సంచిక విశ్వవేదిక – సాంఘిక మాధ్యమాలు

0
2

[dropcap]మ[/dropcap]నిషి సంఘ జీవి. ‘Man is a social animal,’ అంటాడు అరిస్టాటిల్. సంఘటితమైన మానవునికి తన భావాలను, ఆనందాలను, అనుబంధాలను, ఆక్రోశాలను సాటివారికి తెలియచేయాలనే తపన, బహుశ మానవజాతి ఈ భూమి మీద అవతరించిన నాటినుండే ప్రారంభమై ఉండవచ్చు! తొలుత రాగాలతో, ఊళలతో ఆ తదుపరి లేఖనతో భావ వ్యక్తీకరణలో శిఖరాలను ఆరోహణచేస్తూ, మాట అనేది సృష్టించుకున్నాడు. ఆ మాటల మూటలు ప్రోగుపడగా, భాషగా అవధరించి, భాషలేని మనుగడ- ఊహించలేని, ఊహించరాని స్థాయికి చేరుకున్నాడు. భాష కున్నది అవధి, మరి భావానికేది పరిధి? మెదలాడే ప్రతీ భావం, అక్షర బద్ధం కాక పోవచ్చును. అక్షర బద్ధమైన మాటల సంపుటి- భావ పూరకమై ఉండాలనీ లేదు! సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్న ఆవిష్కరణలతో విస్తృత పరిచి, సాటి మానవులతో పరిభాషించడానికి, మనిషి ఎన్నో సాధనాలు కనుగొన్నాడు, నిరంతర శ్రమతో వాటిని పదును పెడుతూ వచ్చాడు. సున్నా, బండి చక్రం (zero, wheel) లాంటి విప్లవాత్మకమైన ఆవిష్కరణల నుండి  ముందుకు ముందుకు పోతూ, శాస్త్ర సాంకేతిక ప్రగతిని రోదసి దాటించాడు. గత శతాబ్దంలో కనుగొన్న, computer లేదా గణన యంత్రం, మానవ మేధస్సుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును. ఎందుచేత? ఇది ఒక విలువైన ప్రశ్న. ఒక 30 సంవత్సరాలు గతంలోనికి ప్రయాణిస్తే, ఈ ప్రగతిని అవలోకిస్తూ, 1990లలో నేను ప్రచురించిన, ఒక సాంకేతిక వ్యాసం ‘A Diagnostic View on Information Technology’ జ్ఞప్తికి వచ్చింది. కంప్యూటర్ అనేది ఒకరికి typewriter కావచ్చు. మరొకరికి pokemon go కావచ్చు. కానీ నిశితంగా ఆలోచిస్తే, ‘మనిషి తనలోని అంతర్లీన శక్తిని తనముందు ప్రతిబింబించే సాధనమే computer’ అని నిర్వచించాను. కంప్యూటర్ యొక్క వినియాగం computation ను దాటి, మనిషి అనుదిన వ్యాపకాల సరళీకరణకు దోహదం చేసింది. నేడు కోట్ల కోట్లాది మానవుల నిత్య జీవితాన్ని సుసంపన్నం చేస్తూనే, ఒక విధంగా మనిషిని బానిసనూ చేసింది. జీవన గమనంలో మరింత వేగాన్ని తీసుకొని వచ్చింది. దానికి ఉదాహరణే, ఈనాడు ప్రబలంగా ప్రపంచ నలుమూలల, ధనిక, పేద, లింగ, వయసు భేదాలు లేక మానవాళికి అందుబాటులోనికి వచ్చి, జీవన శైలిలో అంతర్లీనమైన, mobile phone!

ఖండంతారాల ఆవల ఉన్నా, గగన తలంలో ఉన్నా, రాబోయే రోజులలో రోదసిలో ఉన్నా మానవుని తన తోటివారితో కలిపే ప్రేరణ శక్తి computers అందుకున్నాయి. 1940లలో కనుగొన్న computer, 30 సంవత్సరాలలో గణనీయ వృద్ధిని సాధించి, ఒక దానితో మరొకటి అనుసంధానం కావడం, 1969లో తొలిసారిగా జరిగింది. అంటే సాంకేతిక పరిభాషలో కంప్యూటర్ network అనేది కనుగొనబడినది. అటునుండి మరి 7 సంవత్సరాలలో, 1976లో, ప్రయోగాత్మగంగా సుదూర computers ని కూడా అనుసంధానించి internet ఆవిర్భావానికి నాంది పలికిన  శాస్త్రవేత్తలు Vinton Cerf మరియు Robert Kahn. అంటే ఈ ఆగష్టు 27న internet 40వ జన్మదినం జరుపుకుంటున్నది. మనుష్యులను దగ్గర పరిచిన తొలి సాధనం telephone. అయితే మనిషి ఎక్కడ ఉంటే అక్కడనుంచే మరొకరితో మాట్లాడానికి mobile phone కనుగొనడంతో సాధ్యపడినది. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకంలో email,  internet web posts, newsgroups, blogs అనేవి అనేక విధాలుగా సాంఘిక మాధ్యమ విప్లవానికి కారణమైనా, అవి ఏ కొద్ది మందికో పరిమితమై పోయాయి, ఎందుకంటే, ఆ సాధనాలు, కంప్యూటర్‌తో  బలీయంగా ముడివేయ బడ్డాయి. అందని ఖరీదు అయినందువలన, విద్య, పరిశోధనాలయాలకు, కొద్ది పెద్ద కంపెనీలకు మాత్రమే Computers పరిమితమైనాయి. అదీకాక వాటిని ఉపయోగించాలంటే మనిషి తప్పక కంప్యూటర్ (లేదా terminal) ముందే కూర్చుని తీరాలి! అందుచేత developing countries కంప్యూటర్ల వినియోగంలో వెనుక బడ్డాయి. కానీ గత 10 సంవత్సరాలలో mobile phones, సామాన్యులకి అందుబాటులోనికి రావడం, smart phones వల్ల mobile internet సులభతరం కావడం, internet ను మనిషి వేలికొసలకు అందించింది. ఈ గణనీయ గణన యుగం, అంటే digital revolution మనిషిని మనిషిని పూర్వమెన్నడు లేని, సాధ్యపడని అవధిని అధిగమించి, సాంఘిక పరిధిని విశ్వజనీనం చేసిందనడంలో సందేహం లేదు! రానున్న దశాబ్దాలల్లో, ఈ పరిధి మన సౌర మండలాన్ని దాటుతుందనేది సుసాధ్యం! బహుశ మన సౌర మండలాన్ని దాటి విశాల విశ్వంలో ఉన్న మరిన్ని జీవజాతులతో మనలను కలుపుతుంది అనేది, ఎందరెందరో నాలాటి వారి కల!

(ఇప్పుడు చదవడంలో ఒక చిన్న విరామం తీసుకొని, 1972లో వచ్చిన ‘బాలభారతం’ సినిమా లోని ‘మానవుడే మహనీయుడు’ అనే ఘంటసాల మాష్టారుగారి విలక్షణమైన పాటను వినండి. ఆనాడు, రష్యా, అమెరికా దేశాలు రోదసి యాత్రలు విజయవంతంగా జరుపుతూ, చంద్రునిపై తొలిసారిగా మానవుడు కాళ్ళూనడం జరిగింది.  ఆరుద్ర గారు మానవజాతి ఈ మహత్తర విజయాన్ని కీర్తిస్తూ ఈ ప్రేరణ గీతాన్ని సాలూరి రాజేశ్వర్రావు గారి చక్కటి స్వరకల్పనలో మనకు అందించారు.)

మన సాంఘిక మాధ్యమాలు సంభాషణ కొనసాగింపులో, కొన్ని గణాంకాలు పరిశీలిద్దాం. Excelacom కంపెనీ వారు ‘What happens in an 2016 internet minute?’ అనే చక్కటి graphic ని అందించారు. దాని ప్రకారం, ఒక నిముషంలో జరిగే కొన్ని ఘటనలు: 150,000 మిలియన్ల emails, 20.8 మిలియన్ల Whatsapp messages, 2.78 మిలియన్ల YouTube videos, 2.4 మిలియన్ల Google ప్రశ్నలు,  701,389 FB logins అని అంచనా వేశారు. మరొక అంచనా ప్రకారం, ఒక్క నిముషంలో ఉత్పత్తి అవుతున్న ఈ information ని మనిషి అవగతం చేసుకోవాలంటే 250 సంవత్సరాలు పడుతుందట! రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత జతలమవుతుందని, వేరే చెప్పక్కర్లేదేమో! ఒక్కసారి ఒక్క నిముషమాగి ఆలోచించండి, ఇంతటి information వత్తిడిని మానవజాతి మునుపెన్నడూ ఎదుర్కొనలేదు.

ప్రతి సాధనానికి ఒక సానుకూలత ఉన్నట్లే, ప్రతికూలతా ఉంటుంది. ఈ బలవైన సాంఘిక మాధ్యమాలని ఎలా వాడుకుంటున్నాం? ఇంకొక అంచనా ఏమిటంటే, నేడు ప్రతి మనిషి సగటున 60నిముషాలు సాంఘిక మాధ్యమాలపై వెచ్చిస్తున్నారని. ఆంగ్లంలో ఒక సామెత ఉంది: ‘చేతిలో సుత్తి ఉంటే, ప్రతి సమస్య ఒక మేకులా తోస్తుందని.’ నిజమే. మనిషి తన జీవితాన్ని సుఖవంతం చేసుకొనడానికి రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం, సాధనలని సరియైన మార్గంలో వాడకపోతే, మనం ‘information overload’కి గురికావడం, మన ఉత్పాదకత (productivity), సృజనాత్మకత (creativity), మరియు విశ్రాంతి (peace) లపై బలమైన ప్రభావం చూపిస్తాయి. ఈ మాధ్యమాలని రెండుగా విభజించవచ్చు: synchronous and asynchronous. అలాగే నిర్దేశ లక్ష్యాన్ని బట్టి: one to one; one to many లేదా many to many. ఈ సాధనాలను ఏ ప్రయోజనాన్ని ఆశించి వినియోగిస్తున్నామన్న కోణంలో, philosophical గా ఏమంటారంటే: utilitarian లేదా hedonic purposes. సుమారు సాంఘిక మాధ్యమ ధ్యేయం, hedonic అంటే వాటినుండి ఎటువంటి భౌతిక ప్రయోజనాలు కోరకపోవడం.

>>> చివరిగా కాస్త నవ్వుకోవడానికి, రచయిత ఎవరో అంతర్జాల పురాణం నుండి: వాట్సప్ విమోచన వ్రతం

సూతుడు శౌనకాది మహా మునులతో ఇట్లు చెప్పదొడంగె.. ఓ నాడు కైలాసమున పార్వతీ దేవి శివుని జూచి, నాథా!  భూలోకమున ప్రజలందరూ వాట్సప్ బారిన పడి సమయం వృథా చేసుకోనుచూ నిత్యం అనేక బాధలు పడుచుండిరి. వీరి బాధల నుండి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా సెలవిమ్మని అడుగగా శివుడు యిట్లనియె

దేవి!  ..నలుబది దినములు నిష్ఠ గా వాట్సప్ ఉపవాసం అనగా వాట్సప్ ఓపెన్ చేసిననూ ఇతరులు పెట్టిన ఒక్క పోస్ట్ కూడా  లైక్ కొట్టకుండా  ..ఒక్క కామెంటునూ  పెట్టకుండా నిష్ఠ గా ఉన్నచో, కొద్ది రోజుల్లో ఆ భక్తుడి గోడు నుండి మిత్రులు అలిగి ఒక్కకరూ  వైదొలగుదురు. తద్వారా ఆ భక్తుడు పోస్ట్ పెట్టిననూ లైక్ చేసే వారు లేక కొన్ని రోజులకు వాట్సప్ నందు విరక్తి కలిగి నెమ్మదిగా తనంతట తానే వైదొలగును.

ఈ వ్రతం ఆచరించు పురుషులు వృత్తి వ్యాపారములందు మరింతగా రాణింతురు..

స్త్రీలు, భర్త పిల్లలతో మరింత సమయం ఆనందంగా గడిపెదరు.

భూలోకమున ప్రజలందరూ సుఖ శాంతులతో వర్థిల్లుదురు.

అని శివుడు పార్వతి తో చెప్పగా ..శౌనకాది మునులు, ఆహా ఇంతటి మహా వ్రతమును ఈరోజే ఆచరింతుమని సూతుడితో పలికారు.

ఈ కథ చదివిన వారికీ ,  విన్న వారికీ,  ఆచరించిన వారికీ సకల శుభములు కలుగును.

ఓ శాంతి శాంతి శాంతి

పరిశోధనా వ్యాసాలు, అనుబంధాలు

  1. ఈ వ్యాసం తొలిప్రతి, సిడ్నీ నుండి వెలువడే తెలుగువాణి రేడియో లో ఆగష్టు 6, 2016 వ తేదీన ప్రసారమైనది.
  2. Motamarri, S., 2014. “Reflections on Artificial Intelligence – a Hermeneutic Journey,” in The 25th Australasian Conference on Information Systems. Auckland University of Technology, Auckland, New Zealand: ACIS.
  3. Motamarri, S. 1992. “A Diagnostic View on Information Technology,” SIGSOFT Softw. Eng. Notes (17:4).

 Appendix

1.Beginning of the Internet Age

In 1969, Arpa had built a computer network called Arpanet, which linked mainframes at universities, government agencies, and defense contractors around the country. Arpanet grew fast, and included nearly 60 nodes by the mid-1970s.

2.What Happens in an Internet Minute

Author: Stephanie Heitman; https://localiq.com/blog/what-happens-in-an-internet-minute/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here