[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
అధిపతి
విఘ్నపతి
తొలిపూజకు ఆద్యుడు ఆటంకములు తొలగించు గణపతి!
బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి,ఖమ్మం జిల్లా
2
ఆరoభం
ప్రారంభం
నవరాత్రుల వైభవంతో ఊరూరా కొలువుతీరు హేరంభం!!
కే.ఎన్నార్ నమ్మి,
నెగ్గిపూడి.
3
నిరోధం
విరోధం
కొంతమంది పైకిపోతున్న వాళ్ళకి కలిగిస్తారు అవరోధం.
డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్
4
కలతలు
నలతలు
కొన్ని కుటుంబాల్లో మానసికంగా నలిగిపోతుంటారు నెలతలు
వురిమళ్ల సునంద
ఖమ్మం
5
ఆపతి!
సోపతి!
అన్ని ఆటంకాలనూ తొలిగించే దేవుడు విఘ్నపతి!
సిహెచ్.వి. బృందావన రావు
నెల్లూరు
6
అగ్రజుడు
అనుజుడు
ముక్కోటి నదులలోనూ స్కందునికి ఎదురొచ్చాడు భవాత్మజుడు*
(భవాత్మజుడు = వినాయకుడు)
కాళీపట్నపు శారద
హైదరాబాదు
7
సదనం
కదనం
అదనంగా లేదు సమయం చూసేందుకు వదనం.
గోమతి (సుమచంద్ర)
హైదరాబాద్
8
పురస్కారము
తిరస్కారము
రెండింటిని సమానంగా స్వీకరించే మహనీయులకు నమస్కారము
హైమ. కందుకూరి
హైదరాబాద్
9
లేఖరి!
విలేఖరి!!
పంచమవేదాన్ని లిఖించిన వినాయకుడే సిసలైన సులేఖరి!!!
ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
విజయవాడ
10
అగుపించు
అనిపించు
కనిపించేదంతా నిజమనిపించు.. సత్యాన్ని నిదానంగా గమనించు!!
K సత్యనారాయణ
విశాఖపట్నం
11
చిత్రం
ఛత్రం
అగ్రపూజలు అందే గణరాజుకు గడ్డిపోచే పత్రం!
కె.కె.తాయారు
మదనపల్లి (చిత్తూరుజిల్లా)
12
సిద్ధి!
బుద్ధి!!
వినాయకుడికే తొలి పూజ – శక్తి కొద్ది!!!
ప్రియా సిస్టర్స్
విజయవాడ
13
సుతులు
హితులు
ఎందరున్నా చివరికి కావాల్సింది నలుగురు సన్నిహితులు
కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్
14
మనం
మౌనం
శూన్యం, నిశ్శబ్దం ఎక్కడో.. అక్కడ.. ధ్యానం.
కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్
15
వృత్తులు
ప్రవృత్తులు
హస్తాలే ఆధారం -పనియే దైవంగా భక్తిప్రపత్తులు
గంగరాజు పద్మజ
మలకపేట హైదరాబాద్
16
తీరులు
దారులు
గమ్యం ఒకటైనా చేర్చే మార్గాలు వేరువేరులు
కామేశ్వరి వాడ్రేవు
హైదరాబాద్
17
ఆగ్రహం,
నిగ్రహం,
ఇంద్రియాలను, కోరికలను జయించినప్పుడే ప్రాప్తిస్తుంది దైవానుగ్రహం
దినవహి సత్యవతి
గుంటూరు.
18
ఫలం
జలం
భక్తిని ఎలా ప్రదర్శించినా వస్తుంది పుణ్యఫలం..
పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం
19
చందా
వందా
కొన్నిచోట్ల సాగుతుంది దేవుని పేరుతో దందా!
కుసుమ. పత్రి,
తణుకు
20
పలవలు
చిలవలు
అనవసర విషయాల జోక్యంతో తగ్గుతాయి మానవవిలువలు.
శ్రీహరి.కె
హైదరాబాద్
21
గణపతి
దళపతి
ప్రమథగణాలకు సారథ్యం వహించే వేల్పుడు సేనాపతి
రావెల పురుషోత్తమరావు
అమెరికా
22
సడి
బడి
జనహితం కోరే పుణ్యాత్ములకు గుండెల్లో గుడి!
-డాక్టర్ శైలజ మామిడాల,
హనుమకొండ.
23
ఒజ్జ
బొజ్జ
గణపయ్య మన ఇంట వెలసిన వరాలసజ్జ.
టి.రామాంజనేయులు
ఆదోని,కర్నూలు జిల్లా
24
పొనుగు
పెద్దజానుగు
మునుగుతూ కోట్లాది భక్తులను గట్టెక్కించే అనుగు
(పొనుగు : పొట్టి,జానుగు : చెవి అనుగు : మిత్రుడు)
వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు
25
ధైర్యం
శౌర్యం
ఎప్పుడైనా కార్యసఫలతకి పట్టుదల, కృషి అనివార్యం
శాంతమూర్తి
హైదరాబాద్
~
(మళ్ళీ కలుద్దాం)