‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పార్వతి (5) |
4. ఇంద్రుని గుఱ్ఱము (5) |
7. ఆద్యంతాలు లేని హరునికిక్కడ ఆది ఉంది అంతంలేదు (3) |
8. —— బడిపంతులుద్యోగమని అప్పట్లో చెప్పేవారు. ఇప్పుడు కాదులెండి. (5) |
9. కాశీనాథుని నాగేశ్వరరావు గారి బిరుదు – మధ్యలో తేలికయ్యింది (5) |
10. సమాచారం (3) |
12. వత్తు లేని శ్రీవారి ప్రసాదం అటునించి ఆమ్రేడితమయింది (4) |
14. పొడవైన (4) |
15. రాజధాని చెల్లాచెదరైనది (5) |
16. అడిగేవాడికి వీడు లోకువట (4) |
18. నూఱున్న ఒక నక్షత్రము (4) |
21. దీపాధార పాత్ర / సువాసనలిచ్చే తెల్లని పువ్వు (3) |
23. పుట్టపుట్టువు నోటినుండి పుట్టిన మహా కావ్యము కకావికలైనది (5) |
24. సీత దాటిన గీత (5) |
25. ఈ రేఖ వంకరకానిదే కానీ అటునించి గీసుకు రండి (3) |
26. వ్యవసాయము (5) |
27.ప్రళయమును తనలో దాచుకునేటప్పటికీ ఈ పాఠశాల కాస్తా గజిబిజిగా తయారైంది (5) |
నిలువు:
1. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ అంటూ 1978లో జనాలని ఉర్రూతలూగించిన జయమాలిని పాట ఈ సినిమాలోనిదే (5) |
2. అలవాటుపడు (5) |
3. హిందీలో ఒట్టు పెట్టుకున్న సింహము (4) |
4. మంత్రమును నేర్పించడానిని ఇలా అంటారు (4) |
5. నమ్మకము కలవాడు (5) |
6. స్వర్గ మర్త్య పాతాళములు (5) |
11.నవ్వి పోదురుగాక నాకేటిసిగ్గు అని నిర్మొహమాటంగా చెప్పిన కవి (5) |
13. సీతమ్మవారి కొడుకు (3) |
14. ఆసలేమి (3) |
16. చివర తెగిన సముద్రపు గట్టు (5) |
17. అరటిచెట్టు – బుస కొట్టేను జాగ్రత్తండోయ్ (5) |
19. దానము చేస్తుంటే ముందరది చివరికెళ్లింది (5) |
20. ఈ రాగం కుమారస్వామికిష్టమైనదా?! (5) |
21. హంస (4) |
22. గోపురము మీద శిఖరము (4) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 25 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 33 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 30 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 31 జవాబులు:
అడ్డం:
1.శంకరమంచి 4. సూర్యకుమారి 7. వంరత 8. రాజనములు 9. కలిలబాజ/కబాలలిజ 10. విభేము 12. సంగముతో 14. సుముఖుడు 15. సరళములు 16. భారూపము 18. భానుమతి 21. అట్టుక 23. తముపఊద / తఊపముద 24. లుకలుకలు 25. వలువ 26. త్నరకర్శద 27. ముసుగువఁడు
నిలువు:
1.శంకరావాసం 2. రసోనకము 3. చివంలువి 4. సూతకము 5. కువలయము 6. రిపుంజయుడు 11. భేతాళభట్టు 13. తోసము 14. శులుభా 16. భారతరత్న 17. పక్షపత్రిక 19. నుడులువాగు/నువాలుడుగు 20. తిప్పలుపడు 21. అ ద వ ద 22. కలువము
సంచిక – పద ప్రతిభ 31 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వెంకాయమ్మ టి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.