[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. బంగారు మేను గల స్త్రీని తలపించే ఒకరాగము (4) |
4. గడచిన సంవత్సరము (4) |
7. పశువు (2) |
8. రాశి/సొద/ ప్రోగు (2) |
9. హోమము (3) |
12. ముమ్మరం (3) |
14. చంద్రగుప్తుని జనని (2) |
15. విజయావారి ఆస్థాన మాటల పాటల రచయిత – అక్షరమాంత్రికుని ఇంటిపేరు – (3) |
17. మొదలులేని పికము (2) |
18. చివరలేని ద్రాక్షపండు (2) |
19. కామధేనుతనయ (3) |
21. ఒక నక్షత్రము – ఈ పేరుతో ఒక ప్రసిద్ధిగాంచిన వార/మాస పత్రిక (2) |
23 ఈ తప్పెటకు అంతమే లేదు (3) |
25. పాలలో వేసే మజ్జిగ తోడు (3) |
26. ఆ లేదంటే సంతోషం (2) |
28. దాయాది (2) |
29. అడుక్కునేవాడు కాదండోయ్ చాణూరుని తోటివాడు (4) |
30. కొడవలి (4) |
నిలువు:
1. చెవులున్న గంగాళము (4) |
2. బంగారం (3) |
3.కొండ (2) |
4. పరిశుద్ధమైనది /అగ్ని (2) |
5.అప్పటప్పటికి వికసించెడు బుద్ధిని చూడండి ఉల్టాగా (3) |
6. నవతా ఆర్ట్స్ వారి ఈ సినిమాతో నటుడు రంగనాథ్ కు మంచి గుర్తింపు వచ్చింది; నటి లక్ష్మికి నంది అవార్డు దక్కింది – కాకపోతే ఈ టీచరమ్మగారు కాస్త తడబడింది (4) |
10. శారదలేఖలతో చైతన్యం కల్పించిన తెలుగు రచయిత్రి (5) |
11. కాశీకి పోయాను రామాహరీ —– తీర్థమ్ము తెచ్చాను రామాహరి (2) |
13. తృణకంకణం రచయితగారి బిరుదు (5) |
15. దూదేకువిల్లు. (3) |
16. హారతిని కిందనించి పైకి చూపిస్తున్నారేమిటీ? (3) |
18. ప్రయత్నము (4) |
20. ఉసిరిక చెట్టు (2) |
22. ముష్టి (4) |
24. గజిబిజిగా కిరీటము (3) |
25. చేరగరావే రయమున యమునాతీరమునకు – 1,10,6 (3) |
27. సేన (2) |
28. దేవుడిని క్రిందనుండి పైకి చూసినా కనిపిస్తాడు అటునుండి ఇటు వ్రాసేవారి భాషలో (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 9వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 61 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 14 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 59 జవాబులు:
అడ్డం:
1.ప్రతిభాదేవిసింగ్ 7. రోకు 9. విళంబి 10. కాచే 11. జినిసీ 13. మమతా 14. కాకాక్షిన్యాయం 17. నాగరికం 19. దంపరంప 21. యుతం 23. భలా 24. జ్యం రా మ రా శ్రీ 28. కాత్యాయనీ విద్మహే
నిలువు:
2.తిరు 3. దేవళం 4. సింగి 5. సరోజినీ నాయుడు 6. సుచేతాకృపలానీ 8. కుని 10. కామ 12. సీకారి 13. మయంప 15. కాకం 16. న్యాదం 18. గతం 20. రంభ 22. కం మ నీ 24. జ్యంత్యా 25. రాయ 26. రావి 27. శ్రీద్మ
సంచిక – పద ప్రతిభ 59 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- మత్స్యరాజ విజయలక్ష్మి
- రామలింగయ్య టి
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.