సంచిక – పద ప్రతిభ – 66

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సత్యవంతుడి అత్తగారు – ఒక రాగం పేరు కూడా (3)
3. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు (4)
5. భర్తృమతి (4)
6. విద్వాంసుడే కానీ తడబడ్డాడు పాపం !  (4)
8. హస్తభూషావిశేషము – ఇది కూడా చెల్లా చెదురయ్యింది (4)
11. సముద్రం కూడా అల్లకల్లోలమయ్యింది (3)
12. అటునుండి చూడండి – కృత, త్రేతా, ద్వాపర మరియు కలి కనిపిస్తాయి! (4)
15. పూత  ఆ వైపునుండి పూసుకోండి (4)
16. పెళ్లయినా ఒడుగు అయినా ఇది చూడందే పని జరగదు (4)
17. అడ్డం 6 లో వారేనండోయ్  – బహువచనంలో — కాస్త రసికులు కూడానట! (4)
18. ఎప్పుడైనా ఒకమాటు, అరుదుగా (3)

నిలువు:

1. మౌనం బంగారం – ముందరేదో ఉంది – ఒక ఆంగ్ల సామెతని గుర్తు చేసుకోండి (4)
2. మిక్కిలి విడువఁబడినది (4)
3. అది కొయ్యేనోయ్ ఇవి మన్నేనోయ్ – కనుగొంటే సత్యమింతేనోయ్ అని సముద్రాల సీనియర్ గారన్నారు. ఏమిటవి ఇంతకీ ? (6)
4. నిధి తోడిది (3)
7. భగీరధి (గంగా నది)లో స్నానము చేస్తే ఎంత పుణ్యము వస్తుందో ఆ పుణ్యానికి సమానమైన పుణ్యము ఇచ్చునది – ఈ  నదిలో హంస వాహనంపై  శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది (4)
9. యజ్ఞముచేయుట కొంచెం కష్టమే మరి. తడబడితే ఎట్లా? (4)
10. ఇవీ, కష్టసుఖాలూ 3 నిలువులో ఉండేవేనని భయమేలోయీ – ఈ వింతేనోయీ!! (6)
13. కోపమున కలుగు చిరచిర (4)
14. త్రేతాయుగంలో భరతుని మేనమామ (4)
15. లేత కానిది – ఒక రెండు కొమ్ములు ఉన్నా లేకున్నా అర్థం ఒకటే (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 13తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 66 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 18 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 64 జవాబులు:

అడ్డం:   

1.అమ్ము, రఘు 3. తొగదొర 6. భా 7. మాధుకరం 9. రవాడుసు 10. తగుళికలు 11. జ్యా 12. మా 14. ద్వికకారము 17. చారుశీల 18. ముద్దపప్పు 19. సై 20. ముకుండుదు 21. పాలువాసి

నిలువు:

1.అనుమానం 2. రసికత 4. గట్టివాలు 5. రక్కసుడు 8. రంగులకల 9. రకత్నారము 13. ఆచారము 14. ద్విశీర్షుడు 15. ముద్దరాలు 16. అప్పుచేసి

సంచిక – పద ప్రతిభ 64 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here