సంచిక – పద ప్రహేళిక – 5

0
2

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పెరుగు చిలికే కుండ (3)
3. చిన్న వేఱు (3)
6. నాలుక తిరిగింది (2)
9. తిరగబడింది కూతురా? (2)
10. దండము (2)
11. గఱిక (2)
13. పుట్టుక ( 3)
14. మట్టి త్రవ్వడానికి వాడే కొయ్య (3)
15. నిజమైన జ్ఞానం (3)
18. కోట వాకిలి  (3)
21. సంచి (2)
22. అచ్చు కాదు (2)
24 . క్రీడ (2)
26. ఓడలు ఆగే ప్రదేశం (2)
27. పెద్ద మూట (3)
28. తెలివిలేని వాడు(3)

నిలువు:

1. బక్క చిక్కిన కొంగ ( 3)
2. క్రింద నుంచి దురద (2)
4. లెక్క (2)
5. చిన్న దోమ (3)
7. ఏదు పంది ముల్లు (3)
8. ఈల పురుగు (3)
10. బిడ్డలకు గొంతులో కలిగే వ్యాధి (2)
12. గట్టిగా నొక్కు (2)
16. గడువు (2)
17. తీతువు పిట్ట (3)
18. గడప (3)
19. ఆస్తి పంపకాల కోసం వ్రాసేది (2)
20. న్యాయ విచారణ స్థలం ( 3)
23. కోరిక (3)
25. బోలెడంత (2)
26. నీలి చెట్టు (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక మే 2020 పూరణఅని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 జూన్ 2020 తేదీన వెలువడతాయి.

సంచిక – పదప్రహేళిక- 4 సమాధానాలు:

అడ్డం:

1. జాగీరు 4. తెలుపు 7. మాఱు 8. మందాకు 10. లిక్కి 11. కువరు 12. కుతా 14. గుకా 16. ఘృతేళిక 17. పోరంబోకు 18. వక 20. డాలు 22. పకోడి 25. రినా  27. సరగు 28. వారం 29. కలాసి 30. మాతంగి

నిలువు:

1.జామాత 2. గీఱు 3. గోదావరి 5. లులి 6. పుక్కిలి 8. మంకు 9. కురు 12. కుతేవ 13. తాళిక 14. గురండా 15. కాబోలు 19. చాకోరము 21. కారిక 22. పస 23. డిగు 24. సారంగి 26. నాలా 28. వాతం

సంచిక – పదప్రహేళిక- 4కి సరైన సమాధానాలు పంపినవారు:

  • ఇంకొల్లు బ్రహ్మేంద్ర స్వామి

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here