సంచికలో 25 సప్తపదులు-12

0
2

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
భక్తిమయం
రక్తిమయం
అష్టమిపర్వం వేడుక సర్వం ఆనందాలకు శుభసమయం

ఫణీంద్ర విన్నకోట,
హైదరాబాద్

2
అండం
పిండం
బాలకృష్ణుని బాలారిష్టాలు గడచిన వైనం బ్రహ్మాండం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

3
లీలలు
లాలలు
పోసింది.. అమ్మ కృష్ణయ్యకి
పాడింది జోలలు

పి.బాలా త్రిపుర సుందరి
హైదరాబాద్

4
ఉట్టి
చట్టి
నల్లనయ్య లీలలతో మురిసి ముద్దయింది మట్టి!!

నమ్మి ఉమాపార్వతీ నాగ్,
చెరుకువాడ.

5
పథం
విధం
బుడిబుడి నడకల.. చిన్నికృష్ణుని పదములు సుపథం!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాద్

6
బాగున్నారా
చూస్తున్నారా
ఇంట్లోకి వచ్చేస్తున్న కృష్ణుడి సవ్వడి విన్నారా

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

7
రోలు
పాలు
శ్రీకృష్ణుని బాల్యపు లీలలు కలిగించును మురిపాలు

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

8
నీడలు
క్రీడలు
గోకులమున గోవిందుడు చూపును ముక్తి అడుగుజాడలు!

వీరేశ్వర రావు మూల
అమలాపురం

9
గానం
ధ్యానం
నోరులేని గోవులకు పరిపాలకుడు కృష్ణుడే ప్రాణం

వై పద్మ
హైదరాబాద్.

10
వనం
జీవనం
బాలకృష్ణుడు బాల్యం గడిపిన నగరమే బృందావనం.

ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట

11
వేదం
నాదం
మధురలో మురళీ గానమా మాకేది మోదం!

కె.కె.తాయారు
మదనపల్లి (చిత్తూరుజిల్లా)

12
రవ్వలు
గువ్వలు
ఆనందంతో కన్నయ్యని స్వాగతిస్తున్నాయి వ్రజవనితల మువ్వలు

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
హైదరాబాద్

13
చిలుకు
ఒలుకు
“ఉట్టి కొట్టకు కన్నయ్యా!”-గొల్లభామ పలుకు.

టి.రామాంజనేయులు
ఆదోని. కర్నూలుజిల్లా.

14
బాలుడు
కార్యశీలుడు
అష్టమిన అవతరించి కష్టాలను కడతేర్చిన గోపాలుడు

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

15
కంసుడు
హింసుడు
కృష్ణుడే కదా దుష్టులపాలిట విధ్వoసుడు!

యన్.కే. నాగేశ్వరరావు,
పెనుగొండ.

16
అటుకులు
చిటుకులు
గంపెడు పిల్లలున్న కుచేలుని ఐశ్వర్యానికి కిటుకులు

సూర్యదేవర రవికుమార్
గుంటూరు.

17
తప్పులు
ముప్పులు
వందకాచి శిశుపాలుని వధించిన కృష్ణునకు మెప్పులు

టేకుమళ్ల ఆనందరావు
సింగపూర్

18
భవము
ప్రభవము
ధర్మసంరక్షణ కోసం లోకంలో దేవదేవుని అవతారవైభవము…..!!

శ్రీమతి భారతీ కృష్ణ
హైదరాబాద్

19
నేనెంత!
నువ్వెంత!!
కృష్ణుని జీవనవిధానాన్ని చూస్తే మన బ్రతుకెంత!!!?

ఎమ్మెస్సార్ షణ్ముఖ ప్రియ
విజయవాడ

20
రామావతారం!
పరశురామావతారం!
ఏ అవతారం ఎత్తినా శ్రీకృషునిది పరిపూర్ణావతారం!

భువనేశ్వరి మారేపల్లి
హైదరాబాద్

21
గిరిధరుడు
పాపహరుడు‌
గీతను బోధించిన‌ గోవిందుడు నవనీత చోరుడు.

సింహాద్రి వాణి
విజయవాడ

22
ఆత్మ!
పరమాత్మ!!
అందరివాడు గోవిందుడు భగవద్గీత సృష్టికర్త శ్రీకృష్ణపరమాత్మ!!!

నేమాన సుభాష్ చంద్ర బోస్
విశాఖపట్నం

23
శోధించె
సాధించె
కురుక్షేత్రంలో కృష్ణుడు అందరికీ గీతను బోధించె

శాంతమూర్తి
హైదరాబాద్

24
ప్రయోగం
ఉపయోగం
ఆపదలో సాటివారికి సాయపడని జీవితం నిరుపయోగం

నెల్లుట్ల శ్రీనివాసులు,
చెన్నై ,

25
అడుగు
నుడుగు
నీదైన ముద్రతో సమాజంలో కాలుష్యం కడుగు!

యలమర్తి మంజుల
విశాఖపట్నం

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here