సంగీత సురధార-34

0
2

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 27

కర్నాటక సంగీతములో గ్రహ భేదం:

[dropcap]క[/dropcap]ర్నాటక సంగీతంలో ఒక రాగంలో ఉన్న స్వరస్థానాలను తీసుకుని, అందులో ఆధార షడ్జమం స్థానాన్ని వేరే స్వరస్థానానికి మారిస్తే వేరే రాగం వస్తుంది. ఈ ప్రకియనే గ్రహ భేదం అంటారు. గ్రహం అనే పదం స్థానాన్ని భేదం అనే పదం మార్పుని సూచిస్తాయి. ఆధార షడ్జమాన్ని మార్చడం మూలంగా ఈ ప్రక్రియని శ్రుతి భేదం లేదా స్వర భేదం అని కూడా అంటారు.

మేళకర్తలు గ్రహ భేదం వేస్తే – మేళకర్త రాగాలు వస్తాయి.

72 మేళకర్తలలో గ్రహ భేదం చేస్తే full scale ఉన్న రాగాలు వస్తాయి. ఉదాహరణకి శంకరాభరణం రాగం (29 మేళ)  గ్రహ భేదం చేస్తే – కల్యాణి (65 మేళ), హనుమతోడి(8 మేళ), నఠభైరవి (20 మేళ), ఖరహరప్రియ (22 మేళ), హరికాంభోజి (28 మేళ) వస్తాయి.

మూర్ఛనాకారక జన్యరాగములు – వాటిలో గ్రహస్వరములు చేసిన ఏర్పడు ఇతర జన్య రాగములు – పట్టిక

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here