సంచికలో 25 సప్తపదులు-10

1
2

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
సర్వము!
పర్వము!!
త్యాగాలతో లభించిన స్వాతంత్ర్యం మనకెంతో గర్వము!!!

ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
విజయవాడ

2
తంత్రం
స్వతంత్రం
దేశాన్ని ఒకే తాటిపై నిలిపింది వందేమాతరమంత్రం!

చంద్రకళ.దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

3
పుణ్యఫలము
కర్మఫలము
ఈనాడు మనము అనుభవిస్తున్నది వీరుల త్యాగఫలము

ఆర్. రమాదేవి
హైదరాబాద్

4
ఐక్యత
సఖ్యత
భిన్నధృవాలని ఏకతాటిపై తేవాలంటే రాగమాలాపించాలి సమైక్యత.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

5
నాడూ
నేడూ
స్వేచ్ఛ స్వాతంత్ర్యం వెల్లివిరియగ కోరుకుందాo ఎన్నడూ

యామిని కోళ్ళూరు
నెల్లూరు

6
నీతి
రీతి
సమాజo ధర్మమార్గo అనుసరిస్తే దేశానికే పురోగతి

జె.విజయకుమారి
విశాఖపట్నం

7
సైనికులం
సేవకులం
భారత్ స్వేచ్ఛను నిరంతరం కాపాడే రక్షకులం

కోటమహంతి వెంకటరావు (కోవెరా),
విశాఖపట్నం

8
నాటికీ
నేటికీ
స్వాతంత్ర్యఫలాలను అనుభవిస్తూ.. మరువరాదు ‘మహనీయులను’ ముమ్మాటికీ!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాద్

9
కదలకు
మెదలకు
ఊపిరినిచ్చిన స్వేచ్ఛను మాత్రం జీవితంలో వదలకు!!!

ప్రియా సిస్టర్స్
విజయవాడ

1ం
భిన్నత్వం
ఏకత్వం .
సమైక్యతతో స్వాతంత్ర్యాన్ని సాధించినది భారతీయుల పోరాటతత్వం

వురిమళ్ల సునంద,
అర్కెన్సాస్ ,అమెరికా

11
అర్థం!
అనర్ధం!
స్వాతంత్ర్యఫలాలు దేశవాసులందరికీ అందకపోతే సంబరాలు వ్యర్ధం!

సిహెచ్.వి. బృందావనరావు
నెల్లూరు

12
జనులు!
ఘనులు!!
స్వాతంత్ర్యఉద్యమంలో ఉడుతసాయం అందించినవారు ఎంతో త్యాగధనులు!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ

13
స్వేచ్ఛ
రచ్చ
మతకక్షలతో తేవద్దు దేశానికి తీరని మచ్చ

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

14
నాటితరం!
నేటితరం!
భారతీయతని బాధ్యతగా మార్చుకుని నడవాలి ముందుతరం!

భువనేశ్వరి మారేపల్లి
హైదరాబాద్

15
జగతి
సుగతి
భిన్నత్వంలో ఏకత్వమై అలరారు మనదేశo ప్రగతి !

కె.కె.తాయారు
మదనపల్లి ,చిత్తూరుజిల్లా

16
ఇల్లు
భాసిల్లు
వరలక్ష్మి పూజతో స్త్రీలకు సర్వశుభాలు ప్రభవిల్లు

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

17
రంజించు
భంజించు
సిరులను ఇచ్చే వరలక్ష్మిని మనసా పూజించు

టి .నాగేశ్వరి,
తణుకు

18
నగలూ
వగలూ
శ్రావణపు పేరంటాల్లో వాయనాలతో ఇచ్చే శనగలూ

మంగు కృష్ణకుమారి
విశాఖపట్నం

19
వ్రతం
కృతం
శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మి పూజాఫలం అద్భుతం

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

2ం
శుభప్రదం
లక్ష్మీప్రదం
శ్రావణమాసాన స్త్రీలకు వరలక్ష్మి అనుగ్రహమే అభయప్రదం.

అ.వెం.కో. రామాచార్యులు,
కాకినాడ.

21
పయనాలు
వాయనాలు
వ్రతాలు పేరంటాళ్ళు పట్టుచీరలు ఎదురుచూస్తున్నాయి నయనాలు

ఆచార్య వై వి సుబ్రహ్మణ్యం,
హైదరాబాద్

22
ధనలక్ష్మి
ధాన్యలక్ష్మి
అష్టలక్ష్ములకు అధిదేవత అందుకే అయినది ఆదిలక్ష్మి!

పట్నాయకుని రామకృష్ణారావు
కంచరపాలెం.విశాఖపట్నం.

23
కొలువై
విలువై
కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు నెలవై..!

మహమ్మద్ అంకూస్
బెల్లంపల్లి

24
శ్రవణీయం
మననీయం
వరలక్ష్మి కీర్తనలు భక్తితో సదా స్మరణీయం

శాంతమూర్తి
హైదరాబాద్

25
తారణం
ధారణం
వరలక్ష్మి వ్రతానికి శ్రావణాన ఇంటికి మంగళతోరణం

కాశీవజ్ఝల మాధవీలత
ఆస్ట్రేలియా

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here