‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. సంస్కృతంలో విశాఖదత్తుడు చేసిన అచ్చుతప్పు (5) |
| 4. చాలామందికి వయస్సు పెరిగే కొద్దీ వచ్చేది పాపం నానికి చాల చిన్నప్పటినుంచే ఉంది (5) |
| 7. అందమైన స్త్రీ (3) |
| 8. బాసికము కొంచెం తడబడింది (5) |
| 9. దశమావతారము యొక్క మహత్తు (5) |
| 10. దినము యొక్క పదునొకండవ భాగము (3) |
| 12. మంత్రప్రయోగాదులవలన శక్తినొంది శత్రువులను జంపి తిరిగివచ్చు ఆయుధములను గూర్చి తెలుసుకొను చదువు (4) |
| 14. ఏనుగును తనలో దాచుకున్న పుకారు – బహువచనంలో (4) |
| 15. గరుత్మంతుడు (5) |
| 16. గృహస్తును కలిగియున్న శుభము (4) |
| 18. కుశుని భార్య (4) |
| 21. వరిపొట్టు. (3) |
| 23. హాస్యగాడు (5) |
| 24. చివర కొమ్ము లేని చిన్న పువ్వు(5) |
| 25. ఇల్లాలు (3) |
| 26. నవమునీత (5) |
| 27. తెలంగాణంలో నేరుగా (స్వయముగా) చెప్పిన మాట (5) |
నిలువు:
| 1. రాజుగారి గది కాదండోయ్ మేడమీద గది – కింద నించి పైకి కోట బురుజు ఎక్కితే కనిపిస్తుంది (5) |
| 2. చెల్లా చెదురైన రావిరేకలు (5) |
| 3. కింద నించి పైకి రండి – అడ్డం 10ని పిండండి -ఇది వస్తుంది (4) |
| 4. రత్నాన్ని మింగిన పెద్ద బాన (4) |
| 5. గొప్ప బహుమానము /అనుగ్రహము(5) |
| 6. సూర్య చంద్రులు (5) |
| 11. పాదరసము (5) |
| 13. అటు ఇటు అయిన చికిత్స (3) |
| 14. రాట్నంతో దూదిని నూలుగా దీయు (3) |
| 16. విష్ణు భక్తికి పెట్టింది పేరు – రోజారమణి తొలిచిత్రం (5) |
| 17. డేగ (5) |
| 19. చిత్రానక్షత్రమే – తుది లేదు (5) |
| 20. భగవంతుని యభిషేకము (5) |
| 21. కానుక (4) |
| 22. ఎచ్చుతక్కువలులేక సరిగా నుండునది – చావత్తు లేదు (4) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 18 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 32 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 23 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 30 జవాబులు:
అడ్డం:
1.అడవి రాముడు 4. ని య త్యా కా 8. వేణి 9. కలదు సుఖం 11. కార 13. ముష్టక 15. బ్రహ్మాస్త్రం 16. పూర్వ జన్మ 18. యతులు 19. మరందము 20. యోగము 21. ప్రాయము 24. సింహి 25. సూచీముఖము 26. ధార 29. డుబుడుక్క 30. ప్రాసనియమము
నిలువు:
1.అసావేరి 2. విభ 3. ముసలము 5. యక్షి 6. కాశ్మీరజన్మము 7. ఇసుక 10. దుష్టచతుష్టయము 12. బ్రహ్మానందము 14. సర్వమంగళ 17. అమర సింహుడు 21. ప్రాచీన 22. ముఖముస 23. ధారకము 27. కడు 28.గయ
సంచిక – పద ప్రతిభ 30 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహన్‍రావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
















