[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు తెచ్చినది (5) |
5) చక్కని, దట్టమైన (2) |
7) 60 సంవత్సరాలలో చివరి 20 సంవత్సరాలు (ప్లవంగ నుంచి) (5) |
10) ప్రయోజనంతో కూడినది (3) |
11) దొంగ, సంధాత (4) |
12) అథోలోకాలలో ఒకటి (4) |
14) నోటిలో ఊరే నీరు (5) |
16) బాధ, తెగులు (2) |
18) పోరంబోకు నేల (3) |
19) నాలుగు రూపాయలు (2) |
21) రాతి తిప్ప (2) |
22) వాటాదారు, భాగస్వామి (4) |
24) పని చేయని రోజు (2) |
26) లాభం, రాబడి (4) |
27) తల్లికి తోడబుట్టినవాడు (2) |
29) దొంగమేత (2) |
31) వాటా, పోలిక (2) |
33) జంట, ఒక శబ్ధాలంకారము (3) |
34) పట్టణం అటుగా (2) |
35) గుడ్లగూబ (2) |
నిలువు:
2) బెస్తపల్లె, గ్రామం (2) |
3) తియ్య పొట్ల (4) |
4) నీచమైన, కొంచెం (3) |
5) ప్రకాశం, చెదిరింది (3) |
6) ఒక శివభక్తుడు తడబడ్డాడు (3) |
8) పెండ్లివారు బస చేసే చోటు (4) |
9) సాలెపురుగు (5) |
10) శాశ్వతం, ఎడతెగని (3) |
13) కర్ణాటక లోని బంగారు గనుల ప్రదేశం (3) |
14) పేలాలు (3) |
15) అయిష్టంగా ఉండటం, చెదిరింది (4) |
17) గోనెసంచి, తోలు (2) |
20) తామ్రము (2) |
22) పలాయనం (3) |
23) ఆకాశము, త వత్తు శూన్యం (3) |
25) చేపలు పట్టడానికి ఎరను తగిలించే సాధనం (2) |
27) మోసము (2) |
28) నాది (2) |
30) మీసము (2) |
32) చిక్కిన, ఎండిపోయిన (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 సెప్టెంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక సెప్టెంబర్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 అక్టోబర్ 2024 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- ఆగస్టు 2024 సమాధానాలు:
అడ్డం:
1) కాయకంటి 3) కోకనదం 6) ముడి 7) వాతప్పు 8) లిక్ష 10) బందిగం 11) తుకం 12) ణిర్వాగీ 15) లోకం 17) టకీమని 18) నగరీబకం 20) యలువ 21) కంపనం 23) మాకందం 26) పదాలు 27) పులికాపు 28) కారం 30) యష్టిక 31) రెమ్మ
నిలువు:
1) కామాలి 2) కంకి 3) కోడిగం 4) నవాతు 5) దంతకం 6) ముది 9) క్షణికం 10) బంగీ 13) బూటకం 14) పనితనం 15) లోకాయతం 16) పూరీ 18) నవమాలిక 19) బల 21) కందారం 22) పలు 24) కంకా 25) దంపుడు 26) పకాలి 27) పుష్టి 28) అమ్మ
సంచిక – పదప్రహేళిక- జూలై 2024కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.