Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 57

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తోడిపెండ్లామున్న వంటిల్లు (4)
4. టెస్టులలో పదివేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెట్ ఆటగాడు – చివర తత్సమము చేయండి (4)
7. పిల్లవాడు (2)
8. గుఱ్ఱము (2)
9. (యుద్ధము నుండి) పారుట (3)
12. దప్పి/ఆశ (3)
14. మూట తోడిది (2)
15. అందము (3)
17. కు కోల్పోయిన ప్రజలు (2)
18. పాలించు (2)
19. అయిదువ్రేళ్లను కొనలుగూర్చి పట్టిన అభినయ హస్తవిశేషము (3)
21. రోగము (2)
23. తడబడిన పట్టణము (3)
25. మాటిమాటికి (3)
26. సిక్ఖులు విధిగా పాటించవలసిన ఐదు నియమాలలో ఇది ఒకటి. చురుకు అయినది (2)
28. ఇల్లు మీ సొంతది కాకపోతే ఇది కట్టాలండీ మరి! (2)
29. హెడ్ లైన్స్ – ముందు వెనుక గూడ వుంటాయి – మీరు తెలుగులో చెప్పండి – సరిపోతుంది (4)
30.  తిరుమలలో హరి నామస్మరణ లో ఉన్న రాగం లోనే లంబోదర లకుమికర స్వరపరచబడింది (4)

నిలువు:

1. రసాయనశ్రేష్ఠము (4)
2. నీరు (3)
3. తీగ (2)
4. ఈ పుణ్య క్షేత్రాన్ని సాగదీస్తే అన్యదేశ్యములో వెళ్ళాడు (2)
5. న్యాయాధిపతి విమర్శనకై నియమించిన దినము (3)
6. ధారాసంపాతమును తిరగేస్తే లాభము ఉంటుందా? బహువచనములో (4)
10. పాశ్చాత్యుడు (5)
11. సమృద్ధి (2)
13. క్యాడ్ బరీ 5 నక్షత్రాల చాకోలెట్ ప్రకటనలో కనిపించే కుక్క పిల్లల పేర్లు (2,3)
15. గంభీరమైనది (3)
16. హంస (3)
18. ఎకరము స్థలములో ఒకటికి గుణింతం మార్చి మరో రెండక్షరాలు తారుమారు చేసి చూడండి – మీకో రత్న కంబళి కనిపించకపోతే అడగండి! (4)
20. కంసుని నగరంలోని సైరంధ్రి (2)
22. శివుడు (4)
24. తలక్రిందులయిన కూర (3)
25. రోలు వెళ్లి దీనితో మొరపెట్టుకున్నదట! (3)
27. నశించు (2)
28. పూజ్యస్త్రీ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 11   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 57 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 15 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 55 జవాబులు:

అడ్డం:   

1.లొడిగి 4. లభసం 6. యజనం 7. గండ్రిక 8. కుక్క కాటుకు చెప్పుదెబ్బ 9. మతకం 11. అసిమి 13. తంత్రకం 14. యక్షుడు

నిలువు:

1.లొట్టియ 2. గిళనం 3. ఎంత చెట్టుకు అంత గాలి 4. లవంగం 5. సంచిక 9. మహితం 10. కందకం 11. అక్షయ 12. మిత్రుడు

సంచిక – పద ప్రతిభ 55 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version