Site icon Sanchika

సంచికలో 25 సప్తపదులు-3

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~
సప్తపది1

ప్రయాణం
ప్రమాణం
మనసుది గమ్యం తెలియని నిత్య భ్రమణం

భానుశ్రీ తిరుమల
విశాఖపట్నం.

సప్తపది 2

సాధకం
బాధకం
నాన్న చెప్పిన మాటలు నేడయ్యాయి సుబోధకం

ఫణీంద్ర విన్నకోట,
హైదరాబాద్

సప్తపది 3

మూల్యము
అమూల్యము
మితిమీరిన గారాబంతో క్రమశిక్షణకు దూరమవుతుంది బాల్యము

అభిషేక్
హైదరాబాద్

సప్తపది 4

భావము
అహంభావము
సర్పం విడుచు కుబుసం – వదలదు స్వభావము

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

సప్తపది 5

విన్యాసాలు
సన్యాసాలు
రోత కలిగిస్తాయి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు

గడ్డం దేవీప్రసాద్
బెంగళూరు

సప్తపది 6

మన్ను
మిన్ను
సరైన లక్ష్యమే కృషీవలుర విజయానికి దన్ను!

యన్.కే. నాగేశ్వరరావు,
పెనుగొండ.

సప్తపది 7

దస్త్రాలు
అణ్వస్త్రాలు
పనేముంది ?-పౌరులకు ఎన్నడైనా
కావాల్సింది అన్నవస్త్రాలు

డా. చిట్యాల రవీందర్
హైదరాబాద్

సప్తపది 8

రాగం
అనురాగం
మలిసంధ్యలో తడబడే అడుగులకు కావాలి మానవతారాగం.

అమృతవల్లి అవధానం
ప్రొద్దుటూరు

సప్తపది 9

త్యాగం
భోగం
ప్రేమ ఆప్యాయతకు ప్రతిరూపం నాన్న అనురాగం .

యడవల్లి విజయలక్ష్మి
రాజమండ్రి

సప్తపది 10

ఉన్నారు!
విన్నారు!!
నేనున్నానని భరోసానిచ్చే భగవంతుడే కదా నాన్నారు !!!

నేమాన సుభాష్ చంద్ర బోస్, విశాఖపట్నం

సప్తపది 11

చుక్క
ముక్క
ఎర చూపి యువతను ఆడిస్తున్నారు తైతక్క

YLNV ప్రసాద్ రావు,
విజయనగరం.

సప్తపది 12

మౌనం
హీనం
మనిషి తప్పొప్పుల చిట్టా సరిచేసేది
దానం

డాక్టర్ వరలక్ష్మి హరవే,
బెంగుళూరు

సప్తపది 13

తత్వం
మహత్వం
మనిషి గుప్పెడు గుండెలో కొలువుండాలి మానవత్వం

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

సప్తపది 14

ఎక్కువ
తక్కువ
అనివార్యంగా జరిగే సంఘటనలపై
పెంచుకోరాదు మక్కువ.

గుండం మోహన్ రెడ్డి
నర్సాపూర్, మెదక్

సప్తపది 15

దివ్యాంగులు
సవ్యాంగులు
సమయం పంచాలి తల్చుకుంటే మార్గాలు పలుభంగులు

గంగరాజు పద్మజ
మలకపేట హైదరాబాద్

సప్తపది 16

ఉత్సాహం
ప్రోత్సాహం
జనబలం తోడైతే దుష్కరం సైతం దాసోహం.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

సప్తపది 17

తిరుపతి!
పరపతి!
ముడుపు కట్టి తీర్చకపోతే కలుగునా అధోగతి!

యలమర్తి మంజుల
విశాఖపట్నం

సప్తపది 18

వాడు
వీడు
ఒకరినొకరు ఎంచుకుంటే ఎప్పటికి తీరేను గోడు.

దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

సప్తపది 19

యంత్రము
తంత్రము
చింతకాయలు రాల్చడానికి జపించొద్దు ఏ మంత్రము.

మాధవీసనారా,
అనకాపల్లి

సప్తపది 20

తమస్సు
తపస్సు
శుద్దమైన మనస్సే సద్గతి నేర్చిన ఒయాసిస్సు

వీరేశ్వర రావు మూల
అమలాపురం

సప్తపది 21

సంగం
నిస్సంగం
మంచి స్నేహితులతో జీవితం హాయిగా గడపడమే సత్సంగం.

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్.

సప్తపది 22

ఋతువు
క్రతువు
తప్పక కోరేను బతుకు బండి హితవు

సి.యస్.రాంబాబు
హైదరాబాదు

సప్తపది 23

వేదన
రోదన
అర్ధం చేసుకోని మనుష్యులతో మనకెందుకు వాదన

హైమ. కందుకూరి
హైదరాబాద్

సప్తపది 24

భోగాలు
రోగాలు
మానసిక రుగ్మతలు పోగొడతాయి
సప్తస్వరాల రాగాలు.

ఉప్పలపాటి వెంకటరత్నం
ఒంగోలు

సప్తపది 25

మది
గది
అస్సలు నిద్ర పోనివ్వడం లేదు
సప్తపది!

నమ్మి ఉమాపార్వతీ నాగ్,
చెరుకువాడ.
~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version