[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రామాయణం లోని మంథర యొక్క పూర్వజన్మకు, ఆ తరువాత భాగవతంలోని శ్రీకృష్ణుని తండ్రికి ఏమిటి సంబంధం ? (6) |
4. ఆరవ సంవత్సరము (4) |
8. పెర్మిషన్ లో మిరపకాయల పొడిని వెతుకుతారేంటండీ బాబూ? (2) |
9. మగకోయిల అటు ఇటు అయ్యింది (5) |
11. లాభము/ ఆదాయము (2) |
13. పట్టుదల – అటుగా (3) |
15. పాదరసము – చెట్టు కూడా (3) |
16. నడకయందలి కులుకు (4) |
18. ఘాజీ సినిమా చూతము రారండి – ముందు వెనుక చూడ బోతే దెబ్బ తగులుతుంది మరి (3) |
19. లక్ష్మీదేవితో తేలిగ్గా పేకాట ఆడితే దాదాపుగా ఇలాగె ఉంటుంది (4) |
20. ఇరవై (3) |
21. తాడుతోపాటే ఉంటుంది కానీ పట్టుకోవడం కష్టం – తిరిగి తిరిగి తారుమారయ్యింది + చివర వేడిగా ఉంటుంది మరి (3) |
24. అందము – ఆనందము (2) |
25. ఉత్కంఠగా (5) |
26. తోచీ తోచనమ్మ ఈవిడగారి పుట్టింటికి వెళ్ళిందిట (2) |
29. ఏవీయస్ గారికి చెల్లెలు (4) |
30. సమిష్టి వ్యవసాయం చేసే భూమి (6) |
నిలువు:
1. ఇది చెట్లకు కాసే కాయ కాదు సుమండీ – ఇంట్లోనే తయారు చేసుకునేది (4) |
2. ఇంద్రధనుస్సు (2) |
3. వస్త్రము (4) |
5. కృష్ణుడు అర్జునుడికి బోధించినది (2) |
6. సీనియరు ఎంటీయార్ గారి రాముడు జాబితాలో ఒకటి సరదాగా (6) |
7. ముమ్మరము – కోపంగా (3) |
10. ఒక సామెత – కళ్ళకు కట్టేదానికి పడుకునేటందుకు వాడేదానికి జత అట (7) |
12. కాశీనాథుని నాగేశ్వరరావుగారి బిరుదు (5) |
14. వ్యాసుడినుంచి ఎర్రనగారు , ఎర్రనగారినుంచి జగన్నాధ శర్మ గారు మనకందించిన శ్రీకృష్ణుల వారి చరిత్ర (5) |
17. ఒక రాగము : శివునికి ఇష్టమైనదా ? (6) |
21. అసాధ్యమైనది – హిందీవాడి నగ – వినడానికి ఆకాశంలాగా అనిపిస్తుంది (3) |
22. వేగముగా పోవుట (4) |
23. ప్రభుత్వము ఒక విషయమునకు సంబంధించి పూర్తి సమాచారము ప్రకటించు నివేదిక – తెల్లటి ఆకు అంటే కుదరదు (4) |
27. పతియందు మాత్రము అనురాగముగల నాయిక – తనది కూడాను (2) |
28. సంగీతమందు తాళముయొక్క కాలము, మోసము- ఒకప్పటి తెలుగు నటి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 5 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 17 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 3 జవాబులు:
అడ్డం:
1.అండ దండలు 4, మేఘపుష్పము 7. కాజాలు 8. భగవద్గీత 9. బంతికుడుపు 10. సంగతి 12. డువుములు 14. వినుమాట 15. లతాపర్ణుడు 16. ముళ్లయతి 18. పునర్భవ 21. మౌఢ్యము 23. వేసవిగాలి 24. నుడుగురేడు 25. కన్నాకు 26. ట లా డు చ్చ ము 27. వలపుకాడు
నిలువు:
1.అంగభవుడు 2. దంతావళము 3. లుకాతసం 4. మేలుబంతి 5.పుడుకుమ్రాను 6. ముత్తెపుబంట 11. గడప 13. లులతి 14. విడుపు 16. ముగ్గవేయుట 17. యద్భ విష్యుడు 19. నట్టుగులుపు 20. వజ్రడుతుండు 21. మౌలికము 22. మునుకువ
సంచిక – పద ప్రతిభ 3 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధా సాయి జొన్నలగడ్డ
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోళ్ల వెంకట్ రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- ఎస్. పూర్ణకుమారి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.