Site icon Sanchika

సంచికలో 25 సప్తపదులు-4

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
అవని
పావని
త్యాగులు,యోగులు, దేశభక్తులకు జన్మనిచ్చిన భరతావని..!!

శ్రీమతి భారతీ కృష్ణ
హైదరాబాద్

2
సకలం
వికలం
క్షణికమైన వ్యామోహాలకు లోనైతే జీవితమే కకావికలం!

డాక్టర్ మామిడాల శైలజ
సహాయ ఆచార్యులు, హనుమకొండ.

3
అనుమానం
అవమానం
దూరం పెడితే కలిగేది అసలైన అభిమానం

చింతపల్లి. వేణుగోపాలకృష్ణ
కాకినాడ

4
వరద
బురద
పిల్లలకు వాటిలో ఆడటమే అమితమైన సరదా

రావెల పురుషోత్తమరావు
అమెరికా

5
చెలువలు
వలువలు
మానవులలో కొంతమంది లోనే మానవత్వపు విలువలు.

పు ష్ప వేఙ్కట శర్మా.
ఒడిశా. భువనేశ్వరము.

6
సైన్యము
ధాన్యము
వీటితోనే మానవాళి జీవితం ఎంతో ధన్యము

బోనగిరి. పాండురంగ
తొర్రూరు, మెహబూబాబాదు

7
ఆకాశం
అవకాశం
అందినట్టే ఉంటాయి అందిపుచ్చుకోను రావాలి సదవకాశం

పి. శ్రీదేవి.
హైదరాబాద్.

8
లోకం
ఏకం
చిత్రం, విచిత్రం మనుష్యుల సమ్మేళనాల పరిపాకం.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

9
కళ్ళు!
కుళ్ళు!!
అటు వైపు చూడకు దారి మళ్ళు!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ.

10
కణాలు
రుణాలు
అశ్రద్ధ చేస్తే పెరిగి పెద్దవయ్యే వ్రణాలు.

భమిడిపాటి వెంకటేశ్వర రావు
హైదరాబాద్

11
శ్రీమతి
బహుమతి
భువిలో దివిని సృష్టించిన అనురాగమయ సుమతి.

త్రిలోచన్ బిసాయి
కుసుంపురం

12
వైభవం
అనుభవం
అదృష్టం తిరగబడితే అప్పుడు పరాభవం సంభవం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

13
నడక
పడక
ఆరోగ్యానికి ఆహారంతో పాటు వీటిని వీడక.

మేము విజయ్ కుమార్
మనుబోలు నెల్లూరు జిల్లా

14
కుడక
నడక
వ్యాయామము పాటిస్తే ఏమవుతుంది ఆరోగ్యం బాగుపడక

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

15
అధికారం
అహంకారం
మూర్ఖత్వంతో మానవతా విలువలను చెయ్యవద్దు ధిక్కారం.

సింహాద్రి వాణి
విజయవాడ

16
రారా
పోరా
కలిసుందాం, విడిపోదాం అన్నది మనలోనే ఉందిలేరా

సదాశివుని లక్ష్మణరావు
విశాఖపట్నం

17
తీరిక
చేరిక
కష్టంలోనూ కనపడనిది అమ్మ కన్నీటి చారిక!!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాద్

18
అనుకరణ..
అనుసరణ..
మహానుభావుల జీవితాల పరిశీలన కలిగిస్తుంది ప్రేరణ!!

పేరిశెట్టిబాబు,
భద్రాచలం

19
ధైర్యము
శౌర్యము
సంకల్పము మంచిదయితే తప్పక నెరవేరును కార్యము

కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు
హైదరాబాద్

20
చింత
వంత
కోరికలు అదుపులో పెట్టుకుంటే – లేకమరి, నిశ్చింత!

సిహెచ్.వి. బృందావన రావు,
నెల్లూరు

21
జ్యోతి
రీతి
గురువు అంధకారాన్ని బాపు. అనుసరిస్తే -ఖ్యాతి!

జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం

22
వననిధులు
జలనిధులు
విశ్వం మనుగడకు ప్రకృతి ప్రసాదించిన ప్రాణనిధులు

ఆచార్యులు జీ వీ యస్
నూజివీడు

23
శిలలా?
కలలా
అణుయుగం శాంతియుతం కాకుంటే మిగిలేదంతా విలవిలా!

ఉమాదేవి పోచంపల్లి గోపరాజు,
రిచ్మండ్ ,టెక్సస్, యు ఎస్ ఎ

24
చిరాకు
పరాకు
మదిలో తొలిగించుకుంటే మనసులో ఆశల మారాకు!

శ్రీమతి గన్నోజు పద్మావతి
మహబూబ్ నగర్.

25
రేపు
మాపు
చేయాలనుకున్న పనిని ‌వెంటనే‌ చేసి చూపు

ఆలేటి పరంజ్యోతి
ఖమ్మం

~
(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version