Site icon Sanchika

సంచికలో 25 సప్తపదులు-16

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
అతి!
ఇతి!!
పితృరుణము తీర్చుకోకుంటే మనిషి జీవితం అధోగతి!!!

మన్నవ సుధాకర్
విజయవాడ

2
ఊకలు
నూకలు
పొల్లు పొట్టు లేని బియ్యానికే రూకలు

విన్నకోట ఫణీంద్ర
హైదరాబాద్

3
రామాయణం
ప్రేమాయణం
హనుమ సీతమ్మను కనుగొనుటయే సుందరకాండ పారాయణం.

సూర్యకళ తనికెళ్ల
విశాఖపట్నం.

4
పద్యం
గద్యం
అమ్మభాషకు అన్యాయం జరుగుతుంటే చూడొద్దు చోద్యం

డా.పెద్దింటి ముకుందరావు
శ్రీకాకుళం జిల్లా

5
కృత్యుడు
భృత్యుడు
పనియందు అనుకున్న ఫలితం పొందినవాడు కృతకృత్యుడు

కామేశ్వరి వాడ్రేవు
హైదరాబాదు

6
కొంచెం!
లంచం!
అవినీతి చుట్టూ తిరుగుతూ ఉన్నది సకల ప్రపంచం!

సిహెచ్.వి. బృందావన రావు
నెల్లూరు

7
వ్యాపకాలు
రూపకాలు
మదినిండా నింపుకోవాలి మరువలేని మధురమైన జ్ఞాపకాలు

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

8
రాతలు,
చేతలు,
ప్రవర్తన సరిలేకుంటే కీలెరిగి పెట్టాలి వాతలు!

దినవహి సత్యవతి
గుంటూరు.

9
భుక్తి
రక్తి
జాతరలకు, పండగలకు ఊరేగింపులకు సంబరాలతో అభివ్యక్తి

పి. బాలాత్రిపుర సుందరి
హైదరాబాద్

10
భవ్యము
దివ్యము
సమాజానికి విలువలను బోధించేదే ఆదర్శ కావ్యము

సింహాద్రి వాణి
విజయవాడ

11
సన్యాసం
ఉపన్యాసం
బతుకు నడపించటానికి ఏదో ఒక విన్యాసం

ఆలేటి పరంజ్యోతి
ఖమ్మం

12
నిత్యం
అనిత్యం
మనస్సులో ఏముందో పరిశీలించి అర్థం చేసుకోవటం – సత్యం.

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్

13
పిలుపు
మలుపు
పోతన భక్తిరసం శ్రీనాథుని శృంగారరసం మేల్కొలుపు.

భోగెల. ఉమామహేశ్వరరావు
శ్రీకాకుళo

14
ఘటన
నటన
జీవితంతో రాజీ పడకూడదంటే తప్పదు ప్రతిఘటన!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాదు

15
కోపాలు
తాపాలు
విడిచిపెడితే ‘బలగం’లో వెల్లి విరుస్తాయి మురిపాలు.

బిక్కునూరి రాజేశ్వర్,
నిర్మల్

16
మితము
అమితము
మనిషి హద్దుల్లో ఉంటేనే భవిష్యత్తు హితము

పట్నం శేషాద్రి
హైదరాబాద్

17
గతం
స్వగతం
ప్రకృతివైపరీత్యాల నధిగమించు ఆలోచనలకు పలకాలి స్వాగతం

YLNV ప్రసాదరావు
విజయనగరం

18
ఆకారం
వికారం
ఎన్ని సిరిసంపదలున్నా మనిషికి ఉండకూడదు అహంకారం..!!

జి.కె.నారాయణ (లక్ష్మి శ్రీ)
జోగులాంబ, గద్వాల్ జిల్లా

19
అధికం
అత్యధికం
మనుజుల చలనాలతో కరచాలనాలతో రోగాలవుతున్నాయి నిరవధికం.

శ్రీపెరంబుదూరు నారాయణరావు
హైదరాబాద్.

20
జగతి
ప్రగతి
కలలు పండే కాలమొస్తే కలుగును పురోగతి

ఆర్. రమాదేవి
హైదరాబాద్

21
ఆకారము
వికారము
మనసు మంచిది అయితే చెప్పు స్వీకారము.

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

22
మిగులు
తగులు
ఈర్ష్య అసూయలు తొలిగితే జీవితమున ఉండదు దిగులు!

మొర్రి గోపి
కవిటి

23
మోదము
జూదము
ఆటకై సరదా, అలవాటై తెస్తుంది ప్రమాదము!

లింగాల యుగంధరాచారి, మదనపల్లి

24
అంతం..!
పంతం..!!
కావేవీ అలవోకగా – కోరుకునే కోరికలు సొంతం..!!!

మహమ్మద్ అంకూస్
బెల్లంపల్లి

25
జీవాత్మ
పరమాత్మ
పరలోకంలో కలిసిపోయేలోగా నొప్పించక ఒప్పించు అంతరాత్మ!

డాక్టర్ శైలజ మామిడాల,
హనుమకొండ.

~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version