Site icon Sanchika

సంచిక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం

[dropcap]సం[/dropcap]చిక రచయితలకు, పాఠకులకు నమస్కారం.

సంచికలో ప్రచురితమవుతున్న రచనలను వినాలనుకుంటున్న వారికి శుభవార్త!!!

సంచికలో రచనలు చదవాలనివుంది..కానీ నాకు తెలుగు చదవటం రాదు అని బాధ పడే వారికీ శుభవార్త!!!!

గత కొద్ది కాలంగా సంచిక కోసం ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారభించాలన్న ఆలోచన కార్యరూపం దాల్చింది.

సంచిక యూట్యూబ్ చానెల్ ఆరంభమయింది.

లింక్:

https://www.youtube.com/@TeluguSanchika

 

సంచిక రచయితలు, పాఠకులు ఈ ఛానెల్‍ని సబ్‍స్క్రైబ్ చేయగలరు. అలాగే తాజా నోటిఫికేషన్స్ కొసం బెల్ గుర్తుపై నొక్కండి.

రచయితలు, పాఠకులు తమ మిత్రులతో, బంధువులతో ఈ సమాచారాన్ని పంచుకోగలరని ఆశిస్తున్నాము.

సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన రచనలను సంచిక యూట్యూబ్ ఛానెల్‍లో ఆడియో రచనలుగా అప్‍లోడ్ చేస్తాము.

ముందుగా 17 డిసెంబర్ 2023 నాడు జరిగిన సంచిక రచయితల జూమ్ మీటింగ్ రికార్డింగ్ అప్‍లోడ్ అయింది.

https://youtu.be/GkGGP-7M0Qw

ఈ సమావేశంలో ఒక్కో రచయిత ప్రసంగాన్ని విడివిడిగా చిన్న వీడియోలుగా కూడా అప్‍లోడ్ చేయనున్నాము.

కస్తూరి మురళీకృష్ణ గారి జోనరాజ రాజతరంగిణి మొదటి ఎపిసోడ్ కూడా అప్‍లోడ్ అయింది.

లింక్

https://www.youtube.com/watch?v=iOgnKLq9-GU

వీలు వెంబడి సంచికలోని ఇతర రచనలనూ అప్‍లోడ్ చేయనున్నాము.

31 డిసెంబర్ 2023 నాడు జరిగే సంచిక రచయితల జూమ్ మీటింగ్ రికార్డింగ్ అప్‍లోడ్ చేయనున్నాము.

సంచిక వెబ్ పత్రికను ఆదరించినట్లే, యూట్యూబ్ ఛానెల్‍నూ ఆదరించాలని మా ప్రార్థన.

Exit mobile version