సంచిక – పద ప్రతిభ – 4

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఈరోజుల్లో వయసుడిగినవాళ్ళని చూసుకోలేక ఇందులో చేరుస్తున్నారు (5)
4. మాట చమత్కారము / పలుకుబడి (5)
7. బాహ్యేంద్రియ నిగ్రహం –  కొంచెం చెదిరింది  మరి (3)
8. చేయదగినది (5)
9. మందుతో గాని, అన్నముతో గాని చేర్చి పుచ్చుకొనెడు వస్తువు (5)
10.  స్త్రీయే — తడబడింది (3)
12. ఇన్ని కష్టాలే?! (4)
14. బ్రతిమలాడు (4)
15. సూర్యాది పరివేషము, సింగిడి – గజిబిజిగా (5)
16. పురుగు అటునించి పాకుతోంది (4)
18.శ్రీరాముని భక్తి పాటలతో/ ఘంటసాల అలనాటి మధురగీతాలతో… (4)
21. మర్యాదకు ముందుండేది –ముందు వెనుకలయ్యింది (3)
 23. బాలక్రీడా విశేషము – పుచ్చకాయలు కాదండోయ్! (5)
24. నిలువవే ——దానా అని అక్కినేని గారి పాట (5)
25. గుఱ్ఱపు పిల్ల (3)
26. తడబాట్లు (5)
27. దేవాలయాల్లో మ్రోగించేవి – ఎన్టీఆర్ గారి సినిమా కూడా (5)

నిలువు:

1. పార్వతి లక్ష్మి, శచి (5)
2. వినదగినది (5)
3. సంకోచము (4)
4. పర్మిషన్ సరిగా ఇవ్వలేదు (4)
5. బలరాముడు (5)
6. లుబ్బలుబ్బులు (5)
11. దేవతల టీచర్ (5)
13. న్యాయవాది వాదనలో తడబడ్డాడు (3)
14. పకోడీలు ఇలా తింటే బాగుంటాయ్ (3)
16. ముల్లోకములు (5)
17. కాశీకి వెళ్లి ఏదో తెచ్చారట.. మరి శివకాశికి వెళ్లి ఏం తెచ్చారు? (5)
19. ఎందరో ప్రముఖ నటులు ఇందులో రాణించాకే చలనచిత్రాలలో ప్రవేశించారు (5)
20. కష్టాలపాలు (5)
21. విత్తులోపలి భాగము/ పక్షి ధ్వని (బహువచనంలో) (4)
22. అకుల వారాలలో ఒకటి – మొదటి అక్షరం చివరికి వెళ్ళింది (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 05వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 4 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 10 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 2 జవాబులు:

అడ్డం:   

1.వజ్రహాసము 4. వినిమయము 7.ఖాతము 8. వలాహకము 9. ఖరనందన 10. ఖిలము 12. ముత్యములు 14.వామువరు 15. పంచముఖుడు 16. కలికలా 18. కరదము 21.లక్ష్యము 23. కోలాహలము 24. నులకతాడు 25. తిర్లిక 26. ల కోర త్తె క 27. లుర్థముదాప

నిలువు:

1.వజ్రావర్తము 2. హాలాహలము 3. ముఖాముఖి 4. విముఖము 5. మహానందము 6. ముసునవారు 11. లగ్నము 13. లుపంలా 14. వాడుక 16. కవికోకిల 17. కగ్రహణంర 19. రత్నాకరము 20. ము ధా డు రం ప  21. లముతిక  22. మునుకలు

సంచిక – పద ప్రతిభ 2 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • రామలింగయ్య టి
  • ఎస్. పూర్ణకుమారి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here