సంచికలో 25 సప్తపదులు-2

1
1

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

సప్తపది1

తొలకరించింది!
చిలకరించింది!
మండుటెండల్లో తపించిపోయిన నేలతల్లి తనువంతా పులకరించింది!

సిహెచ్.వి.బృందావనరావు
నెల్లూరు

సప్తపది 2

చెడు
విడు
దుష్టులను సంస్కరించటానికి కావాలి సంయమనం కడు

అభిషేక్
హైదరాబాద్

సప్తపది 3

నదులు
నిధులు
మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టే వారధులు

బోర భారతీదేవి
విశాఖపట్నం

సప్తపది 4

పక్షము
వృక్షము
పెంచుకుంటే లాభం, పెంచకుంటే నష్టం పరోక్షము

డి .రామకృష్ణ నాయుడు (దారానా)
శ్రీకాకుళం

సప్తపది 5

క్రోధము
విరోధము
వలదని తల్లిదండ్రులు పిల్లలకు చేయాలి ప్రబోధము

హైమ. కందుకూరి
హైదరాబాద్

సప్తపది 6

జలాలు
ఫలాలు
నదీనదాలు నిండితే అవే ప్రకృతికి బలాలు.

పున్నయ్య పాత కోటి
ఖమ్మం

సప్తపది 7

అరగనిది
చెరగనిది
విజ్ఞానం ఊపిరి వున్నంత కాలం తరగనిది.

సింహాద్రి వాణి
విజయవాడ

సప్తపది 8

బలుపు
మలుపు
అహంకారం వీడితే తెరుచుకొనును జ్ఞానమనే తలుపు

కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు
హైదరాబాదు

సప్తపది 9

ఎగ్గు
తగ్గు
నిలిచి ధర్మంగా పోరాడితే నువ్వే నెగ్గు

గోమతి(సుమచ్చంద్ర)
హైదరాబాద్

సప్తపది 10

వినోదము
దోహదము
చినుకుల సవ్వడి మదిలో రేపెను ప్రమోదము

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

సప్తపది 11

రాత
తలరాత
ఒకటేమో నేర్చుకోవాలి రెండోది బ్రహ్మ చేత.

కాశీ మూర్తి,
హైదరాబాద్

సప్తపది 12

అనురోధము
అవరోధము
శిక్షలు లేకపోతే మళ్ళీమళ్ళీ చేస్తారు అపరాధము

బెన్నూరి వనజాక్షి
హైదరాబాదు

సప్తపది 13

మెరిసింది
కురిసింది
పుడమి తనువంతా పచ్చని కోకతో మురిసింది.

అమృతవల్లి అవధానం.
హైదరాబాద్

సప్తపది 14

చూపులు
తూపులు
మర్యాద తప్పితే నీకు తప్పవు తాపులు

మంగు కృష్ణకుమారి
విశాఖపట్నం

సప్తపది 15

విజ్ఞానం
అజ్ఞానం
భ్రమల నుండి బయటపడు మార్గమే ఆత్మజ్ఞానం

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

సప్తపది 16

నిస్సంగత్వం
నిశ్చలతత్వం
విషయవాంఛలు విద్రోహకాంక్షలు వీడు సాన్నిధ్యమే సత్సంగత్వం.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

సప్తపది 17

చప్పట్లు
దుప్పట్లు
కళాకారుని ఉన్నతస్తితికి తోడ్పడే కనిపించని మెట్లు!

జంజం కోదండ రామయ్య
జమ్మి పాళెం

సప్తపది 18

ఆరోగ్యం
మహాభాగ్యం
రోజూ నడకగా వ్యాయామం ఎప్పుడూ ఆమోదయోగ్యం.

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్

సప్తపది 19

పండితభాష
పామరభాష
పలుకుల కూతల హేతువే తెనుఁగు భాష.

పుష్పవేఙ్కటశర్మా.
ఒడిశా. భువనేశ్వరము

సప్తపది 20

శిల్పము
సంకల్పము
శిలే సుందరి! శిల్పి కౌశల్యము అనల్పము

శ్యామకృష్ణ తెన్నేటి
హైదరాబాదు

సప్తపది 21

పాత్రధారులు
గాత్రధారులు.
నటన సంభాషణలను సమన్వయo పరిచేది సూత్రధారులు

కె.వరలక్ష్మీదేవి
కర్నూలు

సప్తపది 22

రాగాలు
సరాగాలు
ఆలపించకున్నా అలరిస్తున్నాయి మది మాటున మౌనరాగాలు

జూపూడి హనుమంతరావు
హైదరాబాద్

సప్తపది 23

మిత్రత్వం
శత్రుత్వం
అందరినీ ఒకేలా చూస్తే గొప్ప వ్యక్తిత్వం

శాంతమూర్తి
హైదరాబాద్

సప్తపది 24

పెట్టు
కట్టు
సవ్యంగా పని చెయ్యడం ఇక మొదలుపెట్టు

గుండం మోహన్ రెడ్డి
నర్సాపూర్, మెదక్

సప్తపది 25

సఫలం!
విఫలం!
ఏదైనా చివరకు దక్కేది నీ కర్మఫలం!!

రహంతుల్లా
కర్నూల్

~

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here