[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నేర్పుగల మాట (4) |
4. రంగులరాట్నము (4) |
7. తరలింపదగిన సంపద (5) |
9. మాల్యాది/గద్యపద్యాది నిర్మాణము (3) |
11. భూమి (3) |
13. తిరుగబడిన ఱంపమునకు జుట్టు లేదు (2) |
14. తైలం (3) |
16. వంట (2) |
17. పాముకాటు లో 1,3,4 (3) |
18. పద్మము (3) |
19. చివర చిరిగిన చిన్నచాప (2) |
20. అటుగా లక్ష్మీదేవి (3) |
22. ఆద్యంతాలు లేని పలుచన (2) |
24. బండి నడవాలంటే ఇది అవసరమే కానీ తిరిగి తిరిగి అటు ఇటు అయిపొయింది (3) |
26. అకస్మాత్తు (3) |
27. రాలేని సముద్రము తడబడింది (5) |
30. అటుగా పక్షిపిల్ల (4) |
31. చరిత్ర (4) |
నిలువు:
1. చతురస్రము (4) |
2. ఉత్తమ స్త్రీ (3) |
3. అనురాగము కింది నుంచి పైకి పాకింది (2) |
4. ప్రత్తిచెట్టు (2) |
5. సక్రమముగా లేని అక్రమము – మ మాయమైంది! (3) |
6. ఆమ్రేడితమైన లచ (4) |
8. మొదలులేని అచ్చుపని (3) |
10. రథము (5) |
12. పటాపంచలైన పటాపంచలు (5) |
14. మెరుపు (3) |
15. పొట్టిది అస్తవ్యస్తమైంది (3) |
19. గుండ్రనిది (4) |
21. జీర్ణింపచేయునది (3) |
23. ఒకరకం కుండ (4) |
25. చివరి (3) |
26. చిగురుకొమ్మ (3) |
28. ఆడేనుగు (2) |
29. బృహస్పతి కొడుకు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 51 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 05 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 49 జవాబులు:
అడ్డం:
1.పరకాయ ప్రవేశం 5. ఏడ 6. క కా 8. డగరు 10. విరులు 11. డులుపు 12. షి 13. వేడుక 14. హూతం 15. వీక/జోక/ఢాక 17. మునగ 19. బంధక 20. తోడనే 24. రౌద్రం రణం రుధిరం
నిలువు:
1.పడగలు 2. కాసు 3. ప్రభ 4. శంకరుడు 5. ఏడడుగుల బంధం 7. కాలు కడుగనేల 9. రుపుహూతిక 10. వివేకముతో 16. బోధి 18. నడ 22. గీర 23. పోరు
సంచిక – పద ప్రతిభ 49 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- ఛాయామల్లిక్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రోళ్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.