సంచిక – పద ప్రహేళిక –12

0
2

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మద్యం (2)                                        
4. మేక(2)
6. శరీరబలం చివరిదాకా లేదు(2)
7. రీతి తిరగబడింది(2)
8. లక్ష్మి(2)
10. జ్వరం(2)
11. జొన్నపైరు(2)
13. ఎనిమిది పుంజెముల నూలు(2)
14. తడవ(2)
15. పట్టగా ఉండే నార(3)
16. తిరగబడిన పండితుడు(2)
19. ఉత్పత్తి(4)
22. మొఱిగే కుక్క(4)
24. చెడు త్రోవ(4)
25. యత్నము(4)

నిలువు:

1. కపాలము(3)
2. ఆడ తాబేలు(3)
3. అమ్ముల పొది(3)
5. బిడ్డ (3)
9. రోజు కూలి (3)
10. నల్ల జీల కర్ర(3)
12. గోకర్ణ మృగం (3)
14. బానిస(3)
17. కోడి గుండెకాయ (3)
18. అధముడు(2)
20. పర్యంతము అటూ ఇటూ(3)
21. ఒక చెట్టు క్రిందనుంచి (3)
22. తిరగబడిన సంబంధం (3)
23. అతిశయించు(3)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020  డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక డిసెంబరు 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- 11 సమాధానాలు:

అడ్డం:

1. చాలని 3. పేరాశ 6. డెపిము 8. యాదస్సు 10. అసహిష్ణుడు 15. భరణి 17. మునగ 18. మునుకు

నిలువు:

1. చాటువు 2. నిహాక 3. పేలవము 4. శలభము 5. మొదవు 7. పిపాస 9. విష్ణు 11. హిజ్జలము 12.డుములుకు /డులుముకు 13. తుభము 14. తంణిగ 16. రన

సంచిక పదప్రహేళిక- 11 కి సరైన సమాధానాలు పంపినవారు:

  • సిహెచ్.వి. బృందావన రావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కరణం శివానంద రావు
  • పద్మశ్రీ చుండూరి
  • రామలింగయ్య టి
  • టి.వెంకాయమ్మ
  • రంగావఝల శారద

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here