‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. సుగంధ భరిత చిన్న చెట్టు (4) | 
| 4. ఇతడిని రెండుసార్లు పిలిచి పన్నీరు జల్లి తన్నారు (4) | 
| 7. రాయి (2) | 
| 8. ఒక చేతి కొలత (2) | 
| 9. వక్క (2) | 
| 11. రంగు తగ్గు (2) | 
| 13. వేప కాని వేప (4) | 
| 14. యాదవకుల వినాశిని (4) | 
| 15. ఆకాశ గంగ (4) | 
| 18. శకుంతల గురించిన కాళిదాసు రచనలో మొదటి 4 అక్షరాలు (4) | 
| 21. మత్తు (2) | 
| 22. సగం శ్రేష్ఠం (2) | 
| 23. ప్రకటించు (2) | 
| 25. దిక్కు (2) | 
| 27. దండు / సేన (4) | 
| 28. ఒక శకున పక్షి, అడవి కోడి (4) | 
నిలువు:
| 1. ఎండమావులు (4) | 
| 2. శూన్యంలో సగం (2) | 
| 3. అరవీసె బరువే అయినా తిరగబడింది (4) | 
| 4. పెళ్ళిలో వధూవరుల నుదుటిన కట్టేది (4) | 
| 5. శుభకార్యాలలో వాయించేది (2) | 
| 6. కోతి (4) | 
| 10. అటునుంచి చూస్తే నక్షత్రం (2) | 
| 12. బియ్యం ఒలికి తలక్రుందులైనా పాయసానికి వాడచ్చు (2) | 
| 15.పడవకు దిశా నిర్దేశం చేసే భాగం (4) | 
| 16. అతని (2) | 
| 17. మరగబెట్టిన మిరియాల ద్రావకం (4) | 
| 18. పూర్వ కాలం నుంచి (4) | 
| 19. అన్నీ తెలిసిన వాడు (2) | 
| 20. కృష్ణ సర్పము (4) | 
| 24. తల్లక్రిందులైన ఆంగ్ల పచ్చ బొట్టు (2) | 
| 26. లక్స్ జాతి వస్తువు (2) | 
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబర్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక సెప్టెంబర్ 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 అక్టోబర్ 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- ఆగస్ట్ 2022 సమాధానాలు:
అడ్డం:
1.సత్యవతి 4. ఉద్దేహిక 7. సరి 8. మయి 9. లత 11. కింక 13. మురిపము 14. చుక్కకూర 15. జనయిత 18. కరవాక 21. రేవు 22. జిల 23. కూనా 25. నిఅ 27. పిసాళము 28. ధిక్కరించు
నిలువు:
1.సలిలము 2. వస 3. తిరిపము 4.ఉటంకించు 5. హిమ 6. కయివార 10. తరి 12. కక్క 15. జలకూపి 16. యిరే 17. తవులము 18. కళానిధి 19. వాజి 20. కలహించు 24. నాసా 26. అక్క
సంచిక – పదప్రహేళిక- ఆగస్ట్ 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- రామలింగయ్య టి
- వర్ధని మాదిరాజు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

