సంచిక – పద ప్రతిభ – 28

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సన్న బియ్యం కూడు లోకి ఇది ఉన్నది అని అలనాటి సావిత్రి పాట (6)
4. తెలుగులో తొలి ఎన్సైక్లోపీడియా – ఇప్పటికీ నడుస్తోంది – గాజుల వారి కృషి (4)
8. గ్రహముల యొక్క దినముల లెక్క (2)
9. గుళ్ళు – తిరుపతిలోనే కాదండోయ్ – అన్ని చోట్లా కనిపిస్తాయి (5)
11. తెలుపు నలుపు సినిమాలలో చివర ఇది చూపించేవాళ్ళు _ ఇంక ఇంటికి వెళ్ళచ్చు అని అర్థం! (2)
13. లే లేదని అటు ఇటు అయ్యిందని నమ్మలేదు (3)
15.  తిరుగునది – కుమ్మరి సారె కూడా కావచ్చు, రేణువాసము కావచ్చు (3)
16. గమనము తడబడింది (4)
18.  బావి నుండి నీరు చేదు కప్పీ (3)
19. బాలుడు (4)
20. తుల్యము (3)
21. సుఖాలు చెదిరాయి (3)
24. నేర్పరి (2)
25. ఓడినవారు (5)
26. ఈ గోల రామారావుగారిది (2)
29.  ప్రథమావిభక్తి లేని ప్రతాపరుద్రుని మంత్రి (4)
30. రెంటికి చెడ్డ రేవడు అనే అర్థాన్నిచ్చే మరో సామెత లో సగం (6)

నిలువు:

1. కుమారస్వామి (4)
2. అంతఃపురము (2)
3.ఆరుద్ర పదాల కొసమెరుపు (4)
5.ఇది ఎప్పుడురా మావాఁ అంటే మాఘమాసం ఎల్లేదాక మంచిరోజు లేదన్నాడే అనే ఒకప్పటి ఐటమ్ సాంగ్ (2)
6. జీవితం ఇంత చిన్నదని చెప్పడానికి భంగు తినాలా? (6)
7. పుట్టిల్లు సినిమా తో తెరంగేట్రం చేసిన ఒకప్పటి ప్రఖ్యాత హీరోయిన్ (3)
10. శ్రీకృష్ణుని వంశముతో మొదలయ్యే ఒక రాగం (7)
12. ఉసిరికాయ (5)
14. అమరారామం, ద్రాక్షారామం, భీమారామం, కుమారారామం, క్షీరారామం (5)
17. నమస్కరించు (6)
21. గారాబము (3)
22. క్రిందనించి పైకి పెద్ద పెద్ద ఇళ్ళు (4)
23. మరణం లేక పోవడం (4)
27. ఉడుము (2)
28. మేఘము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 28 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 25 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 26 జవాబులు:

అడ్డం:   

1.లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక 8. చితుకు 9. వలసరి 10. డి దిం రు పో 11. అడుగు  13. నిసి 15. కుని  16. ట్టు మె 18. వివ 19. కిరణము  20. తలరాసి  21. నూలు 22. దంతి  24. లంక  25. ట్టు  కొ  27. పన్నగం  30. లక్షణము  31. చిగురాకు . 32. జాతకం 34. వడ్లతో కూడ చేట ఎండినట్లు

నిలువు:

1.లోకువ దానికి నూకల జావ 2. ట్టు ర స పె 3. రుచి 4. మాతులుడు 5. ళ్ల కు 6. ఎయిదించు 7. కసిపోక వసి కొట్టుకున్నట్లు 11. అని  12. గుట్టు  14. సిరలు  15. కుముదం  17. మెతక  18.  విరాట్టు  23. తిప  24. లంగం  26. ము ణ ర తో  28. న్న వె త చే 29. సాగుబడి 32.  జాడ  33. కంట

సంచిక – పద ప్రతిభ 26కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here