[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 16
జాతి త్రయోదశ లక్షణాలు:
రాగము:
యోసౌ ధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః
రంజకో జన చిత్తానం సరాగః కధితో బుధైః (సం.ర.)
అనెడి శ్లోకానుసారముగ స్వర, వర్ణములచే అలకరింపబడి, విను వారి మనస్సును (చిత్తమును) రంజింప చేయునది రాగమని చెప్పబడును (రాగము=అస).
ఈ రాగములకు భరతముని చెప్పిన దశ విధ లక్షణములు
“గ్రహాంశ తార మంద్రాచ న్యాసాపన్యాస ఏవచ
అల్పత్వంచ బహుత్వంచ షాడజాడవాతీ తథా”
గ్రామము:
గ్రామము అనగా స్వరకుటుంబం. శుద్ధ, వికృత స్వరములన్నిటి యొక్క సమూహము. అట్టి గ్రామములు మూడు. 1. షడ్జ 2. మధ్యమ 3. గాంధార గ్రామములు.
షడ్జ గ్రామమును రామామాత్యులు గుర్తించి, మన దేశీయ రాగములన్నియు యీ షడ్జ గ్రామము నుండియే పుట్టినవని చెప్పి షడ్జ గ్రామమును శుద్ధ వికృత స్వరముల సమూహము అని చెప్పెను.
ద్వాదశ స్వర స్థాన మండలము – షడ్జ గ్రామము.
(1) గ్రామము (2) మూర్ఛనలకు ఆధారభూతమైనది. స్వరములను ఆరోహణ, అవరోహణ రీతిలో క్రమముగా పాడుటయే మూర్ఛన. ఏదేనీ ఒక రాగము యొక్క ఆరోహణ, అవరోహణ ఒకసారి పాడిన రాగము విశదమగును. మూర్ఛన తరువాత (3) మేళము వచ్చినది. మేళమునకు, రాగమునకు మధ్య భేదం కలదు. మేళము సప్త స్వర సమ్మేళనము.
మేళము నందలి స్వరములకు కొన్ని లక్షణములను చేర్చి, భావ పుష్టితో పాడినచో, అదియే రాగము. ఈ రాగమునే మన పూర్వీకులు ‘జాతులు’గా అర్థం చేసుకొనిరి. జాతులు అనునవి సోదాహరణ ప్రస్తార రాగములే. రాగములలో పలు విధములన్నట్టు, ‘జాతు’లలో కూడా శుద్ధ, వికృత జాతులు రెండు రకములు కలవు.
జాతులకు భరతముని పది లక్షణములను, శార్ఞ్గ దేవుడు త్రయోదశ లక్షణములను చెప్పిరి. ఇవియే జాతుల దశవిధ, త్రయోదశ లక్షణములు.
“గ్రహాంశ తార మంద్రాచ న్యాసాపన్యాస ఏవచ
అల్పత్వంచ బహుత్వంచ షాడజాడవాతీ తథా” – భరతముని.
1. గ్రహము:
గీతమును ప్రారంభించు స్వరము. గీతమనగా లక్ష్యలక్షణ గీతములు కావు. శార్ఞ్గ దేవులు గ్రహము (గ్రహించుట), అంశము రెండును ఒకటే అని, వానిలో దేనిని గురించి చెప్పినను, రెండవదానికి అన్వయించునని చెప్పెను. గ్రహమే అంశము, అంశమే గ్రహమని భావము. షడ్జమము ఎప్పుడూ గ్రహ స్వరమే.
ఉదాహరణ:
శహనలో – రిషభము
భైరవిలో – నిషాధము
ఆటతాళ, బాలగోపాల, స్వరజతి
2. అంశం (లేక) జీవ (లేక) బహుత్వ (లేక) బహుళం (శార్ఞ్గ దేవుడు) (లేక) వాది (అని భరతుడు).
ఇవి అన్నియు ఒకే అర్థములో లక్షణకారులు పర్యాయ పదములుగా రాగంలో వాడిరి. అనగా ముఖ్యమైన స్వరము. ఎక్కువ సార్లు వచ్చునది.
షడ్జ గ్రామములో షడ్జమము గ్రహము
మధ్యమ గ్రామములో మధ్యమము గ్రహము
మధ్యమ గ్రాములో మధ్యమము, మూర్ఛన ‘హరికాంభోజీ’.
షడ్జ గ్రామము యొక్క నిషాధ మూర్ఛన అనగ షడ్జ గ్రామము నందు గల నిషాధమును షడ్జమముగా చేసికొని, అనగా ప్రాణ స్వరముగా నిర్ణయించి రంజని మూర్ఛన కనిపెట్టిరి. ఇదియే మన ధీర శం॥ స్వర సప్తకమైనది.
మధ్యమ గ్రామ గాంధార మూర్ఛన – కళ్యాణి అయినది.
గ్రహ స్వరములన్నియు అంశ స్వరములే – అని శార్ఞ్గ దేవులు చెప్పిరి. మన సంగీతమున అనేక రాగములలో గ్రహ స్వరములు అంశ స్వరములుగా నుండుట గమనింపదగినది. కాని అన్ని అంశ స్వరములునూ గ్రహ స్వరములుగా ఉండుటకు అవకాశము లేదు, అవసరమూ లేదు.
ఉదాహరణ:
‘కేదార గౌళ’ – రిషభం – ముఖ్య అంశ స్వరం. గ్రహ స్వరం.
ధన్యసి యందు గ, ని – అంశ, గ్రహ స్వరములు
నెనరుంచినాను – ని – అంశ గ్రహ స్వరములు.
శంక॥ – రి, ద, గ, మ, ప – అంశ, గ్రహ రాగచ్ఛాయ స్వరములు కూడా. రి – అంశ స్వరం కాని గ్రహ స్వరంగా రచన క్రమములో కానరాదు.
త్యాగరాజాయ నమస్తే – ని
నీ పద పంకజ, శంకరి నీవె – ద
నాదోపాసన – మ
అనుదినమును – గ
శహన – రి గ్రహ; గ, మ, ద, ని – కూడా. నిషాధము దీర్ఘముగా వాడరాదు.
ఆనందబైరవి – స, ప, గ్రహ; శు॥దై॥ అరుదుగా గ్రహ స్వరము. కమలాంబ లో – శు॥దై॥ గ్రహ.
రీతిగౌళ – పంచ స్వరము అల్పత్వమునకు. ఉదా. ని, మ – అతి ముఖ్యమైన అంశ స్వరములు.
సురటి – రి – గ్రహ; అంశ – అంగారక మాశ్రయామ్యహం. కృతి యందు వైద్యసాధం అనుచోట ‘ని’కి తక్కువ ప్రాముఖ్యము – మ, రి – అను స్వరములతో కూడి ఉండును.
చివరిసారిగా అంశము అనగా ఒక రాగమును గాని (లేక) సంగతులను గాని పాడునపుడు ఆ రాగ కళను జూపుటకై మాటిమాటికి ప్రయోగింపబడి రంజకము కలిగించునదియును, రాజు వలె ముఖ్యమైనదియునగు స్వరమును జీవ (లేక) అంశ స్వరమని చెప్పుదురు.
తారము+మంద్ర: ఉచ్చస్వరములో పాడుట, దీనినే ‘తారగతి’ అని కూడా అందురు. కొన్ని రాగములలో తారస్థాయి సంచారము వుండదు. అటులనే మంద్ర నిషాధము కూడా.
ఆనందభైరవి – మంద్ర నిషాధ సంచారం లేదు.
రామక్రియ (లేక) కామవర్ధని – అంత॥ గా॥ పైన సంచారం లేదు.
మంద్ర, తారస్థాయి నిర్ణయం రచనల వరకే గానీ, ఆలాపానా క్రమములో, అంత ఖచ్చితంగా అనుసరింప వలసిన అవసరం లేదు. జాతి లక్షణము చెప్పిన సందర్భములో మాత్రం, ఈ మంద్ర, తార నిర్ణయములను కట్టుదిట్టములతో పాటించిరి.
ఒక రాగములో, మంద్ర స్థాయిలో ఫలానా స్వరమునకు క్రింద సంచారము చేయుటకు వీలు లేదు అని చెప్పిన, ఆ స్వరమునకు క్రింద మరొక స్వరమును న్యాసం చేయరాదని అర్థం. ఈ భావమే తారస్థాయి స్వరములకు కుడా వర్తించును. ఉదా. మీనాక్షి జయకామాక్షి – శ్రీరాగం – గీతం.
న్యాసము:
ఒక రాగము నందు గాని లేక సంగతులందు గాని పాడి ముగించు స్వరమును ‘న్యాసము’ (లేక) ‘న్యాస స్వరము’ అని చెప్పబడును. న్యాసములో మూడు రకములు.
- సన్యాసము: రాగమును పాడునపుడు దానిని పలు ఖండములుగా భాగింపబడి ఒకొక్క ఖండమును ముగించు స్వరము.
- విన్యాసము: రాగమును పాడునపుడు దానిని పలు ఖండములుగా చేసి ఆయా ఖండములలో రాగకళను చూపుటకై మాటిమాటికి వచ్చు ఖండ అవయవముగా నుండు స్వరము.
- అపన్యాసము: ఒక రాగమును గాని లేక సంగతులను గాని పాడునపుడు నడుమ నడుమ ముగించు స్వరము. ఇందు సన్యాస, విన్యాసములు కూడా కలవని భరతముని చెప్పెను.
విశేష న్యాస | సామాన్య న్యాస | సహజ న్యాస |
Resting Note | సంగతి నిలుపు స్వరం
ఆరోహణ – అవరోహణ |
|
అర్ధన్యాసలు
కళ్యాణి – ని శం॥ – ని |
హిందోళ – ద | కళ్యాణి – గ
పూర్వకళ్యాణి – రి, ద |
బహుత్వము:
ఒకే స్వరమును మాటిమాటికి గ్రహించి పాడుట. ఇది రెండు విధములు
- లంఘనము – స్వరమును నుచ్చరింపక విడిచి దాని మీది స్వరమునకు దాటుట. – దీర్ఘ జంట వుండదు
- అనభ్యాసము – అల్పంగా ఉచ్చరించుట – అరుదుగా వాడుట – ఉదా. అరభి, మగరి
భాషాంగంలో అన్యస్వరము అనభ్యాసము.
కాంభోజి – స ని ప
బిలహరి – కై॥ని
ఖమాస్ – కా॥ని
ఆనందభైరవి – అం॥గా; శు॥దై॥, కా॥ని.
షాడవము:
ఏదైనా సంపూర్ణ రాగంలో ఒక స్వరమును వర్జించిన అది షాడవము. స, ప వర్జించిన అది జాడవము. (స రి గ మ ప ద ని) లో ‘ప’ వర్జించిన అది షాడవము.
పైన తెలుపబడిన ‘రాగ దశ లక్షణములు’ ప్రాచీన రాగములకే గాని యిప్పటి రాగములకు కానేరవని, యిప్పటి రాగములకు గ్రహ, అంశ, న్యాసములను మూడు లక్షణములు మాత్రమే వున్నవని వేంకటమఖి పేర్కొనెను.
(ఇంకా ఉంది)