సంచిక – పద ప్రతిభ – 59

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి (7)
7. వికాసము (2)
9. ఒక తెలుగు సంవత్సరము 32వది (3)
10. రక్షించే అనే (2)
11. యుద్ధ వ్యూహవిశేషము (3)
13. ఈ బెనర్జీగారిని దీదీ అని వ్యవహరిస్తారు లోకల్ గా – ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు (3)
14.  అడ్డగోడమీది పిల్లి  వంటిదే  కాకపోతే కాకి ని వాడారు ఈ సామెతకి (5)
17. నాణెమైనది, నాజూకైనది – గడ్డికూడా కనిపిస్తుందిందులో (4)
19. కైవల్యం, తిరగబడింది (4)
21. కూడుకొన్నది. (2)
23.మేలు, మంచిదైన అన్యదేశ్యములో (2)
24. అటునించి చూస్తే దేనికీ లోటే లేని గొప్ప పరిపాలనకు ఉదాహరణం కనిపిస్తుంది (5)
28. సాహిత్యాకాశంలో సగానికే ఈవిడకు అకాడమీ అవార్డు లభించింది 2013 లో (7)

నిలువు:

2. శ్రీప్రదము (2)
3. నా దేహమే నీ —– (3)
4. ఎరుకలది (2)
5. భారతకోకిల (7)
6. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి (7)
8. సన్నని భూభాగము (2)
10. గొడుగు పట్టుకోవటానికి, ముఖ్యంగా తెరచినప్పుడు పట్టుకోవటానికి, ఆధారమైన ఇనుప లేదా కర్ర చువ్వ (2)
12. గాయకుడు (3)
13. రొంప మటు మాయం – 3, 6, 2 (3)
15. ఇరుగుడు చెట్టు మీద వాలిన కాకి (2)
16. భోజనము, కుడుపు (2)
18.. గడచిపోయినది (2)
20. అరటిచెట్టును తలపించే అప్సరస (2)
22.  ఒక పదవిలో నియమించుట అనే క్రియ తలక్రిందులైంది (3)
24. కిందినించి పైకి విడువదగినది (2)
25. సగమే ఉన్న దౌత్యం (2)
26. అశ్వత్థము (2)
27. పౌర పురస్కారాలలో నాలుగవది – మొదలు కోల్పోయి తిరగబడింది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 59 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 30 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 57 జవాబులు:

అడ్డం:   

1.రసవతి 4. గవాస్కరు 7. నవ్వ 8. యయి 9. ద్రవము 12. దాహము 14. ముల్లె 15. మంజిమ 17. లోలు 18. ఏలు 19. ముకుళం 21. రుజ 23. రపుము 25. మగుడ 26. కరా 28. అద్దె 29. ముఖ్యాంశాలు 30. మలహరి

నిలువు:

1.రసేంద్రము 2. వనము 3. తివ్వ 4. గయ 5. వాయిదా 6. రుసుములు 10. వల్లెతాలుపు 11. పుంజి 13. హలో జరుగు 15. మంద్రము 16. మరాళం 18. ఏరకము 20. కుబ్జ 22. జడదారి 24. ముకశా 25. మద్దెల 27. రాలు  28. అమ

సంచిక – పద ప్రతిభ 57 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here