సంచిక – పద ప్రతిభ – 93

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తెలుగులో తొలి కథానాయకి (టాకీస్) (8)
6. స్త్రీ (2)
7. వరంగల్లు జిల్లాలో గానుగు ఆడినతర్వాత మిగిలిన మడ్డి (2)
9. ఈ నియోజక వర్గానికి చేరాలంటే అటునించి రండి (3)
12. కొమ్మున్నా ఇక్కడ లేకపోయినా ఏనుగు ఏనుగే! (3)
14. వత్తున్నా లేకున్నా ఇది కూడా ఖరీదైనదే (2)
15. ఎటునించి చూసినా విస్తృతముగానే కనిపిస్తుంది (3)
17.క్రూరచతుష్పాజ్జంతువు (2)
18. తీపికల్లు (2)
19. కృష్ణచతుర్దశి (2)
20. కొన్నిరకాల ధాన్యాలు, పప్పుగింజలు ఉడకబెట్టిగాని, రుబ్బిగాని పశువులకు బలానికిపెట్టే మేత – దాన్ని తిరగేశారేమండీ? (2)
22. మందసము (3)
24. యువ ముఖచిత్రాలకు ఈయన కేరాఫ్ అడ్రస్ — ఎప్పటికీ గుర్తుండి పోతారు – సంతకం ఇలా చేస్తారు (2)
25. గుంపులు (3)
27. ఈ చిన్న పాత్రను సాగదీస్తే ఒక ముఖ్యమైన ప్రభుత్వ శాఖగా మారుతుంది (3)
28. రోగం తొలగించే మందు లేదా ఉపాయం (2)
30. మెడనిడుపుగాఁగల కాచపాత్ర విశేషము – జడకు కట్టుకుంటే అందంగా ఉంటుంది (2)
31. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించాడు – ఇతడు 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను స్థాపించి 20 సంవత్సరాలు నడిపిన మహానుభావుడు – పేరు మొదట్లో కాస్త ముందు వెనుక అయ్యింది (8)

నిలువు:

1. ఈ శాస్త్రి గారు సంతానం చిత్రంలో లతా మంగేష్కర్ చేత నిదురపోరా తమ్ముడా పాటను పాడించిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు – తాతగారి పేరే పెట్టుకున్న వయోలిన్ విద్వాంసుడు (8)
2. మానాభిమానాలలో 3, 2, 1 (3)
3. కొందఱు, కొన్ని (2)
4. బొఱియ, బిలము (2)
5. లలామకం (3)
8. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా అంటూ ఆలపించిన అలనాటి ప్రసిద్ధ గాయని. తితిదే ఆస్థాన విదుషిమణి (8)
10. గూఢచారి (2)
11. భూతమాత (2)
13. నూనె మొదలైనవాని పూఁత క్రిందనుండి పైకి పూయండి, మార్జన రూపాంతరం (2)
15. తెలుగులో బ్రేక్ తీసుకోండి (2)
16. అలంకారము, ప్రకాశము (3)
21. వెడలుపునోరుగల యటిక/బోగిణి (2)
23. శివుని ౙడముడి (2)
24. కడుపులో బొడ్డుక్రిందనుండెడి యుల్లిపొరవంటి క్రొవ్వు; బెజ్జము (2)
26. అలవోక తలక్రిందులుగా, మందము (3)
27. పటహము (3)
29. ఇండ్లవరుస (2)
30. వత్తు లేని గ్రామసింహము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 19 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 93 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 24 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 91 జవాబులు:

అడ్డం:   

1.ధవళాంగి 4. శ్రీమంతులు 7. గరం 8. బాజా 9. మంధా 10. నును 12. గడుసరి 13. డుగాజిగి 14.హ్రీం 15. దణాయడు 18. అనుపమ 21. కాజు 22. ట్టాక 23. కుని 25. ఊళ 26. డుమనుమ 27. కందకము

నిలువు:

1.ధగధగ 2. వరం 3. గిరిధారి 4. శ్రీఘనుడు 5. తుబా 6. లుజారగి 9. మం స 11. నుగా 15. దర్పకుడు 16. యకా 17. డుజునుమ 18. అట్టాలకం 19. నుక 20. మరాళము 24. నిమ 25. ఊక

సంచిక – పద ప్రతిభ 91 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here