సంచిక – పదప్రహేళిక ఫిబ్రవరి 2023

0
53

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) దుర్యోధనుడి మామ (3)
3) తాళము (3)
8) పుట్ట గొడుగు (2)
9) గత సంవత్సరం (3)
10) దురద (2)
13) మూతబడిన ప్రసిద్ధ మాస పత్రిక (3)
14) ఒంటరి (3)
18) భాషా సరణి (2)
19) కోదండము (3)
20) మోసము (2)
23) ప్రాకారము (3)
24) సామెత (3)

నిలువు:

2) శోకము (2)
4) సింహాసనము (2)
5) కృష్ణుడి అలంకారము (3)
6) శ్రీ కృష్ణుడి రథసారథి (3)
7) ఇంటి కప్పు (3)
11) తొమ్మిది మంది బ్రహ్మలలో ఒకరు, యూపస్తంభం ఉంచి చేసే యజ్ఞం (3)
12) ఇంద్రుడు (3)
15) ప్రసిద్ధ శివ క్షేత్రం (3)
16) వేట కుక్క (3)
17) కోడి (3)
21) నటుడు శ్రీకాంత్ భార్య (2)
22) పొలము (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఫిబ్రవరి 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మార్చి 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జనవరి 2023 సమాధానాలు:

అడ్డం:

1) సుమతి 3) చుంబకం 8) ధన్వి 9) అహల్య 10) పంతం 13) మశూచి 14) నవారు 18) దండు 19) ధనిష్ఠ 20) గోవా 23) ఛందస్సు 24) కొమ్మచ్చి

నిలువు:

2) మక్కా 4) బర్హి 5) సుధర్మ 6) రహస్యం 7) వితండం 11) త్రిశూలం 12) సవాలు 15) కదంబం 16) కనిష్క 17) తివాచీ 21) రొద 22) బమ్మ

సంచిక పదప్రహేళిక- జనవరి 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • ఛాయామల్లిక్
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వెంకాయమ్మ టి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here