Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 95

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అర్థజ్ఞానము లేని అనుకరణపు మాటలు (7)
5. నాలుగు (1)
8. రత్నహారము (4)
10. పశ్వాద్యాహారము – అటునించి తినిపించండి (2)
12. జనకుడు (3)
14. కాకతాళీయముగా జరుగునది గందరగోళమైపోయింది (5)
16. తోడిపెండ్లాము (3)
17. వీడికి కోపము ఎక్కువైనట్లుంది కాబోలు మధ్యలో సాగిపోయాడు చివరలో తేలిపోయాడు (3)
18. అడ్డం ఒకటిలోని పక్షి తిరుగబడింది (2)
20. వివాహాదులలో చేయు కార్యవిశేషము (2)
21. అటునించి ఇటు చూడండి కాశీనగరము కనిపిస్తుంది (7)
24. ఇంద్రియనిగ్రహము (3)
25. వెనుదిరిగిన గాంగేయుడు (3)
26. నాలుగోసారి దర్శించుకున్నప్పుడు శ్రీ వేంకటేశ్వరునికి కృష్ణ దేవరాయలు 1514 లో జరిపిన గొప్ప ఉత్సవము (7)

నిలువు:

2. ఇంగ్లీషు లో చూడు అశ్వగతి విశేషము కనిపిస్తుంది (2)
3. రెండుపగళ్లు నొకరాత్రియు, లేక, రెండురాత్రులు నొకపగలునుగలకాలము. (3)
4. కంసుని గజము (7)
6. చక్కగా మాట్లాడబడనిది/ అవ్యక్తముగా చెప్పబడినది – తడబడినది – (3)
7. తమిళనాటనే కాకుండా తెలుగింట కూడా ప్రసిద్ధికెక్కిన హాస్యనటి – పేరులో చివరి అక్షరం మిస్సయింది (4)
8. నూఱుతంతులుగల నారదునివీణ (3)
9. ఈ సీమకోడి మూడొంతులే కనిపిస్తోంది – మిగిలిందెవరో తినేశారు కాబోలు (3)
11.  పైకి ధైర్యముగా కనిపించినా లోపల పస లేకుండుట (7)
13. శ్రీ కృష్ణుడు (6)
15. చూపు (2)
19. కోరుచున్నవాడు -కకావికలయ్యాడు – వీడికంతము కూడా లేదు (4)
22. కోరిక తలక్రిందులయ్యింది (3)
23. ఈ పరలోకచింత గలవాడిలో అయిదింటికి మూడే ఉన్నాయి (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 02 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 95 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 07 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 93 జవాబులు:

అడ్డం:   

1.సురభి కమలాబాయి 6. నాతి 7. గసి 8. ర్లచమా 12. కంజరం 14. దర 15. విరివి 17. మృగం 18. నీరా 19. భూత 20. ణాదా 22. మంజూష 24. వపా 25. మూకలు 27. తపాల 28. దవా 30 కుప్పె 31. క్కొంకొడ వెంకటరత్నం

నిలువు:

1.సుసర్ల దక్షిణామూర్తి 2. బినామా 3. కతి 4. లాగ 5. బాసికం 8. శ్రీరంగం గోపాలరత్నం 10. చర 11. గౌరి 13. జమృ 15. విరామం 16. విభూష 21. దాక 23. జూట 24. వపా 26. లుదకొ 27. తప్పెట 29. వాడ 30. కుక

సంచిక – పద ప్రతిభ 93 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version