సంచిక – పద ప్రతిభ – 6

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గుర్రం జాషువా గారి బిరుదులలో ఒకటి (6)
4. నా మనసు నా ఆధీనంలో లేదు (4)
8. వేయి యుగములు (2)
9. సంవత్సరాది రోజున (5)
11. ఒక కృష్ణ  భక్తురాలు – తమరా? (2)
13. సూర్యకిరణములు (3)
15. బైరాగుల మఠములో ఇంగువ దొరుకుతుందా? (3)
16. ఔరంగజేబు సోదరేగాని రోషం లేదు (4)
18. నివాసము (3)
19. చంద్రుడు — శుభ్రంగా ఉన్నాడట (4)
20. రాజు / భర్త (3)
21.  శ్రేష్ఠమైనది   కుడినుంచి ఎడమకు (3)
24. మొదటి సినిమాతోనే మూడు అవార్డులను గెలుచుకున్న అలనాటి  జూలీ  (2)
25. పాము కాదు  బాతు  కాదు –  ఈ  యుగంతో మొదలయ్యే  ఒక పక్షి విశేషము (5)
26. ఇది కూడా పాటేగాని రాగం తాళం ఉండవు మరి (2)
29. విక్రమార్కుడి నవరత్నాలలో ఒకడు – డాక్టర్ అఫ్ గాడ్స్ కూడానట (4)
30. పొగడ చెట్టుతో మొదలైన నగ ఒక రాగమైనది (6)

నిలువు:

1. శ్రీ శ్రీ / కాళిదాసు /క్షేత్రయ్య (4)
2. విరక్తి లో ఉండికూడా లేనిది (2)
3. తండ్రి – గౌరవ వాచకంతో (4)
5. తేరుల గుంపు / రాజమార్గము (2)
6. జే వీ సోమయాజులు గారికి పెద్ద గుర్తింపు తెచ్చిన సినిమా (6)
7. అమ్మవారిని పూజించే హిందువుల పండుగ – తెలంగాణాలో బాగా ప్రాశస్త్యం (3)
10. ————- దేవుడే దిక్కు (7)
12. . శివుడేనూ! (5)
14. విరాటపర్వంలో తంత్రీపాలుడు –  భగవంతుడితో  (5)
17. సంస్కృతంలో మాఘుడు వ్రాసిన మహాకావ్యము – కృష్ణావతారంలో ముఖ్యమైన  ఘట్టం (6)
21. మిక్కిలి బలమైనది క్రిందనుండి పైకి (3)
22. తడబడుతూ ఆహ్వానించవద్దు(4)
23.  ఆఖరుగా పుట్టిన రాష్ట్రము (4)
27. ఇచ్చువాడు (2)
28. వెలుగు, కుబేరుని పట్టణము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 6 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 24 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 4 జవాబులు:

అడ్డం:   

1.వృద్ధాశ్రమము 4. నుడికారము 7. దనంమ/దముమ 8. కరణీయము 9. అనుపానము 10. దసుతి 12. ఇడుములు 14. వేడుకోలు 15. వదగురడి/వరగుదడి 16. ముకటకీ 18. గానామృతం 21. పవురు 23. గచ్చకాయలు 24. వాలుకనుల 25. కుమారం  26. లుకలుకలు 27. గుడిగంటలు

నిలువు:

1.వృషాకపాయి 2. శ్రవణీయము 3. ముదముద 4. నుమఅతి 5. కామపాలుడు 6. ముద్దముద్దలు 11. సురగురువు 13. లువకీ 14. వేడిగా 16. ముజ్జగములు  17. టపాకాయలు  19. నాటకరంగం  20. తంటాలపాలు 21. పలుకులు 22. రువారంగు

సంచిక – పద ప్రతిభ 4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోళ్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here