Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 74

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మినుకు చేడియ (4)
4. మిణుగురు పురుగు (4)
7. దాసన వృక్షము / మంత్రావృత్తి; (2)
8. కలహము (2)
9. కవిత్వము (3)
12. వణకు (3)
14. నడకయందలి కులుకు (2)
15. సమృద్ధి (3)
17. గుండెలోపల ఇవి నాలుగుంటాయి – ఏకవచనంలో చెపితే విష్ణుమూర్తి కనిపిస్తాడు (2)
18. పసుపుమించిన తెలుపువన్నె కలది (2)
19. వజ్రాయుధము (3)
21. స్థితి పొడవు మాత్రము కల్గి వెడల్పు మందములేని ఆకృతి – సరళముగానూ ఉండొచ్చు -సమాంతరముగానూ ఉండొచ్చు (2)
23. ఇంద్రుని చేతిలో చచ్చిన ఒక రాక్షసుడు (3)
25. ధనశిక్ష (3)
26. మృగములు పక్షులు మొదలుగువానిఁ బట్టెడు వాగుర (2)
28. శోఫ (2)
29. మంచి నడవడి కలది (4)
30. అడ్డం 8ని తినడమంటే ఈయనకు చాలా ఇష్టం (4)

నిలువు:

1. యథార్థము (4)
2. బంధువులు (3)
3. పాపం ఆవిడ మొగుడు తలక్రిందులయిపోయాడు!  (2)
4.  అడ్డం 4 దీంట్లో బాగా మెరుస్తాయి (2)
5. చెరువు (3)
6. సూర్యుడు కూడా ఉల్టాగానే ఉన్నాడు (4)
10. కేదారము (5)
11. భక్తితోడిదే (2)
13. నిలువు 6లో ఉన్నాయనే – ఇపుడు సరిగ్గా నిలుచున్నాడు (5)
15. తొలి చదువులలో మొదటిది (3)
16. పిల్లనగ్రోవి (3)
18. కుక్కచుక్క (4)
20. సంక్రాతి ముందు (2)
22. గరుత్మంతుడు (4)
24. కడపటి (3)
25.‘హా.. సువ్వి.. ఓహో.. సువ్వి’ అంటూ పాడుకొనే సువ్వి పాటలు ఈ  పాటల కోవలోనికే వస్తాయి (3)
27. రామాయణ విషవృక్ష ఖండన అనే రచన కర్త మనకు ఇలా పరిచయం (2)
28. ఓమము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 08 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 74 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 13 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 72 జవాబులు:

అడ్డం:   

1.గభోళి 3. కరాళి 8. కుప్పం 9. కమాటీ 10. లిపి 13. కచ్ఛపి 14. మణికం 18. మయం 19. మంజరి 20. గవ్య 23. చతుర 24. జగము

నిలువు:

2.భోక్త 4. రాజ్ఞి/రాణి 5. నకులం 6. డమాను 7. కపిలె 11. స్వచ్ఛము 12. గణితం 15. వేమన 16. ఖంజరి 17. సవ్యము 21. తంతు 22. గంగ

సంచిక – పద ప్రతిభ 72 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version