Site icon Sanchika

సంచికలో 25 సప్తపదులు-7

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

(గురుపూర్ణిమ ప్రత్యేక సప్తపదులు)

~

1
గురుచరణం!
పాపహరణం!
జనుల అజ్ఞానాంధమును అవ్యాజముగ తొలగించు ఉషాకిరణం !!!

అంగర వెంకట సత్య గోపాలస్వామి,
తూరంగి, కాకినాడ.

2
బడి
నుడి
గురువు బోధనలతో తిరుగుతుంది శిష్యుని సుడి

కాళీపట్నపు శారద
హైదరాబాదు

3
గురువు
బరువు
తెలుసుకుని ప్రవర్తిస్తేనే మనలకు బ్రతుకు తెరువు

రావెల పురుషోత్తమరావు
అమెరికా

4
పీఠం
పాఠం
రెండింటిలో మారుమ్రోగు నిత్యం చక్కగా గురుకంఠం.

దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

5
వేరెవరూ
కారెవరూ
తెలుసుకో మేటి గురువుకు సాటి రారెవరూ

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

6
బోధించుట
ప్రబోధించుట
నాటి గురువుల బాధ్యతగా వుండేది శోధించుట

కాటేగారు పాండురంగ విఠల్
హైదారాబాద్

7
యుక్తి
శక్తి
విజ్ఞానo సముపార్జనకై గురువుకు చూపించాలి భక్తి

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
హైదరాబాద్

8
భుక్తి
ముక్తి
పొందాలంటే గురువుపై ఉండాలి పవిత్రమైన భక్తి.

అ.వెం.కో. రామాచార్యులు,
కాకినాడ.

9
గురువు
చెఱువు
విద్యార్థి జ్ఞానదాహం తీర్చి పెంచేను పరువు

ఆచార్య వై వి సుబ్రహ్మణ్యం
హైదరాబాద్

10
బోధన
సాధన
గురుభక్తి లేని విద్యార్థులకు మిగిలుతుంది వేదన..

పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం

11
ఆట!
పాట!!
ఉత్తమ జీవితానికి గురువుగారు చూపును రాచబాట!!!

లయన్ శ్రీ.కంబాల తిమ్మారెడ్డి
కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా.

12
నెరవు
పరువు
ఉన్నతంగా ఉత్తమంగా బ్రతకడం నేర్పుతాడు గురువు!

సిహెచ్.వి. బృందావన రావు.
నెల్లూరు

13
స్వాధ్యాయి
సహాధ్యాయి
గురుమిత్రుల సహకారంతోనే బ్రతుకుపాఠం నేర్చుకుంటాడు అధ్యాయి.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

14
బోధకుడు
శోధకుడు
గుణములను రుద్ది వృద్ధిచేయు గురువు ఆరాధకుడు.

కృష్ణ తేజ
హైదరాబాద్

15
వేదము
నాదము
ఆది గురువు వ్యాసమహర్షి అందించిన ప్రసాదము!

కె.కె.తాయారు.
మదనపల్లి (చిత్తూరుజిల్లా)

16
గురువు
తరువు
మనిషికి అండ అయి, చూపిస్తారు బ్రతుకుతెరువు.

భాగ్యశ్రీ ముత్యం
కొవ్వూరు.

17
తరువు
మేరువు
ఎవరడిగినా నీలోని స్వశక్తి తెలిపేది గురువు

ఉమాదేవి పోచంపల్లి గోపరాజు,
రిచ్మండ్ ,టెక్సాస్ ,అమెరికా

18
బాట
మాట
గురువుల ఆత్మీయ్యతలే మన భవితకు పూలబాట.

ప్రసన్న కుమ్మరగుంట్ల,
తుని,

19
మది
గది
ఎప్పటికీ విద్యార్థులకు తమ గురువుయే జ్ఞాననిధి.

కుసుమంచి నాగమణి
మెంటాడ.

20
ఆదిగురువు
సద్గురువు
లోకానికి భగవద్గీతను ప్రసాదించిన వ్యాసమహర్షి జగద్గురువు!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

21
విద్యార్థులం
జ్ఞానార్థులం
విద్యను గరపమని గురువుల నర్థించే అభ్యర్థులం.

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

22
కారణగురువు
సూచకగురువు
యోగతత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని ప్రసాదించేవారు వాచకగురువు.

సాధన.తేరాల,
ఖమ్మం,

23
చరణం
కరణం
విద్యకూ, మంత్రానికీ, అనుష్ఠానానికీ ఉండాలి గురుశరణం.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

24
ఆనాడు
ఈనాడు
పరోపకారం చేసే పంచభూతాలు, గురువులే ఏనాడు..!!

శ్రీమతి భారతీకృష్ణ
హైదరాబాద

25
మార్గదర్శిని
సూక్ష్మదర్శిని
గురువు విద్యార్థులకు ఎప్పుడూ చూపించు జ్ఞానదర్శిని.

కాను కొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు
హైదరాబాద్

~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version