Site icon Sanchika

సంచిక పదసోపానం-2

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.

శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.

ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.

వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

~

ఈ పజిల్‍ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.

~

Q: ఒక పదం “స్మృతి”తో ముగిసింది అనుకోండి. తరువాతి పదం “స్మృతి”తో కానీ “మృ, త”తో కానీ, “ఋ, త” అక్షరాలతో కానీ మొదలు కావాలి. స. తో కాకూడదు.?

A: అవును. స. తో కాకూడదు.

Q: ఎందుకంటే స్మృతి ని విడదీస్తే స + మ + ఋ + తి అవుతుంది కదా. సకారంతో మొదలుపెడితే రెండవ అక్షరం మ కానీ మృ కానీ కావాలి. కానీ మన నిబంధనల ప్రకారం రెండో అక్షరం తకారం కావాలి కదా.

A: స్మృ అనేది ఒకక్షరంగానే భావించాలనుకుంటాను. సతోగానీ, మతోగానీ ప్రారంభించడం న్యాయమే. ఋ అచ్చు.దానిని ప్రత్యేకంగా లెక్కలోకి తీసుకోడం భావ్యం కాదు. క+ ఏ= కే అయినట్లు క+ ఋ= కృ అవుతుంది. మనం ఏ తో ప్రారంభించం కాబట్టి ఋ తో కూడా ప్రారంభించకూడదని నా అభిప్రాయం. స్మృతి అని ముగిసిన దానిని సతి,సుత,సేతు లాంటి వాటితో మొదలుపెట్టడం తప్పు కాదనుకుంటాను. మతి,మితి లాంటి వాటితో కూడా.

Q: అలా అనుకున్నా స తో ప్రారంభిస్తే రెండవ అక్షరం మకారం కావాలి. గుణింతాల వరకూ మీ అభిప్రాయం కరెక్టే కానీ సంయుక్తాక్షరాల విషయం వస్తే రెండవ అక్షరాన్నే పరిగణించాలి. “స్మిత” తో మొదలైతే కరెక్టే. ఇది ఆమోదయోగ్యమే. పద్యంలో యతిని స్వీకరించినట్లు స నూ, మ నూ తొలి అక్షరం గా అంగీకరించాలి. త మాత్రమే రెండో అక్షరం.మ ను రెండో అక్షరం గా accept చేయడం సరికాదని నా ఉద్దేశ్యం.

Q: మీరు చెప్పినదాన్ని బట్టి స్మృతి, స్మిత, సతి, మతి వంటివాటితో ప్రారంభమయ్యే పదాలు కరెక్టుగానే పరిగణించాలి. ధన్యవాదాలు సార్.

A: అవునండీ.అదే సరయిందనిపిస్తున్నది🌷🙏

Q: మరొక అనుమానం. శ్రీరామరక్ష తరువాతి పదంగా రాష్ట్రగీతము వ్రాస్తే అంగీకరించవచ్చా?

A: వచ్చు. (యతి కి ఆ అక్షరం అంగీకార్యమే కాబట్టి)

Q: 😃 మొదటి అక్షరానికి మీరు చెప్పిన యతి నియమం పాటించవచ్చు కానీ రెండవ అక్షరానికి కుదరదేమో సార్

A: కుదురుతుంది. క్ష కూ ష్ట్ర కూ కుదురుతుంది.

Q: పద్యాపాదాలలో కూడా అన్ని అక్షరాలకు యతి నియమం ఉండదు కదా

A: క్ష. కూ షకూ యతి కుదురుతుంది కాబట్టి ష్ట్రలో ష ఉంది కాబట్టి కుదురుతుంది

Q: కానీ మన ప్రహేళికలో ఒక పదం చివరి అక్షరం సంయుక్తా క్షరమైతే మొదటి వర్ణమే తరువాతి పదంలో పరిగణిద్దాము.

A: అలాగే. రెండో అక్షరం మాత్రం రెండో అక్షరమే.సంయుక్తాక్షరంలోని రెండో వర్ణం ఉండొద్దు.

~

Q: క్రింద పేర్కొన్న అక్షరములను ఒక దాని బదులు మరియొక అక్షరమును పదాంతములో గానీ, పదారంభము లో కానీ ఉపయోగించవచూనా?

  1. క, ఖ 2. గ , ఘ, 3. చ ఛ. 4. జ ఝ 5. ట. ఠ 6. డ ఢ. 7. త థ 8 ద ధ 9. న. ణ. 10. ల. ళ. 11. స శ ష 12. సంయుక్తాక్షరముల విషయములో ఏ అక్షరమునైనను తరువాతి పదము లో ఉపయోగించ వచ్చునా?

ఉదాహరణకు

పదము : దీన పోషక

తరువాతి పదము: సాకేత రామ

A:

  1. క, ఖ
  2. గ , ఘ
  3. చ, ఛ
  4. జ, ఝ
  5. ట, ఠ
  6. డ, ఢ
  7. త, థ
  8. ద, ధ
  9. న, ణ
  10. ల, ళ
  11. స, శ, ష

పై అక్షరాల గుంపులో ఒకదానికి బదులుగా మరొకటి వాడరాదు.

దీనపోషక పదము తరువాత సాకేతరామ పదమును సరైనదిగా పరిగణించము. షికారుచేయు లేదా షోకిల్లాపిల్ల వంటివి ఉపయోగించవచ్చు. కాకపోతే ణ, ళ అక్షరాలతో పదములు లేవు కనుక వాటి బదులు వరుసగా న, ల తో మొదలయ్యే పదములు వాడవచ్చును. ఈ రెండు అక్షారలకు మాత్రమే ఈ మినహాయింపు కలదు. మిగిలినవాటికి లేదు. వీలైనంతవరకు ఆ అక్షరాలతో మొదలయ్యేలాగా మునుపటి పదాలు రాకుండా చూసుకుంటే మంచిది.

ఇక సంయుక్తాక్షరముల విషయము.

  1. ఒక పదములో నాలుగవ అక్షరము సంయుక్తాక్షరమైతే తరువాతి పదము మొదటి అక్షరములో వాటిలో దేనితోనైనా మొదలుపెట్టవచ్చును. ఉదాహరణకు మధురస్మృతి అనే పదం తరువాత స్మృతికర్తలు కానీ మృతజీవుడు కానీ సత్యయుగము కానీ మతిభ్రమణం కానీ వాడ వచ్చును.
  2. ఒక పదములో చివరి అక్షరము సంయుక్తాక్షరమైతే తరువాతి పదములో రెండవ అక్షరము ఆ సంయుక్తాక్షరంలోని మొదటి వర్ణమే అయి ఉండాలి. మిగిలిన వర్ణాలను ఉపయోగించరాదు. ఉదాహరణకు ఒక పదం శ్రీరామరక్ష అయితే దాని తరువాతి పదం రాక్షసక్రీడ కానీ రాకాసిలోయ కానీ కావచ్చును. కానీ రాష్ట్రపాలుడు కారాదు.

మరొక ఉదాహరణతో స్పష్టం అవుతుందని భావిస్తున్నాను.

ఒక పదం రావణబ్రహ్మ అనుకోండి. తరువాతి పదం

1.బ్రాహ్మణీకము

2.బహాయిమతం

3.రహదారులు

కావచ్చును కానీ

1.బొమ్మకచ్చిక

2.రమణీయము

మొదలైనవి కాకూడదు.

~

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 21 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో సంచిక పదసోపానం-2 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 మే 26 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 113జవాబులు:

అడ్డం:   

1.పాలకుం 6. కులాసా 8. కుటుంబనియంత్రణ 10. కలిమ 11. తుహినకర 12. పట్టుకోక 14. రివైగన 17. గథ 18. షిసంణితో 20. దీపావళిపర్వదినం 21. నిక్షించిననరీళిని 22. వీనుకంటి 25. రాచు 26. వరూధిని, 28. వడునుజీ 29. బలవర్ధకం 30. వారాశి 31. నుజీమూడుతవాహ 34. ముఖ్యుడు 35. డురెచా

నిలువు:

1.పారికతోముషి 2. కుంకుమభరిణి 3. సాంబ 4. ప్రియం 5. పణతుక 6. కులీనత 7. సాగరమథనం, 9. నిలింపనదీకిరీటుడు 13. కోడెవయాళివజీరుడు 15. వైతోపొనడ 16. విపణివీధి, 17. గదిరీకం, 19. సంరక్షించు, 21. నిరాడంబరము 23. నునిమువాహడు 24. టికోవశివాచా 27. సువక్త్రడు 28. వర్ధనుడు 32. మూసీ 34. తర్కం

నూతన పదసంచిక 113 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version