కేంద్ర సంస్థాపకుడు (2) |
20. ఋషి (2) |
21. వేడుక (3) |
23. పిల్లనగ్రోవి చెల్లా చెదరైనది (3) |
25. మోసగాడు (5) |
27. అత్తగారు లేకపోతే ఈవిడ చాలా ఉత్తమురాలట (3) |
29. చదునైనది (3) |
30. నేర్పరి – వినడానికి అడ్డం 29 లాగానే ధ్వనిస్తాడు (3) |
32. కత్తి పదును (3) |
33. రక్తచందనము (3) |
34. దీపావళి (3) |
35. కావేరి నది (3) |
నిలువు:
1. ఉపాయముగల ఒక సంవత్సరము (4) |
2. స్వర్గము (3) |
3. తుమ్మెద (2) |
4. ఉర్దూ కోట (కిలా) |
5. కొంచెము వజ్రముతో, శబ్దముతో (3) |
6. శ్రీకృష్ణుని గుఱ్ఱములలో ఒకటి – మంచి మెడ గలది (4) |
10. నిఘంటువు (3) |
12. —పాడినది పాట (5) |
13. అగ్నిదేవుడిని ముంబై బీచిలో వెతకండి (5) |
14. శ్రీకాకుళం ప్రజలభాష లో కాలం కాని కాలం (3) |
16. ర కు కొమ్మిచ్చి దానిని ఆమ్రేడితము చేసి ప్రథమావిభక్తిని జోడించండి – మీకోసం ఓ రాక్షసుడు దిగి వస్తాడు (3) |
22. జింక (3) |
24.శ్రేష్ఠమైన (4) |
26. ———నాభ సోదరీ శంకరీ పాహిమాం (4) |
28. సున్నా పెట్టకున్నా భూమిమీఁదిపొర్లిక అనే (3) |
29. రసముతో కూడినట్లైతే చేరువ అవుతుందా?(3) |
31. ఏనుగు (2) |
32. తోక లేని తోక (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 25 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 04 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 23 జవాబులు:
అడ్డం:
1.శ్రీముఖ 3. రాజ్యాంగం 5. శ్రీముఖం 7. జగ్ధము 8.గజ్జురం 9. నుతము 11. గంధము 12. వైష్ణవీదేవి 14. వారిజ 15. శ్వభ్రము 17. శాస్త 18. యంత్రం 19. భువి 20. ఖర్వం 21. వంచిత 23. ఖ్యాతము 25. ముచ్చుపిడత 27. ప్రపౌత్రి 29. నాకథ 30. పులప 32. వాల్మీకి 33. తంపర 34. సత్కారం 35. నికుంజం
నిలువు:
1.శ్రీఘనుడు 2. ఖజము 3. రాము 4. గంగ 5. శ్రీరంగం 6. ఖండములు 10. ప్రావీణ్యం 12. వైజయంతము 13. విశ్వవిఖ్యాత 14. వాస్తవం 16. ముఖము 22. ఊపిరి 24. సుప్రభాతం 26. గంధగజం 28. త్రిపుర 29. నాకిని 31. పస 32. వారం
సంచిక – పద ప్రతిభ 23 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ఎర్రోళ్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.