సంచిక – పద ప్రతిభ – 31

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఈ సత్యం గారు అమరావతికథల కర్త (5)
4. 1952లో తొలి మద్రాసు అందాలసుందరి (మిస్ మద్రాసు) కూడా గెలిచిన – మా తెనుగు తల్లికి మల్లెపూదండ పాడిన ప్రఖ్యాత గాయనీమణి పేరు (5)
7. కొంచెం కొంచెం తడబడింది (3)
8. నీ లోపమువల్ల హారతులు ఒక ధాన్యవిశేషమైపోయాయి (5)
9. మెరుపు అటునించి మెరవాలని ప్రయత్నించి కాస్త అటు ఇటు అయ్యింది (5)
10.  ద లేని శత్రుత్వము (3)
12. స్నేహముతో (4)
14. విఘ్నేశ్వరుడు అనే (4)
15. గజడదబలు (5)
16. పరమాత్మ (4)
18.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన అత్తగారి కథల సృష్టి కర్త (4)
21. అటక   (3)
23. ఆసరా అవుతుందనుకుంటే ఈ మాట కాస్తా అస్తవ్యస్తమయ్యింది (5)
24. కుటుంబం, రాజకీయపార్టీ మొ|| వాటిలో విభేదాలు తలెత్తటానిని ఇవి మొదలయ్యాయని చెపుతారు- ఎటునించి చూసినా ఇంతే (5)
25. అటునించి చూసినా వస్త్రమే (3)
26. దాసరి నారాయణరావుగారే నండోయ్ అట్నుంచి వస్తున్నట్టున్నారు (5)
27. ఆవరించుకొను (5)

నిలువు:

1. కైలాసం (5)
2. నరము కలిగిన వెల్లుల్లిపాయ (5)
3. వీళ్ళు పాపం విధివంచితులు: చెదరి పోయి ధితు కోల్పోయి మిగిలారు! (4)
4. పాదరసము (4)
5. భూమండలము (5)
6. శత్రువులను గెలుచువాఁడు (5)
11. విక్రమార్కుని నవరత్నాలలో ఒకరు (5)
13. సంతోషము (3)
14. తడబడిన శుభాలు (3)
16. మనదేశపు అత్యున్నత పౌర పురస్కారం (5)
17. ఇది పదిహేను రోజులకొకమారు వెలువడుతుంది (5)
19. వేలుపు కూడా తడబడిపోతుంటే ఎలాగండీ బాబూ! (5)
20. కష్టాలపాలగు (5)
21. అడ్డం 10 లో ఉండాల్సిన ఒక ద కూడా లేదు కానీ ఈ కలత లో రెండున్నాయి (4)
22. ఔషధాది మర్దనశిలా అంటే మందునూఱెడు పల్లపుఱాయి అని అర్థం! (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 31 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 16 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 29 జవాబులు:

అడ్డం:   

1.నాదనామక్రియ 4. విశ్వావసు 8. జియ్య 9.నిజానిజాలు 11.చెంప 13. తందానా 15. నాటిక 16. అంటిగెల 18. అమేయం  19. వాయిద్యము 20. బురక  21. విధానం  24. కథ 25. నందనందన  26. పాట  29. ణం బా మ రా  30. రాముడు భీముడు

నిలువు:

1.నాగ్నజితి 2. నాకి 3. క్రిమిజాతం 5. శ్వాస 6. సురపనీలము 7. ఖజానా 10. నిదానమే ప్రధానం 12. కోటివిద్యలూ 14. కూటికొరకే  17. శ్రీవారి కల్యాణం  21. విదర్భ  22. నందకము  23. వేటగాడు  27. సుమ 28. భాభీ

సంచిక – పద ప్రతిభ 29 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here