Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆసరా / తోడు (5)
4. కృష్ణుని తేరు గుఱ్ఱములలో నొకటి (5)
7. ఒక తీపి వంటకం : తాపేశ్వరం కూడా వీటికి ప్రసిద్ధి (3)
8. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించినది (5)
9. అనేకులు కలసి భుజించుట (5)
10. విషయం (3)
12. ప్రథమా విభక్తి గతి తప్పింది (4)
14. మాటవినుమంటే అటు ఇటు చూస్తావేం? (4)
15. విష్ణుమూర్తిని ఇలా కూడా అంటారట (5)
16. తగువులు పెట్టడంలో ఈయనదే అగ్రస్థానం (4)
18. చంద్రకళ – సినీ నటి కాదండోయ్! (4)
21. మూర్ఖత్వం (3)
23. వడగాడ్పు (5)
24.దేవతల గురువు (5)
25. ముఖ్యుడు (3)
26. సంభాషించు – తడబడుతూ (5)
27. ప్రేమికుడు (5)

నిలువు:

1. చైత్రసారథి (5)
2. ఏనుగు (5)
3. దస్తకతులు – క్రిందనుంచి పైకి (4)
4. శ్రేష్ఠుడు (4)
5. కోరికలు తీర్చే చెట్టు అట (5)
6. రసాలము (5)
11. శుభకార్యాలకు దీనికి తప్పకుండ పసుపు రాస్తారు (3)
13. దోష నివారణకు దానం చేస్తే పాపం తలక్రిందులయ్యాయి (3)
14. దేనికైనా పట్టు తో పాటే ఇది కూడా ఉండాలని పెద్దలంటారు (3)
16. మాగవేయుట (5)
17. కాగలది కాక మానదని స్వప్రయత్నము చేయనివాడు. (5)
19. నాట్యం చేసే పక్షి – చివర ముందు వెనకలయ్యింది (5)
20. గరుత్మంతుడే – విష్ణువు నెక్కించుకోవడంలో కాస్త తడబడ్డాడు (5)
21. మొట్టమొదటిది, మూలమైనది. (4)
22 పూనిక, ఉనికి. (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చి 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 3 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 03 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 1 జవాబులు:

అడ్డం:   

1.బొజ్జదేవర 4. శుద్ధసావేరి 7. వివభ 8. యమదూతిక 9. లేమునలుప 10. లుశిఖ 12. లిఖితవ్యం 14. పలుకులు 15. గగ్గులకాడు 16. సామజము 18. కుముదము 21. కౌముది 23. వదరుబోతు 24. వ్యకలనంవ 25. కఠిన 26. కంకముఖము 27. దిఖంవసము

నిలువు:

1.బొరియచూలి 2. దేవదూలుత 3. రవికలు 4. శుభలేఖ 5. సాధనములు 6. రిసపరాలు 11. శివాలయము 13.వ్యంగము 14. పడుకు 16. సారావర్తకం 17. జలరుహము 19. ముత్యాలకోవ 20. ముదావహము 21. కౌతుకము 22. దివ్యనది

సంచిక – పద ప్రతిభ 1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version