Site icon Sanchika

సంగీత సురధార-16

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 15

సంగీత రచనలో ఛందస్సు – వివిధ ప్రాసలు – యమకం:

పద్య లక్షణములను చెప్పెడి శాస్త్రము

26 ఛందములు కలవు. అవి

  1. ఉక్త
  2. అత్యుక్త
  3. మధ్య
  4. ప్రతిష్ఠ
  5. సుప్రతిష్ఠ
  6. గాయత్రి
  7. ఉష్ణిక్ దము:
  8. అనుష్టుప్
  9. బృహతి
  10. పంక్తి
  11. త్రిష్టుప్
  12. జగతి
  13. అతిజగతి
  14. శక్వరి
  15. అతిశక్వరి
  16. అష్టి
  17. అత్యష్టి
  18. ధృతి
  19. అతిధృతి
  20. కృతి
  21. ప్రకృతి
  22. ఆకృతి
  23. వికృతి
  24. సంకృతి
  25. అభికృతి
  26. ఉత్కృతి

సంస్కృత శ్లోకాలకి, సంస్కృత తత్సమ, తత్భవ వృత్తాలకి సంబంధినది. ఇవి గాక తెలుగు పద్యాలలో వేరే ఛందస్సు ఉంది. ఆ ఛందస్సుకి గతి విభజన, మాత్ర గణము కలవు. అవి య మా తా రా జ భా న స,

సంగీత రచన అనగా రాగతాళముల ననుసరించి నిర్ణీత కాలములో పాడుటకు తగినట్లుగా రచించబడు రచన. ఇందు సాధారణంగా స్వరము, సాహిత్యము నుండును. ఒక్కొక్కప్పుడు సాహిత్యం (లేక) కేవలము స్వర రూపముగానీ యుండును. అట్టి రచన జతి స్వరమని గాని (లేదా) సంచారి యని గాని చెప్పబడును. స్వర సాహిత్యము గల రచనలను కృతి యని గాని, కీర్తన యని గాని, మరి యితర రచన యని గాని చెప్పబడును. ఇట్టి రచనలను సంగీత సామరస్యము కొరకు ఒక క్రమమైన పద్ధతిలో యతి, ప్రాసలు మొదలగునవి ఏర్పరిచి రచించుదురు. వాటి వివరములు తెలుసుకొనుటకు ముందుగా ‘పాదము’ అనగా అర్థము తెలుసుకొనుట చాలా ముఖ్యము.

పాదము:

పాదము అనగా ఒక పద్యములో గల ఒక పంక్తి (పద్యములలో 4వ వంతు)కి గాని, ఒక సంగీత రచనలో గల ఒక సంపూర్ణమైన ఆవర్గమునకు కాని (లేదా) పంక్తికి గాని పాదము అని పేరు. ఒక ఆదితాళ రచనలోని ఒక పాదములోని సాహిత్యము సంగీతములో ఒక ఆవర్తనమునకు గాని (లేక) రెండు ఆవర్తనములకు గాని సరిపోవును. రూపక, త్రిపుట, చాపు, తాళ రచనలోని ఒక పాదము సాధారణంగా 4 ఆవర్తనములకు కాని, ఒక్కొక్కప్పుడు 2 ఆవర్తనములకు కాని సరిపోవును.

ఉదాహరణలు:

  1. మరియాదగాదుర – అను శం॥ – త్యాగరాజుని కృతిలో గల ఒక పాదములోని సాహిత్యము. ఒక ఆదితాళ ఆవర్తనమునకు సరిపోవును.
  2. మా జానకి చెట్టబట్టగ మహారాజ వైతివి – అను కాంభోజి రాగ ఆదితాళ కృతిలోని ఒక పాదము 2 ఆవర్తనముఅకు సరిపోవును.
  3. రామ నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభి – అను హరికాంభోజి రాగ, రూపక తాళ కృతి లోని ఒక పాదము 4 ఆవర్తనములకు సరిపోవును.
  4. ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ తోడి – త్రిపుట తాళ కృతి లోని ఒక పాదము 4 ఆవర్తనములకు సరిపోవును.
  5. ఎవరురా నిన్ను వినా గతి మాకు – అను మోహన రాగము చాపు తాళము కృతి లోని ఒక పాదము 4 ఆవర్తనములకు సరిపోవును.

ఇట్లే ఝంపె, ఆట తాళములలోని కృతులలో ఒక పాదము 2 ఆవర్తనములకు సరిపోవును. మున్ను రావణ (తోడి), శ్రీహరి పాదతీర్థమే (శ॥) వంటి కృతులు యిందుకు ఉదాహరణలు.

యతి:

ఏదైనా సంగీత రచనలో గాని యితర రచనలో గాని ఆవర్తనమునకు గల ప్రథమాక్షరములు సమానముగా నున్నచో అట్టి వానిని యతి అక్షరములు అందురు.

ఉదాహరణ 1:

వాతాపి గణపతిం భజే హం – హంసధ్వని

వారాణాస్యం వర ప్రదం శ్రీ

ఉదాహరణ 2:

ఘునాయకా – నీ పాద యుగ

రాజీవముల నేవిడ జాలశ్రీ – అను హంసధ్వని రాగ, ఆదితాళ కృతులలోని గుర్తులు గల వా – వా; ర – ర లను యతి అక్షరములు అని చెప్పబడును.

ప్రాస:

ఏదైనా ఒక సంగీత రచనలో గాని (లేక) పద్యములో గాని ఒక పాదము లోని 2వ అక్షరము సమానముగా నున్నచో వాటిని ప్రాస (లేక) ప్రాసాక్షరములు అని అందురు. ఇటుల ఉండునట్టి ద్వితీయాక్షర ప్రాసలను తమిళంలో ‘ఎడుకే’ అని చెప్పుదురు.

ఉదాహరణ 1:

సా ఎటులోర్తునే

వి చేకొనవే ఓ – మలయమారుత రాగ కృతిలోని ‘న’లు ప్రాసాక్షరములు అగును.

ఉదాహరణ 2:

దీక్షితార్, నారాయణ తీర్థుల తరంగములలోనూ యిట్టి ప్రాసాక్షరములను మనము గమనించవచ్చు.

ప్రాసయతి:

ఒక సంగీత రచనలో విరామము తరువాత వచ్చు రెండవ అక్షరము పాదము యొక్క రెండవ అక్షరముతో సమానముగా నున్నచో దానిని ‘ప్రాసయతి’ అందురు. ఇట్టి వాటిలో పాదము నందలి రెండు భాగములు రెండు ప్రత్యేక పాదములుగా కనబడుచుండును.

ఉదాహరణ:

నా త నా పరమ పావనా

నా ఘ న వర్ణ కమాలాననా – అను ఫలమంజరి రాగ ఆదితాళ కృతిలోని గుర్తు గల ‘నా’ అక్షరములు ప్రాసయతి అగును. ఇట్టి రచనలో యతి ముఖ్యము కాదని గ్రహిచవలెను.

సమయతి ప్రాస:

ఒక సంగీత రచనలో యతి, ప్రాసలు రెండును సమానముగా నున్నచో  అట్టివాటిని ‘సమయతి’ ప్రాసాక్షరములు అనబడును.

ఉదాహరణ:

ఎందు కు పెద్దల వలె బుద్ధియ్యవు

ఎందు బోదు నయ్య రామయ్య

అను శ॥ రాగ కృతి లోని యతి ప్రాసలు యీ రకమునకు చెందును.

అంత్య ప్రాస:

ఏదైనా సంగీత రచనలోని చరణములు (లేక) ఒక పాదము యొక్క అంత్యాక్షరములు సమానముగా నున్నచో  అట్టివాటిని ‘అంత్య ప్రాస’ అని చెప్పబడును.

ఉదాహరణ:

శ్రీ చంద్రరేఖరేంద్ర సరస్వతి స్వామి యొక్క శివాష్ట పదులలోను, అష్టపదులు (జయదేవుని), సదాశివ బ్రహ్మేంద్ర స్వామి యొక్క కీర్తనలలోను మనోహరమైన అంత్య ప్రాసలుండుట గమనించవచ్చును.

అను ప్రాస:

ఏదైనా ఒక సంగీత రచనలోని ఒకే రకమైన అక్షరములను గాని, మాటలను గాని మరల మరల ఉపయోగించుటను ‘అను ప్రాస’ అని అందురు.

ఉదాహరణ 1:

అక్షయ లింగ విభో – దీక్షితార్ శ॥ అ॥ప॥ యందు దక్షశిక్షణ, దక్షతర సుర అను భాగమును

ఉదాహరణ 2:

వనజాసన అను శ్రీరాగము – సుబ్బరాయ దీక్షిత్తు కృతి చరణములను ఉదాహరణలుగా తీసుకొనవచ్చును.

ఇందలి అంత్య ప్రాసకు, ద్వితీయాక్షర ప్రాసలకు యితరమైన దగును మరియు నిది రచనలోని సాహిత్యమునకు అలంకారము వచ్చును.

ఛేకానుప్రాసము:

రెండేసి వ్యంజనాక్షర జత జతగా యెడ, నెడ చెప్పబడు అనుప్రాస భేదము. ఇది కూడా శబ్దాలంకారము.

ఉదాహరణ:

యమకం – సమ వర్గ యుగాధికముగా అమర్చి చెప్పిన ఒక శబ్దాలంకారము.

ఔరా ఓ నృపాల కుమారా మన రఘునంద ఆనంద నందనం – శంకరం – అనిశం + కర

శంక + రాగ శిత = శంక రాగసిత

యమకం

నిధి చాలా సుఖమా

నిధి నీవ సుఖమా

పదగర్భము:

గ్రహము, విశ్రాంతి.

లఘువు తరువాత వచ్చే అంగము యొక్క మొదటి క్రియ మీద సాహిత్యం యొక్క మధ్యాక్షరం వచ్చుట. తర్వాత విశ్రాంతి.

స్వరసాహిత్యం:

స్వరాక్షరం శోల్‍కట్టు స్వరం. జతి, మధ్యమ కాల సాహిత్యం.

ఛందోబద్ధము కాని రచనలు:

ఛందస్సులను అనుసరింకనే రచించునట్టి రచనలు

ఉదాహరణలు – శ్లోకము, పద్యము, విరుట్టమ్ వంటి రచనలు.

వీటిలో ప్రదర్శింపబడు అభినయము తగిన సామరస్యము లేక సాధారణముగా వుండును. ఇవి ఒకే రాగములో గాని (లేక) రాగమాలికగా అనేక రాగములలో పాడుచుందురు.

ఛందశ్శాస్త్ర లోపము గల ప్రసిద్ధ రచన:

ఇవి ఛందశాస్త్రము అతిక్రమించి రచింపబడిన రచనకు వర్తించునవి యగును.

ఉదాహరణ:

పరాకేందు వదన అను సుబ్బరాయశాస్త్రి కృతిలో స్వరసాహిత్యము యీ రకమునకు చెందినదిగా చెప్పబడును.

కృతికి 3 ముఖ్య అంగములు: పల్లవి, అ॥ప॥, చరణము

6 ముఖ్యాంగాములు: అవి 1. చిట్టస్వరము 2. శోల్‍కట్టు స్వరము 3. స్వరసాహిత్యము 4. స్వరాక్షరము 5. మధ్యమ కాల సాహిత్యము 6. మణిప్రవాళ సాహిత్యము

1. చిట్టస్వరము:

కృతిలో అ॥ప॥ తరువాత వచ్చునట్టిది. ఇది 2, 4, (లేక) యింకను అధికమైన ఆవర్తనములతో కూడిన స్వరరచన యగును. సాధారణముగా యిది మధ్యకాలములో నుండును. చిట్టస్వరములను ఆయా రాగ భావములు చెడకుండునట్లు, తాళము తప్పకుండునట్లును, అనులోమ, విలోమ క్రమములో కూడా పాడడం సాంప్రదాయం.

ఉదాహరణ:

రఘువంశ సుధాంబుధి చంద్ర – కదన కుతూహలం

శృంగార లహరి – నీలాంబరి

శ్రీ రఘుకుల నిధిం – హుసేనీ

కమలాంబాంభజరే – కల్యాణి

2. శోల్‍కట్టు స్వరము:

ఇది చిట్టస్వరముల రకమునకు చెందినట్టిదే. చిట్టస్వరములలో నుండు కొన్ని తావుల నందు గల స్వరములకు – జతలను కూడా జతపరిచి రచించుదురు. అట్టి జతులను పాడునపుడు వాటి క్రింద గాని, పైన గాని యుండు స్వరములను అనుసరించి స్వరములకు బదులుగా జతులు పాడవవలసి యుండును.

ఉదాహరణ:

శ్రీ మహా గణపతింరవతుమాం – గౌళ

ఆనందనటన ప్రకాసమ్ – కేదార గౌళ

3. స్వరసాహిత్యము:

ఏదైనా కృతిలోని చిట్టస్వరము నకు సరియైన అర్థము నిచ్చు సాహిత్యమును రచించుట.

ఉదాహరణ:

పాదయుగము అనునది; మరి వేరె గతి యెవరమ్మా అను ఆనందభైరవి రాగంలోనూ

నిరవధిక సుఖదాయకి అనునది, జననీ నిను వినా, రీతిగౌళ; శ్రీనిధా నబు దార్తిహర అనునది; వాచామ గోచరుండని అని అరాణ రాగములు.

4. స్వరాక్షరము:

స్వరముల క్రింద నుండు సాహిత్యము నందు అచ్చటచ్చట పైనుండు స్వరముల వంటి అక్షరములచే సాహిత్యము నందు కూడా రచించబడి, అవి మిగతా సాహిత్యమునకు సరిపోవునట్టి అర్థము వచ్చునట్టుగా రచించుట. స్వాతి తిరుణాల్, మైసూరు వాసుదేవచార్ ముఖ్యులు.

ఉదాహరణ:

సా ని దా; స దా స ని స ని

శ్రి ని ధా; స దా శి వ క వి

వాచానుగోచరుండు – యిందుకు ఉదాహరణ.

5. మధ్యమ కాల సాహిత్యము:

ధాతు, మాతు రెండును ఎచ్చట మధ్యమ కాలములో రచింపబడునో అట్టి బాగమును ‘మధ్యమ కాల సాహిత్య’ మందురు. అ॥ప॥ చివర, చరణము చివర ఎక్కువగా వచ్చును.

ఉదాహరణ:

యోచన కమల లోచన – దర్బారు

చ॥ కీచన నిజభక్త – మధ్యమ కాల సాహిత్యమునకు ఉదాహరణ.

6. మణిప్రవాళ సాహిత్యము:

అచ్చటచ్చట 2 (లేక) 3 యితర భాషలతో కూడిన సాహిత్యముండుట

ఉదాహరణ:

వేంకటాచలపతే – కర్నాటక కాపీ – దీక్షితులవారు ముఖ్యులు అని చెప్పవచ్చు.

ఈ ఆరు ప్రముఖ అంగములు లేకున్నను కృతికి నష్టము లేదు. మొదటి మూడు అంగములను ఈ ఆరు ప్రాణస్నేహితులు అని చెప్పవచ్చు.

~

  1. త్యాగరాజు – తెలుగు, సంస్కృతము
  2. శ్యామశాస్త్రి – తెలుగు, సంస్కృతము
  3. దీక్షితులు – తెలుగు, సంస్కృతము తమిళము
  4. స్వాతి తిరునాళ్ – తెలుగు, సంస్కృతము, తమిళము, మలయాలము, మహారాష్ట్ర, హిందుస్థానీ
  5. పట్నం సుబ్రమణ్యం అయ్యర్ – తెలుగు, తమిళము
  6. శ్రీ సుబ్బరాయశాస్త్రి, వీణ కుప్పయ్యర్, పల్లవి గోపాలయ్యర్, పల్లవి శేషయ్య, శ్రీ మైసూరు సదాశివరావు, ముత్తయ భాగవతార్, వాసుదేవాచారి మొదలగువారు.

(ఇంకా ఉంది)

Exit mobile version