Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 65

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. త్రేతా యుగంలో ప్రసిద్ధికెక్కిన కవలలు (5)
4. వెనుదిరిగిన వేడి (3)
6. శ్రేష్ఠమైన పట్టుపంచె ఎటునుండి చూసినా! (3)
7. అతిశయించుట (5)
8. ఇలా కొట్టుకోవటమంటే చాలా బాధ పడుతున్నట్టని అర్థం (4)
9. మొదలేలేని  మొదలగునవి  (4)
12. శుభము, సుఖము  (5)
14. ఐదు రోజుల పెళ్లిళ్లలో నాల్గవ రోజున జరిపే ఒక పెళ్లి తంతు (3)
16. ఏనుగు కాలి  సంకెల  (3)
17. తెలుగులో  పేరడీలకు  ఈయనను ఆద్యుడిగా భావిస్తారు (5)

నిలువు:

1. చొక్కాయి (3)
2. ఈ దేవత సహస్రనామ స్తోత్రాన్ని అనేకులు ప్రతిరోజూ పారాయణ చేస్తారు (5)
3. చలించినది (4)
4. ఆడుది (3)
5. విజయ విలాస కర్త – ఇంటిపేరు వ్రాయనక్కరలేదు (5)
8. ఈయనగారి పెళ్ళికి ఎప్పుడూ అడ్డంకులేనట (5)
10. సిక్ఖుల తొలిగురువు (5)
11. మేఘం కిందినుండి పైకి వెళ్ళింది (4)
13. జత (3)
15. వ్రణములకంటించు మలాము పట్టి. (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 06తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 65 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 11 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 63 జవాబులు:

అడ్డం:   

1.పరమపదసోపానము 6. మాటలతో 7. కోకోకోల 8. శ్రీ  9. దర్భ  10. ఖ  11. రై/రో  12. దాళా  14. హ్రీ  16. శివదత్తం  17. దావానల 19. లు దు నా ద నం స క న స

నిలువు:

1.పరమానందయ్య శిష్యులు 2. మదాలస 3. దగ్ధ 4. పాలకోవా 5. ము య ల ని ళా క ల క స 13. త్వం ద ర నా 15. ఏవారుక  18. దానం

సంచిక – పద ప్రతిభ 63 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version