సంచిక – పద ప్రతిభ – 64

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆస్కార్ అవార్డు పొందిన సినిమాలోని  ఏనుగుల పేర్లు (2, 2)
3. చంద్రుడు (4)
6. సూర్యుని వెలుగు (ఏకాక్షరము)
7. భిక్షుకులు గృహస్థుల యిండ్లకుబోయి భిక్ష గ్రహించి జీవించుట (4)
9. వంశపారంపర్యముగా వచ్చు ఆస్తికి హక్కుదారుడు తడబడ్డాడు (4)
10. మొదలే లేని వింతగుళికలు (5)
11. వింటి నారి, భూమి (ఏకాక్షరము)
12. మిక్కిలి (ఏకాక్షరము)
14. కాకి (5)
17. 2016లో విడుదలయిన రష్మీ గౌతమ్ సినిమా (4)
18. సూపము (4)
19. నల్లగొండజిల్లాలో ఇలా అంటే సిద్ధము అని – ఎస్ ఎస్ రాజమౌళి గారు కూడా నితిన్ తో కలిసి ఇదే  మాటన్నారు (ఏకాక్షరము)
20. కలగాపులగమైన ముకుందుడు (4)
21. ఈ బహుమానం ఏమిటోగాని పాలుపోసినట్లుగా అనిపిస్తోంది (4)

నిలువు:

1. ఇది పెనుభూతంగా  మారుతుందట (4)
2. రసజ్ఞత. (4)
4. గయ్యాళి (4)
5. రాక్షసుడు (4)
8. 1984లో 31వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో  ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న బి నరసింగరావు సినిమా (5)
9. సముద్రము  చెల్లాచెదురైంది (5)
13. అలవాటు, సాంప్రదాయము (4)
14. అగ్ని దేవుడు (4)
15. ముగ్ధస్త్రీ (4)
16. విజయావారు పప్పుకూడును ఇలా సంపాదించి తినమన్నారు (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 30తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 64 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 04 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 62 జవాబులు:

అడ్డం:   

1.పంచకన్యలు 4. పుదుఅ 6. రవాణా 7. పసుపులేటి 8. గోమేధికం 9. గుపామ్మిల 12. యథార్థవాది 14. పడదు 16. త్రంతంస్వ 17. డుఖుమురిక

నిలువు:

1.పందార 2. కరుణానిధి 3. లులాపము 4. పులుపు 5. అరటిగెల 8. గోమయచ్ఛత్రం 10. పాశుపతము 11. నిందితుడు 13. ర్థ ము స్వ 15. దుగ్ధిక

సంచిక – పద ప్రతిభ 62 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • ప్రవీణ డా.
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here