సంచిక – పద ప్రతిభ – 69

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. —–సాపాటు మాత్రం తప్పదు! (6)
5. కర్ణుని పట్టణము (2)
7. ఇంద్రధనుస్సు (2)
8. చలించు దిశను ఉపేక్షించి వస్తువు చలించు పరిమాణము (Speed) – కాంతి అనుకునేరు — కాదు సుమీ! (2)
9. కపిలతీర్థం ఈ ఊరిలోని ప్రసిద్ధ శివాలయం (6)
11. జాతకముచెప్పేటపుడు దీనిని గురించి ప్రస్తావిస్తే కష్ట కాలమో లేక అంత్య కాలం గురించి చెప్పడమే ఇక – అందుకే భయమేసింది కాబోలు – గజిబిజిగా అయ్యింది (5)
12. స్త్రీ (2)
14. అటునించి చూడండి – మిక్కిలి కనిపిస్తుంది (2)
15. వంద (2)
16. బాలక్రీడా విశేషము – ఎక్కడైనా ఆడవచ్చునుగాని హనుమంతుని ముందర మాత్రం వద్దని చెప్పండి (5)
19. భార్య (2)
20. మోచేయి (3)
23. అక్ష పటలము పరాయిదయ్యిందా (2)
25. చంద్రుడు, బృహస్పతి, వాలి, చలనచిత్రాలకు సంబంధించినది (2)
26. శతభిషా నక్షత్రము (5)
27. ఆడు మేక పిల్ల (3)

నిలువు:

1. కొత్తగా కనిపెట్టిన యంత్రము మొదలగువానిపై ప్రభుత్వము ఇచ్చు హక్కు పత్రము – పేటెంటు (3)
2. ఆవలి దరి; సమీపము (2)
3. అగ్నిదేవుడు (6)
4.ఇది తీసుకుంటే ఇక వైకుంఠ యాత్రేనండోయ్!  (5)
5. ఉడతాభక్తి అనే అర్థం వచ్చేలాంటి ఇంకో సామెత లో పోగు మాయమయింది (6)
6. భర్త (2)
9. పిచ్చి చివర తేలికయింది (2)
10. ఉపశమనములో 2,3(2)
11. కకావికలయిన దాహము (3)
13. నిర్జలప్రదేశము – ఈ భూమి మానవ జీవితములో ఆఖరి మజిలీ (2)
14. పిలుచువాఁడు, వార్తాహరుఁడు కాస్తా తిరగబడ్డాడు (5)
17. చివర గుడి లేని సంపెంగ (4)
18. మొదలు లేని మూషికము (2)
19. శ్రేష్ఠము (2)
21. ఒప్పిదము (2)
22. అక్కడక్కడ పలుద్వారములు ఉంచి ఆద్వారములయందెల్ల తగినకావలి ఉంచి ఉండుటఁజేసి ఈ నగరమునకు ఈపేరు కలిగెను (3)
24. తలక్రిందులుగా వ్రేలాడుతున్న యజమాని (2)
25. మొదలు చివర లేని అడవి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 04 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 69 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 09 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 67 జవాబులు:

అడ్డం:   

1.ఏధము 3. త్రివేద 8. లాస్య 9. తారక 10. సున్నం 13. పల్లవి 14. దేహిని 18. రాజీ 19. దైవజ్ఞ 20. ధాత 23. శలభం 24. అసిమి

నిలువు:

2.ధన్వి 4. వేల్పు 5. ఉలారం 6. భారతి 7. దున్నంగి 11. మల్లన్న 12. రోహిత్తు 15. ఐరాస 16. శ్రీవత్స 17. కేతన 21. లోల 22. ససి

సంచిక – పద ప్రతిభ 67 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here