Site icon Sanchika

సంగీత సురధార-10

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 9 – మూడవ భాగము

తాళ ప్రస్తారములు

తాళ ప్రస్తారములు ముఖ్యముగా 14 భేదము లగుచున్నవి. అవి

  1. నష్టము
  2. ఉద్దిష్టము
  3. పాతాళము
  4. మహా పాతాళము
  5. అనుధృత మెరువు
  6. దృత మేరువు
  7. ద్రుత శేఖర మేరువు
  8. లఘు మేరువు
  9. గురు మేరువు
  10. వ్లుత మేరువు
  11. కాక పాద మేరువు
  12. సంయోగ మేరువు
  13. ఖండ ప్రస్తారము
  14. యతి ప్రస్తారము

దశ ప్రాణయుక్తమగు తాళముల లోనదైన ఒక తాళము వేయుచూ, గాత్రమున గాని, జంత్రమున గాని గానము చేయుట రెండు విధములు.

  1. అనులోమము: అనగా ఏదైనా ఒక తాళమును ప్రథమ కాలమున నడుపుచు, స్వరములు లేక సాహిత్యాక్షరాములను నోటితో గాని, వీణ గోటు మొదలగు వాద్యములందు మీటుట వలన గాని వాయించుట వలన గాని త్రికాలము (or) షట్కాలము లను పలికించుట.
  2. విలోమము: పై దానికి వలె వాయించుట వలన కాని ప్రథమ కాలముగా పలికించుచూ, తాళము యొక్క అక్షర కాలములను వరుసగా త్రికాలము గాని షట్కాలము గాని నడుపుట.

35 తాళములు చతురస్రాది పంచగతి భేదములనొందినచో 35 x 5=175 రకముల తాళము లగును.

సప్త తాళములు – దివ్య (దివ్య సంకీర్ణ)

చతురస్ర (మనుష్య) – సింహ (మిశ్ర సంకీర్ణ)

త్రిశ్ర (స్వర్గ) – వర్ణ (దేశ్య సంకీర్ణ)

మిశ్ర (హంస) – వాద్య (మిశ్ర దేశ్య సంకీర్ణ)

ఖండ (దేశ్య) – కర్నాటక (దేశ్య శుద్ధ సంకీర్ణ)

సంకీర్ణ (చిత్ర) – అను 5 లఘువులను, 5 లఘువులలో చేరి మొత్తం 5 + 5= 10 రకములు.  7 x 10 = 70 తాళములు అగును.

70 తాళములు చతురశ్రాది పంచగతి భేదముల నొందిన 70 x 5 = 350 రకముల తాళము లగును. గతి భేదముచే ఏర్పడు నామరహితులైన 175 తాళములు గాని 350 గాని 108 x 5 = 540.

శ్రీ పార్శ్వదేవుని ‘సంగీత సమయసార’ గ్రంథములోను, శ్రీ నారదుని ‘సంగీత మకరంద’ గ్రంథములోను 101 తాళములు పేర్కొనబడెను. ఇవి గాక 108 తాళములు సూళాది 35 కంటే అతి పురాతనమైనవి.

108 తాళము చతురస్రాది పంచజాతి లఘు సంబంధం కలిగినచో 108 x 5 = 540 తాళము లగుచున్నవి – 108 తాళములలో కూడా కొన్ని తాళములు అమంగళకరమైన నిశబ్దక్రియాంగములు కూడి యుండుటచే యీ 108 తాళములు అంత వాడుక యందు లేవు.

శ్రీ శార్ఞ్గ దేవుడు తన సంగీత రత్నాకరంలో 120 తాళములు 17వ శతాబ్దానికి చెందిన ‘రాగ తాళ చింతామణి’లో 124 తాళములు పేర్కొనెను.

అష్టోత్తర శత (108) తాళ పథకము (1-108)

క్రమ సంఖ్య తాళముల పేర్లు అంగ సంజ్ఞలు అంగ సంఖ్య మాత్రలు అక్షరములు
1. చచ్చత్పుట 8 8 1 8
2. చాచపుట 8 1 1 8
3. షట్పితా పుత్రిక 8 1 8 8 1 8
4. సంపద్వేష్టక 8 8 8 8 8
5. ఉద్ఘుట 8 8 8
6. ఆది I 1 1 4
7. దర్పణ 0 0 8 3 3 12
8. చర్చరి O O U I O O U I O O U

O O U I O O O I O O O I

O O U I O O O U I

32 18 72
9. సింహలీల I O O O I 5 3 ½ 14
10. కందర్ప 0 0 1 8 8 5 6 24
11. సింహవిక్రమ 8 8 8 1 81 1 8 8 8 16 64
12. శ్రీరంగ 1 1 8 1 8 5 8 32
13. రతిలీల 1 8 8 1 4 6 24
14. రంగతాళ 0 0 0 0 8 5 4 16
15. పరిక్రమ 1 1 1 88 5 7 28
16. ప్రత్యంగ 8 8 8 1 1 5 8 32
17. గజలీల I I I I U 5 4 ¼ 17
18. త్రిభిన్న 1 8 8 3 6 24
19. వీర విక్రమ 1 0 0 8 4 4 16
20. హంసలీల I I U 3 2 ¼ 9
21. రంగద్యోతన 8 8 8 1 8 5 10 40
22. వర్ణభిన్న 0 0 1 8 4 4 16
23. రాజ చూడామణి, 0 0 1 1 1 0 0 18 9 8 32
24. రాజతాళ 8 8 0 0 8 1 8 7 12 48
25. సింహ విక్రీడిత 1 1 8 8 1 8 8 1 8 9 17 68
26. వనమాలి 0 0 0 0 1 0 0 8 8 6 24
27. చతురస్రవర్ణ 8 8 1 0 0 8 6 8 32
28. త్రయస్యవర్ణ 1 0 0 1 1 8 6 6 24
29. మిశ్రవర్ణ O O O O U 15 6 ¾ 27
30. రంగప్రదీప 8 8 1 8 8 5 10 40
31. హంసనాద* 1 1 8 0 0 8 6 8 32
32. సింహనాద 1 1 8 18 5 8 32
33. మల్లికామోద 1 1 0 0 0 0 6 4 16
34. శరభలీల 1 1 0 0 0 1 1 7 5 ½ 22
35. రంగాభరణ 8 8 1 1 8 5 9 36
36. తురంగలీల 0 0 1 3 2 8
37. సింహనందన 1 8 1 8 8 1 1 18 32 128
38. జయశ్రీ 8 8 1 1 8 5 8 32
39. విజయానంద 1 1 8 8 8 5 8 32
40. ప్రతి తాళ 1 0 0 3 2 8
41. ద్వితీయ 0 1 0 3 2 8
42. మకరంద 0 0 1 1 1 8 6 6 24
43. కీర్తి 8 1 8 8 1 8 6 12 48
44. విజయ 8 8 8 1 8 5 9 36
45. జయమంగళ 1 8 8 1 8 8 6 12 48
46. రాజ విద్యాధర 1 8 0 0 4 4 16
47. మఠ్య 1 1 8 1 1 1 1 7 8 32
48. జయ 1 8 1 1 0 0 6 6 24
49. కుడుక్క 0 0 1 1 4 3 12
50. నిస్సారుక 1 8 8 3 5 20
51. క్రీడ O O U 3 1 ¼ 5
52. * త్రిభంగి 1 8 1 8 4 6 24
53. కోకిలప్రియ 8 1 8 3 6 24
54. శ్రీకీర్తి 8 8 1 1 4 6 24
55. బిందుమాలిని 8 0 0 0 0 8 6 6 24
56. సమ తాళ I I O O U 5 3 ¼ 13
57. నందన 1 0 0 8 4 5 20
58. ఉదీక్షణ 1 1 8 3 4 16
59. ఘట్టిక 8 0 8 3 5 ½ 22
60. ధేంకిక 8 1 8 3 5 20
61. వర్ణమట్టిక 0 0 1 0 0 5 3 12
62. అభినందన 1 1 0 0 8 5 5 20
63. అంతర క్రీడ O O O U 4 1 ¾ 7
64. మల్ల తాళ I I I I O O U 7 5 ¼ 21
65. * దీపక 0 0 1 1 8 8 6 7 28
66. అనంగ 1 8 1 1 8 5 8 32
67. విషమ O O O O U O O O O U 10 4 ½ 18
68. నంది 1 0 0 1 1 8 6 6 24
69. ముకుంద 1 0 0 1 8 5 5 20
70. కందుక 1 1 1 1 8
71. ఏక తాళ O 1 ½ 2
72. ఆట తాళ 1 0 0 1 4 3 12
73. పూర్ణకంకాల 0 0 0 0 8 1 6 5 20
74. ఖండకంకాల 0  0 8 8 4 5 20
75. సమకంకాల 8 8 1 3 5 20
76. విషమకంకాల 1 8 8 3 5 20
77. చతుస్థాళ 8 0 0 0 4 3 ¼ 14
78. దోంబులి I I U 3 2 ¼ 9
79. * అభంగ 1 8 2 4 16
80. రాయవంకోల 8 1 8 0 0 5 6 24
81. లఘుశేఖర I U 2 1 ¼ 5
82. ప్రతాపశేఖర 8 O O U 4 4 ¼ 17
83. జగఝంప 8 O O O U 5 3 ¾ 15
84. చతుర్ముఖ 1 8 1 8 4 7 28
85. ఝంప O O U I 4 2 ¼ 9
86. ప్రతిమధ్య 1 1 8 8 1 1 6 8 32
87. గారుగి O O O O O U 6 2 ¾ 11
88. * వసంత 1 1 1 8 8 8 4 4 16
89. * లలిత 1 8 2 3 12
90. రతి తాళ 0 0 0 0 4 2 8
91. కర్ణయతి 8 1 1 1 4 5 20
92. యతి 0 0 0 0 0 0 6 3 12
93. షట్‌ తాళ 0 0 1 8 4 5 20
94. వర్ధన 1 1 8 8 4 8 32
95. వర్ణయతి 1 0 1 8 1 8 6 7 28
96. రాజనారాయణ 0 0 8 3 4 16
97. మదన O O O O U 5 2 ¼ 9
98. కారిక 0 0 1 0 0 8 8 1 1 1 1 8 1 1 14 15 60
99. పార్వతీలోచన 8 1 1 8 4 7 28
100. శ్రీనందన 0 1 8 3 4 ½ 18
101. లీల 0 1 8 3 4 ½ 18
102. విలోకిత 1 8 0 0 8 5 7 28
103. లలితప్రియ 1 1 8 1 1 5 6 24
104. ఝల్లక 8 1 1 3 4 12
105. జనక 1 1 1 1 8 8 1 1 8 9 12 48
106. లక్ష్మీశ 0 0 1 1 8 5 6 24
107. రాగవర్ధన O O U 0 8 5 4 ¾ 19
108. ఉత్సవ 8 1 2 4 16

గ్రామ మూర్ఛన జాతి పరిణామం

గ్రామము అనగా భారతీయ సంగీతమునకు ప్రాముఖ్యమైన సప్త స్వరముల కొలత గ్రాముము అని చెప్పబడెను. కుటుంబము చేరి ఒక గ్రామము ఎట్లగునో అట్లే కొన్ని స్వరములు చేరిన ఒక గ్రామము అగును. గ్రామములో శుద్ధ, వికృతి స్వరములు కూడ యిమిడి ఉండును.

ప్రాచీన ప్రముఖ లక్షణకారుడైన ‘మతంగుని’ కాలము నుండి కూడా గ్రామమునకు ఇదే అర్థము చెప్పబడుచుండెను. ఇట్టి గ్రామములు 3 విధములు.

  1. షడ్జ గ్రామము: 4+3+2+4+4+3+2=22 శ్రుతులను క్రమముగా పొందిన ‘స రి గ మ ప ద ని’ అను సప్త స్వరములు గలది యగుటచే ఇది గాన యోగ్యమైనదని చెప్పబడెను. ప్రాచీన లక్షణ కారకుడైన శ్రీరామామాత్యుడు అన్ని దేశీ రాగములను యీ షడ్జ గ్రామమునకు చెందినవే అని చెప్పి యుండుట ముఖ్యముగా గమనించదగిన విషయము.
  2. మధ్యమ గ్రామము: ఈ మధ్యమ గ్రామము షడ్జ గ్రామమును పోలినదైనను, యిందుగల పంచమము ఒక శ్రుతి మాత్రము తక్కువగా నుండి 4+3+2+4+4+3+2=22 శ్రుతులను క్రమముగా పొందిన ‘స రి గ మ ప ద ని’ అను సప్త స్వరములు గలది యగుటచే ఇది గాన యోగ్యమైనదనీ కొందరు లక్షణకారులు చెప్పియున్నను, మరి కొందరు యిందు గల పంచమము ఒక శ్రుతి తక్కువగా యున్నందున గాన యోగ్యమైనది కాదని చెప్పియుండిరి. ఒక శ్రుతి తక్కువగా యుండు యీ పంచకమునే చ్యుత పంచకమనియు, లఘ పంచకమనియు, కైశికి పంచకమనియు, త్రిశ్రుతి పంచమనియు చెప్పబడెను.
  3. గాంధార గ్రామము: 3+3+3+3+3+3+4=22 శ్రుతులను క్రమముగా పొందిన ‘స రి గ మ ప ద ని’ అను సప్త స్వరములు గలది యైనను, వికృతి స్వరములతో కూడుకున్నది యగుటచేనిది గాన యోగ్యము కాదని తొలగించబడినది. కనుకనే ఆది గ్రంథమైన భరతుని ‘నాట్యశాస్త్రము’లో కూడా ఈ గాంధార గ్రామము గురించి చెప్పకపోవుట జరిగెను. 7 కొలతలను 7 మూర్ఛనలని చెప్పబడెను. ఈ విధంగా షడ్జ, మధ్యమ గ్రామముల రెంటికి గల 7+7=14 మూర్ఛనలలో కొన్ని మరల వచ్చుటచే వీటిలో 7 మూర్ఛనలు మాత్రమే ముఖ్యమైనవి. ఈ ఏడింటినీ 7 జాతులు (రాగములు)గా చెప్పియుంటిరి.

మూర్ఛన అనునది ఆధునికమైన స్వచ్ఛ రాగ భావమునకు సరిపోవునది అగును. ఈ మూర్ఛనలకు జీవ స్వరములును, న్యాస స్వరములును చేరి రంజకమైన వ్యక్తిత్వము కలుగగనే యిది ఒక జాతి (రాగము) గా పరిణమించినది.

సప్త శుద్ధ జాతులు 7.

షాడ్జి, నైషాది, దైవతి, ఆర్షభి – షడ్జ గ్రామమునకు; గాంధారి, మధ్యమ, పంచమ – మధ్యమ గ్రామమునకును చెందినవిగా ప్రాచీన లక్షణకారులు చెప్పియున్నారు. తరువాత మతంగుడు వీటిని శుద్ధ, ఛాయలుగా, సంకీర్ణ రాగములుగా విభజించి, యిప్పటి జనక, జన్య రాగ పద్ధతికి మార్గము నేర్పరిచెను.

మిక్కిలి పురాతన కాలములో ఋగ్వేదమును సాధారణముగా ఒకే శైలి యగు స్వరిత (స) లో పాడుచుండెడివారు. కానీ ఆ తరువాత ఉదాత్త (రి), అనుదాత్త (ని) స్వరములను చేర్చి పాడుచుండెడి వారు. ఈ విధముగా ఋగ్వేద గానంతో ప్రారంభమయిన ఏక స్వర కొలత గాను, ఆ తరువాత మ గ రి స ని ద ప, అను సప్త స్వర కొతలగాను వృద్ధి చేయబడినది. ఈ విధంగా ఏర్పడిన సంపూర్ణ కొలత యగు యీ మ గ రి స – ని ద ప లో స ని ద ప అను భాగము హెచ్చు స్థాయి నుండి పాడినప్పుడు అది ఒక సంపూర్ణమైన స్థాయిగా ఏర్పడెను.

స్వరిత స్వరము: ఋగ్వేద గానములో పలుకు మధ్య స్వరమగు ‘స’ స్వరిత స్వరమని చెప్పబడెను.

ఉదాత్త స్వరము: ఋగ్వేద గానములో పలుకు హెచ్చు స్వరమగు ‘రి’ ఉదాత్త స్వరమని చెప్పబడెను.

అనుదాత్త స్వరము: ఋగ్వేద గానములో పలుకు తగ్గు స్వరమగు ‘ని’ ఉదాత్త స్వరమని చెప్పబడెను.

స్వర సంఖ్యను బట్టి రాగములకు ఏర్పడిన పేర్లు:

ఒక స్వరము గలది – ఆర్చిక యనియు

రెండు స్వరములు గలది గాధిక యనియు

మూడు స్వరములు గలది సామిక యనియు

నాలుగు స్వరములు గలది స్వర్ణాంతర యనియు

ఐదు స్వరములు గలది జాడవ యనియు

ఆరు స్వరములు గలది షాడవ యనియు

ఏడు స్వరములు గలది సంపూర్ణమనియు చెప్పబడెను.

(ఇంకా ఉంది)

Exit mobile version