Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 97

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పెద్ద ఉసిరికాయ (3)
4. ఏనుగు, అటునుంచి వస్తోంది (3)
6. వినోదము చేయునది (5)
9. నూరుకోట్లు, వజ్రాయుధం (4)
11. అటునుండి వెనక్కి రండి, రవ్వలు కనిపిస్తాయి (4)
13. చివరిలోనే విరిగిపోయిన ఈ కాడని చారు, సాంబారు, పులుసులలో వేస్తారు (2)
14. అమ్మమ్మ లేదా నాయనమ్మ తల్లి (3)
15. వెనక నుంచి ముందుకు వేష్టనం చేసి రండి (2)
16. కుడి నుండి ఎడమకి – ఈవి, విడుపు (3)
17. పక్షి (3)
18. ఆజ్ఞ, ఒట్టు, సాక్షి (2)
19. పిసినిగొట్టువారు, పీనాసివాళ్ళు (3)
20. శిగ్రు వృక్షము (రెండు వంతులు ఉంది, ఒక వంతు విరిగిపోయింది) (2)
22. తారకరాముడు – లో 2, 3, 5, 4 (4)
24. ఖండములు, కాబట్టి ముక్కలు చెల్లా చెదురై అటు ఇటు అయ్యాయి (4)
26. చంద్రుడు, చివరి రెండు అక్షరాలు తారుమారు (5)
28. వెంటనే, తటాలున – మొదటి అక్షరానికి గుడి చేర్చండి (3)
29. కబురు, వర్ణాధిక్యము, తుమ్మెదల గుంపు (3)

నిలువు:

1. గగనము, దీనిని ఎవరైనా పైనే గని కిందకి చూడలేరు (4)
2. దేవాలయము, కింద నుంచి పైకి (3)
3. జలాశయము (2)
4. నారింజ చెట్టు, కింద నుంచి పైకి (3)
5. అతిశయము (4)
7. మాట్లాడకుండు; మాట్లాడితే నీది ఏమైనా పోతుందా అని ఈ ప్రయోగం (7)
8. మన్మథుడు (7)
10. శిరస్నానము, దుర్భరము, అధికము (5)
12. అలలు, కెరటాలు (5)
18. ఓడ నడుపువాడు, నావికుడు (4)
21. వసంత రుతువు (4)
23. మునిగిపోవడం – అక్షరాలు చెల్లాచెదురయ్యాయి (3)
25. పిడికిటిపోటు, చివరి అక్షరం లోపించింది (3)
27. గారె, పిష్టచక్రము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 16 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 97 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 16 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 95 జవాబులు:

అడ్డం:   

1.చిలుకపలుకులు 5. చౌ 8. మణిమాల 10. త మే 12. వైదేహ 14. ముయాదృఛ్చిక 16. సవతి 17. కోపీష్టి 18. రకీ 20. తంతు 21. నం న కా ద నం ఆ 24. దమము 25. డు ష్ము భీ 26. కనకాభిషేకము

నిలువు:

2.లుక్కు 3. పక్షిణి 4. కువలయాపీడనం 6. మ్లే త చ్ఛి 7. కోవైసర 8. మహతి 9. మాముకో 11. మేకపోతు గాంభీర్యం 13. దేవకీనందన 15. దృష్టి 19. అకాముభి 22. నమకా 23. ఆడుము

సంచిక – పద ప్రతిభ 95 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version