సంగీత సురధార-27

0
1

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 20 – నాలుగవ భాగము

దశ ప్రాణములు:

7. కళ:

తాళాక్షరము యొక్క సమాంతర్భాగములు 4 అక్షరములు గల చతురస్ర జాతి లఘువులో గల ఒక్కొక్క అక్షరమునకు 4 వేసి స్వరముల చొప్పున గానం చేసిన యెడల మొత్తం 16 కళలు అగును.

  1. ఏక కళ (లేక) యదాక్షర కళ – ఒక తాళాక్షరమునకు, ఒక్కొక్క కళ (లేదా) స్వరం
  2. ద్వికళ -2 తాళాక్షరమునకు, ఒక్కొక్క కళ (లేదా) స్వరం
  3. చతుష్కళ – 4 తాళాక్షరమునకు, ఒక్కొక్క కళ (లేదా) స్వరం
  4. త్రిశ్రగతి – 3 అక్షరములు నడచిన
  5. చతురస్రగతి – 4 అక్షరములు నడచిన
  6. ఖండ గతి – 5 అక్షరములు నడచిన
  7. మిశ్ర గతి – 6 అక్షరములు నడచిన
  8. సంకీర్ణ గతి -9 అక్షరములు నడచిన
  9. నవ సంధి – already mentioned
  10. లఘు శేఖరము – వైణికులు వీణను వాయించునపుడు 4=2=6 అక్షర కాలమునకు ఒక మీటులో మీటుదురు. 2 లఘువులకు 2 సార్లు. 6 అక్షర కాలములు గల మొదటి మీఉనే ‘లఘు శేఖర’మని అందురు.
  11. ద్రుత శేఖరము – షోడశాంగములగు 16లో మూడవదైన ద్రుత విరామమునకు పూర్వీకులు ఇచ్చిన పేరు.
  12. ఖండము – ఖండిక (లేదా) భాగము (లేదా) ఆవర్తము -5 అంకెకు వర్తించును.
  13. ఆవర్తము – తాళమునకు గల అంగములన్నియు ఒకసారి పూర్తిగా వేయుట

దేశాది, మధ్యాది తాళ వివరము

3 ఘాతలు, 1 ఉసి ఈ తాళములకు అంగములు. ఆదితాళము ఇటుల ఈ పేర్లతో వ్యవహరించబడుచున్నదని చెప్పవచ్చు. ఆదితాళము నకు గల

2 ద్రుతముల కాలమును 2 ఘాతల చేతను

చతురస్ర లఘువు యొక్క కాలమును 1 ఘాత, 1 ఉసి లెక్కింపబడుతూ ఆ యా ప్రబంధములు ఉసితో ప్రారంభించెండి విధానాన్ని బట్టి దేశాది అనియు, మధ్యాది అనియు పేర్లు వచ్చినవి.

దేశాది:

3/4 అక్షర కాలము గడిచిన తర్వాత గానము ప్రారంభింపబడుట.

ఉదా: హంసధ్వని – రఘునాయక; శ్రీరంజని – భువిని దాసుడ

ఉసి లో 1/2- అది మధ్యాది

ఉదా: శ్రీరాగములో ‘నామ కుసుమములచే’; హరి కాంభోజిలో ‘ఎందుకు నిర్దయ’

మార్గ, దేశ్య తాళములు అని రెండు విధములు. తదుపరి ఈ రెండును – శుద్ధ, సాలగ, సంకీర్ణ అను ప్రాచీన గ్రంథములందు చెప్పబడినది.

చచ్చత్పుట, చాచపుట, షట్పితా పుత్రిక, సంపద్వేష్టక, ఉద్ఘుట – మార్గ తాళములు.

దేశ్య -120 అని సంగీత రత్నాకరమునందు కలదు. 101 అని సంగీత మకరంద (నారద) మందు కలదు. తదుపరి 108 అని సంగీత సమయసార (పార్శ్వదేవ) యందు చెప్పిరి.

శుద్ధ తాళములనగా మరియొక తాళముతో మిశ్రమము కానివి.

  1. చచ్చత్పుట – 8813- మార్గ శుద్ధ
  2. ధ్రువ తాళం – 1011- దేశ్య శుద్ధ

సాలగ – 2 తాళములు కలిసిన తాళములు.

ఉదా: కీర్తి – 813813 –  ఇది త్రిభిన్న, కోకిలప్రియ తాళ మిశ్రమం – మార్గ సాలగం

14 ప్రస్తారములు కలవు

  1. నష్టము
  2. ఉద్దిష్టము
  3. పాతాళము
  4. మహా పాతాళము
  5. అనుదృత మెరువు
  6. దృత మేరువు
  7. ద్రుత శేఖర మేరువు
  8. లఘు మేరువు
  9. గురు మేరువు
  10. ప్లుత మేరువు
  11. కాక పాద మేరువు
  12. సంయోగ మేరువు
  13. ఖండ ప్రస్తారము
  14. యతి ప్రస్తారము

ఆగమ శాస్త్రములలో, దేవాలయ క్రియలలోను, కుంభాభిషేక క్రియలలోనూ నవసంధి తాళమును ఉపయోగించెదరు.

తాళము మన భరత ఖండములో ఆది నుండి ఉన్నది. మరి యే దేశములోనూ ఇన్ని రకముల తాళములు లేవు.

  1. సూళాది సప్త తాళములు
  2. 35 తాళములు (జాతి భేదమును బట్టి)
  3. 105 తాళములు (గతి భేదమును బట్టి)
  4. చాపు – దాని యొక్క ఇతర రూపములు
  5. దేశాది, మధ్య తాళములు
  6. 108 తాళములు (షడంగముల ప్రస్తారము వలన)

చాపు – దాని యొక్క రూపములు జానపదముల యందు కూడా మన దేశమునందు కాననగును. ఇవి చాలా ప్రాచీనములు. దేశాది, మధ్యాది తాళముల తరువాతి తాళములు.

నవ సంధి తాళములు – 1. సొబ్రమ 2. సమ 3. మట్టావన 4. పిరంగిణి 5. మనన 6. నవ 7. బొలి 8. కొట్టిరి 9. జెంగి

చాపు తాళ వివరము:

35 తాళములు గాక, శాస్త్రము నంచు చెప్పబడని నామములు క్రియలు కల్గియుండుట. ఇది ముఖ్యముగా నాలుగు విధములు

  1. త్రిశ్ర చాపు – 1 అక్షర కాలము, రెండవ ఘాతము 2 అక్షర కాలములు
  2. ఖండ చాపు (రూపక చాపు) – 2 అక్షర కాలము, రెండవ ఘాతము 3 అక్షర కాలములు. ఉదా: పరిదానమిచ్చితే – బిలహరి
  3. మిశ్ర చాపు (ద్రువ చాపు) – 3 అక్షర కాలము, రెండవ ఘాతము 4 అక్షర కాలములు. ఉదా: – నిధి చాల – కల్యాణి
  4. సంకీర్ణ చాపు – 4 అక్షర కాలము, 4+3 ఘాతము 5 అక్షర కాలములు.

చాపు అనగా మిశ్ర చాపుగా ఎంచవలె.

  1. ధృవరూపక – గీతములందు ఉపయోగింతురు – కమలజ నారద – ఆరభి
  2. రూపకధృవ – ప్రాచీన త్రిఖండ గీతములకు వాడుదురు – సకల సురాసుర – గౌళ
  3. రగణ మఠ్య – (8+4+8=20) – గురువు, చతురస్ర లఘువు – ఒక గురువు – వీణాజక్షోణి విక్రమ విపులే – ఝంకార భ్రమరి – వేంకటమఖి
  4. కురు ఝంపె – (3+2+5=10) త్రిశ్ర దృత ఖండ – ఝెంత ధణ తకిణ – అంజీ
  5. ఝెంపెటా – ఆదితాళమునకు పేరు. 35 తాళములలో చ॥ త్రిపుట
  6. శరభనందన – శ్యామశాస్త్రుల వారిచే కనిపెట్టబడిన క్లిష్ట తాళము
  7. రామానంద – – శ్రీ రఘునాథ నాయకుల వారిచే కనిపెట్టబడిన క్లిష్ట తాళము
  8. ద్వినామ – ఇవి ఎనిమిది కలవు. మకరంద ను మహానంద అని, గజలీల ను జగలీల అని, మఠ్య ను వీర మఠ్య అని, వర్ధన ను రత్న అని, రాజనారాయణ ను నారాయణి అని, మదన ను మతంగ అని, విలోకిత ను విలోప అనియు అందురు.

ఒక్కొక్క తాళాక్షరమునకు ఇన్నేసి కళల చొప్పున నడచుటకు ‘గతి’ అని పేరు. వర్తమాన (1,2,3,4,– పెరుగుచు పోవుట), నష్ట కళలు (అదే క్రమములో క్రమముగా తగ్గుచూ వచ్చుట) – అని కూడా రెండు విధములు.

8. లయ

క్రియానంతర విశ్రాంతి లయ. (లేదా) తాళము నందలి గానము యొక్క గమన కాల ప్రమాణం లయ.

లయ మూడు విధములు.

  1. విలంబ లయ (Slow Tempo) – నిదానముగా ఉండుట
  2. మధ్య లయ (Medium Tempo) – నిదానముగా కాక, వేగముగాక యుండుట
  3. ధ్రుత లయ (Quick Tempo) – వేగముగా ఉండుట

లయలో తొమ్మిది భేదములు కలవు.

  1. విలంబిత విలంబిత
  2. విలంబిత మధ్య
  3. విలంబిత ధ్రుత
  4. మధ్య విలంబిత
  5. మధ్య మధ్య
  6. మధ్య ధ్రుత
  7. ద్రుత విలంబిత
  8. ధ్రుత మధ్య
  9. ధ్రుత ధ్రుత

వీటిలో 1 – 3 విలంబ; 4 – 6 మధ్య; 7 – 9 ధ్రుత లయకు చెందుతాయి.

9. యతి

తాళమునందు అంగముల యొక్క ఉనికి ఆయా స్థానములో యుండుట వలన ఏర్పడెడి లయ ప్రవర్తన ‘యతి’ అనబడుచున్నది. యతులు 6.

  1. సమ యతి (పిపీలిక యతి) – IIII like that ఉదా. సా రీ గా మా
  2. గోపుచ్ఛ యతి – IOU – పా,, దా,,, పా,, దా, నీ ద
  3. స్రోతోవహ యతి – UOI – ద పా మా, పా, దా,,, సా,,
  4. డమరు యతి (వేద మధ్యమ) – IOI – నీ, దా ద పా దా,
  5. మృదంగ యతి – UOIOU
  6. విషమ యతి – IUIOIIO

10. ప్రస్తారము

పెంచుట, విస్తరించుట. ఒక అంగమును గ్రహించి క్రమముగా దాని కన్న చిన్న అంగములను, ఆ అంగము యొక్క విలువ సరిపోవునటుల ఎన్ని రకములగు మార్పులను చేయ వీలగునో అన్ని రకముల మార్పులను (లేక) కలయినను ఒక క్రమయుతమగు పట్టిక రూపములో విస్తరింపజేయుట.

ఉదా:

(A) ధ్రుతము – O : UU (అనుధ్రుతములు -2) – 1

చ॥ లఘువు – లఘువు, ధ్రుత శేఖరము, అనుధ్రుతము – 8 U

3వది – 2 ధ్రుతము OO

4వది – 2 అనుధ్రుతము – OUU

5వది – అనుధ్రుతము – ధ్రుత శేఖరము, U 8

6వది – ధ్రుతము -2 అనుధ్రుతములు OUU

7వది – అనుధ్రుతము, ధ్రుతము – UUO

8వది – 4 అనుధ్రుతములు – UUUU

(B) ధ్రువ రూపక IOIIOI – ధ్రువతాళము, రూపక మిశ్రమము, దేశ్య సాలగము

సంకీర్ణ – 2 కన్నా ఎక్కువ తాళముల సమ్మిశ్రమము.

ఉదా: సింహనందన  8813100881313811+

6 తాళముల మిశ్రమము – చచ్చత్పుట, రీతి, దర్పణ, కోకిల, అభంగ, ముద్రిక

రత్నాకరంలో 120 తాళములు

includes -108 తాళములు

నిశ్శంక తాళము, శార్ఞ్గ తాళము అను 2 తాళములు కలవు.

101 తాళములకు, 108 తాళములకు అంగములు, సాంకేతికాక్షరములు, గణములు కలవు.

గణము అనగా గురు లఘువుల సంయోగము.

ఒక్కొక్క గణములో 3 అంగములు ఉండును. అవి ఎనిమిది ఉండును.

అనుధ్రుత – అర్ధచంద్రిక, విరామ అనియు

ధ్రుతమునకు – బిందు, చక్ర – అనియు

లఘువు – చోద్య, చాణ, సార అనియు

గురువు – యమల, వక్ర, కాన అనియు

ప్లుతమునకు – త్రిపుర, దీప్త, వాద్య నైయు

కాకపాదమునకు – నిశ్శద్ద, హంసపాద అనియు ఉండును.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here