Site icon Sanchika

సంచిక పదసోపానం-3

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.

శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.

ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.

వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

~

ఈ పజిల్‍ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.

~

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక పదసోపానం-3 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 జూన్ 02 తేదీన వెలువడతాయి.

సంచిక పదసోపానం 1 కి పజిల్ నిర్వాహకుల జవాబులు:

1.హంసగమన 2. మనవరాలు 3. రాలినపూలు 4. పూలంగిసేవ 5. సవతిపోరు 6. పరంగికాయ 7. కాయకల్పము 8. పామరకూర 9. కార్యక్రమము 10. మమకారము 11. రామచిలుక 12. లోకజనని

సంచిక పదసోపానం 1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version