‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1) ఎవరికి వారు కూర్చునే తీరం (3) | 
| 3) ఎండిన జొన్న ఆకు (3) | 
| 8) దక్షుడి కూతురు (2) | 
| 9) గుర్రపు దండు (3) | 
| 10) జర్మనీ కరెన్సీ (2) | 
| 13) జిల్లాలో ఒక భాగం (3) | 
| 14) పోట్లాట (3) | 
| 18) వినాయకుడి పూజా ద్రవ్యం (2) | 
| 19) ఎండిన చిన్న పుల్ల (3) | 
| 20) ఎద్దు (2) | 
| 23) ధూర్తుడు (3) | 
| 24) పొట్టేలు (3) | 
నిలువు:
| 2) ఉడుము (2) | 
| 4) అడవి పావురం (2) | 
| 5) తోడేలు (3) | 
| 6) కోట గోడలోని దిబ్బ (3) | 
| 7) తల ఎముక (3) | 
| 11) అర్జునుడి భార్య (3) | 
| 12) బసవన్నకి ఇది చాలా ఎక్కువ (3) | 
| 15) అంతఃపురం కావలివాడు (3) | 
| 16) ఏనుగు కుంభ స్థల మధ్యము (3) | 
| 17) జాతి భేదము (3) | 
| 21) ఇక్కడిదాకా ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట (2) | 
| 22) నపుంసకుడు (2) | 
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మార్చి 2023 సమాధానాలు:
అడ్డం:
1) తుంగము 3) నేరమి 8) త్రిక 9) పల్లము 10) మూర 13) కృష్ణుడు 14) చిహ్నము 18) టిటి 19) శామిలి 20) వామి 23) వారంటు 24) భుజిష్య
నిలువు:
2) గడి 4) రస 5) తింత్రిణి 6) ఝల్లము 7) విరజ 11) దృష్ణుత 12) జాహ్నవి 15) వీటిక 16) నెమిలి 17) బూమియ 21) గరం 22) వాజి
సంచిక – పదప్రహేళిక- మార్చి 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

