‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు. ఈ ఫీచర్ జనవరి 2020 నుంచి ప్రారంభం.
ఆధారాలు:
అడ్డం:
1.ఆకలిదప్పులు తీర్చే మంత్రం (4) |
4. ఒక నది (4) |
8. పశువులకు వచ్చే ఒక రోగం (3) |
10. నాటకం (3) |
11. పూరి గుడిశా?(2) |
12. ఉగాది పచ్చడిలో ఒక పదార్థం(3) |
13. ఒక రకమైన దోశె (3) |
16. సంభ్రమం (3) |
17. స్వభావసిద్ధం (3) |
21. నిచ్చెన (2) |
23. త్వర త్వరగా (3) |
24. తల్లిసోదరుడు – అర్థమయ్యాడు(2) |
25. తోడబుట్టినది (3) |
27. అబ్బాయిలు (3) |
28. మేఘము (4) |
29. ఒక కూర (4) |
నిలువు:
1. అపాయము లేనిది (4) |
2. మెలికా? (3) |
3. పాఠశాల (2) |
5. రకరకాల (2) |
6. ఇంటికి ఉండవలసినది (3) |
7. శ్రేష్టము (3) |
9. మూర్ఖుడు (3) |
14. శృంగార చేష్టగల వనిత(3) |
15. భూజాత(3) |
18. కర్పూరము (4) |
19. అష్టదిగ్గజాలలో ఒకరు (3) |
20. జలధిలో సేతు కట్టినవారు (2) |
22. కప్పము(2) |
24. పడుకున్నది చాలు ఇకలే! (3) |
26. నిరసన అర్థాంతరంగా ఆగింది (2) |
27. నేపథ్య గాయకుడు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక జనవరి 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 ఫిబ్రవరి 2020 తేదీన వెలువడతాయి.