Site icon Sanchika

సంగీత సురధార-38

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 29 – మొదటి భాగం

కర్నాటక – హిందుస్థానీ సంగీతం:

[dropcap]భా[/dropcap]రతీయ సంగీతం భారతదేశం నలుమూలలా ఒకే శాస్త్రీయ పద్ధతిలో వేదకాలము నుండి అభివృద్ధి చెందుతూ ఉంది. 12, 13వ శతాబ్దాల కాలంలో ఉత్తర దేశంలో ముస్లింలు పర్షియా దేశస్థులు ఉత్తర భారతదేశ రాష్ట్రాలను ఆక్రమంచి, వారి రాజ్య స్థాపన చేసినప్పుడు అఖండ భారతీయ సంగీత సంప్రదాయంలో ఉత్తర భారతదేశంలో మార్పులు జరిగాయి. క్రమంగా దక్షిణ రాష్ట్రాలు తప్ప, మిగిలిన తూర్పు, పడమర, ఉత్తర రాష్ట్రాలు ‘హిందుస్థానీ’ సంగీతం ఆచరించడం మొదలుపెట్టాయి. ‘సంగీత రత్నాకరం’ రచింపబడిన కాలానికి భారతం అంతా ఒక్కటే సంగీతం.

కర్నాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రం అంతకు పూర్వపు సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్నే యథాతథంగా ఆచరిస్తూనే ఉన్నాయి.

కాగా భారతదేశంలో భారతీయ సంగీతం రెండు సంప్రదాయాలుగా, రెండు శైలులుగా ప్రకాశిస్తోంది.

ఈ రెండు సంప్రదాయాల మూలం, శాస్త్రం ఒక్కటే అయినా కొన్ని విషయాలలో భిన్నమైన మార్గములలో పయనిస్తున్నాయి.

దీనిని ఏకత్వంలో భిన్నత్వం అనీ, భిన్నత్వంలో ఏకత్వం అని అనవచ్చు (Unity in Diversity and Diversity in Unity).

ఈ రెండు సంప్రదాయాలలో ఐక్యత, ఒకే పద్ధతి కలిగిన విషయాలు – అధార శ్రుతి, స్వరం 12 స్వర స్థానాలు శ్రుతులు షడ్జ పంచమ స్వరాలు అచలాలు. మూర్ఛన, స్థాయి, రాగ పద్ధతి, కచ్చేరి పద్ధతి, రాగ ఆలాపన, రాగములు, రవములు, మనోధర్మ సంగీతానికి ప్రాముఖ్యత విషయాలలో ఐక్యత వుంది. ప్రాథమిక సూత్రాలు, రెండింటికీ ఒక్కటే.

ప్రాథమిక ప్రామాణిక గ్రంథాలు ఈ రెండు సంప్రదాయాలకు ఒకటిగానే ఉన్నాయి.

కర్నాటక – హిందుస్థానీ సంగీత విభజన:

శార్ఙ్గదేవుడు ‘రత్నాకర’ గ్రంథము రచనాకాలము వరకు భారతీయ సంగీతం ఒకే పద్ధతిలో ఒకే పేరుతో వుండేది. కానీ 13వ శతబ్దంలో మహమ్మదీయ దండయాత్రలకు లోనై ఉత్తర హిందుస్థానమున మొఘల్ సామ్రాజ్య స్థాపనతో వారి పారశీక సంగీత పద్ధతులు భారతీయ సంగీతములో లీనమై, హిందుస్థానీ సంగీతముగా, దక్షిణలో కర్నాటక సంగీతంగా ఏర్పడి ప్రారంభమయింది. వీటిలో మొదటిది హనుమత్సంప్రదాయమనీ, రెండవదానిని నారద సంప్రదాయం అని చెప్పటం కలదు.

అయితే ప్రధాన సూత్రాలలో యీ రెండిటికిని భేదం లేకున్నను, శ్రుతి విధానం, రాగ లక్షణం, గమక ప్రయోగాలలో మాత్రం కొంత వ్యత్యాస మేర్పడి వేరు మార్గంలో పరిణామం చెందటం జరిగింది.

శ్రుతి, భావములే ప్రధానంగా హిందుస్థానీ సంగీతం అభివృద్ధి చెందుతుందగా, శ్రుతి, భావములే గాక లక్షణయుక్తమైన తాళ విధానం అతి ప్రధానంగా లక్షణంగా కర్నాటక సంగీతం అభివృద్ధి చెందడంతో దాని విశిష్టత జగద్విఖ్యాతమై ప్రపంచంలో మహోన్నతమైన స్థానాన్ని అలంకరించటానికి కారణమైనదని గ్రహించవలె.

హిందుస్థానీలో వాడునట్టి కొన్ని తాళములు, వాటి అక్షర కాలములు:

కర్నాటక సంగీతంలోని రాగాలాపనను, పల్లవిని హిందుస్థానీలో ఆలాప్, ఖ్యాల్ అని అందురు.

రాగ, రాగిణి పరివార భేదాలు:

ఉభయ సంగీత ఏక నామ రాగములు:

కల్యాణి, యమునా కల్యాణి, కానడ, అరాణా, ఖమాసు, బేహగ్, మొదలగునవి.

ఉభయ సంగీత  ఏక రాగములు:

  1. తోడి రాగానికి సమమైనది – భైరవి
  2. మాయామాళవ గౌళ – భైవర
  3. సావేరి – జోగియ
  4. అభేరి – భీమ పలాస్
  5. హిందోళ – మాల్‌కోస్
  6. ఖరహరప్రియ – కాపి
  7. శ్రీరంజని – భాగేశ్వరి
  8. శుద్ధ సావేరి – దుర్గా
  9. నాటకురంజి – మాల్కుంజి
  10. ద్విజావంతి – జయ్‍జయ్‍వంతి
  11. శంకరాభరణం – బిలవల్
  12. మోహన – భూప్
  13. నాట – తిలాంగ్
  14. శుభ పంతువరాళి – తోడి
  15. పూర్వ కల్యాణి – పూర్వి
  16. హంసానంది – సోహానీ

హిందుస్థానీ నుండి స్వీకరించిన రాగాలు:

హిందుస్థానీ నుండి స్వీకరించిన ప్రధాన రాగాలు 6 కలవు. అవి – మాండ్, బేహగ్, కాపి, జంఘాటి, ఫరజి, ఖమాసు.

1876 తరువాత కల్పించబడిన రాగాలు – ప్రస్తుతం వాడుకలో ఉన్నవి – కదన కుతూహలము, వలజి, సునాద వినోదిని.

వివిధ పేర్లు గల ఒకే రాగములు (ప్రస్తుతం వాడుకలో ఉన్నవి):

ధన్యాసి, యదుకుల కాంభోజి వంటి రాగాలు.

‘ధన్యాసి’ని – ధన్నాశి, ధనాశీ, ధనాసరి, ధనాశ్రీ అని కూడా అంటారు.

‘యదుకుల కాంభోజి’ని – ఎరుకల కాంభోజి, ఎరుకుల కాంభోజీ, యరకల కాంభోజి అని అంటారు.

రెండు పేర్లు గల ఒకే రాగములు:

ఒకే పేరు గల రెండు రాగములు:

అమృతవర్షిణి

  1. 39వ మేళ జన్యం – సరిగమప దనిపస
  2. 66వ మేళ జన్యం – సగమపనిస – సనిపమగస

మయూర ధ్వని

  1. 44వ మేళ జన్యం – సరిగమ పదనిస – సదనిదపమపగరిస
  2. 45వ మేళ జన్యం – సరిమపదనిస – సనిదపమరిస

మాధవ కల్యాణి

  1. 10వ మేళ జన్యం – సరిగపదస – సనిదపమగరిస
  2. 65వ మేళ జన్యం – సరిగమపదస – సనిదప మగరిస

పరస్పర గ్రహభేదముచే ఏర్పటు జంట (లేక) జోడు రాగములు:

శంకరాభరణం – దీని మధ్యమం గ్రహం చేస్తే కళ్యాణి; కళ్యాణి – దీని పంచమం గ్రహం చేస్తే శంకరాభరణం వస్తుంది.

శంకరాభరం – దీని రిషభం గ్రహం చేస్తే ఖరహరప్రియ; ఖరహరప్రియ – దీని నిషాదం గ్రహం చేస్తే శంకరాభరణం వస్తుంది.

రిషభ గ్రహ రాగములు – మారువ ధన్యాసి (32వ మేళం)

దైవత గ్రహ రాగములు – వసంత భైరవి (13 జన్య), సారంగనాట (15 మేళ), రీతిగౌళ (20 మేళ), ఆనందభైరవి (20 మేళ), అమృతవాహిని (20 మేళ).

నిషాద గ్రహ రాగములు –  నాదనామక్రియ (15), కన్నడ గౌళ (22), బౌళి (15), కళావతి (15) మిగిలినవి షడ్జ్ గ్రామమునకు.

Differences and Similarities between Carnatic and Hindustani:

క్రమ సంఖ్య కర్నాటక హిందుస్థానీ
1 దేవాలయాలు, భక్తి ప్రాతిపదికగా పెరిగింది. మోక్షం కోసం రాజ దర్బారుతో పెరిగింది. కళాదృష్టి కోసం
2 స్వర స్థానాలు ఒక్కటే. 7 స్వరాలు. 12 శ్రుతులు. 22 శ్రుతులు స్వర స్థానాలు ఒక్కటే.
3 గమకములు వేరు

కంపితం ~~~

స్వరం కింద సంచారం ఉంటుంది. అంటే శుద్ధ రిషభం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతము, కా॥ని॥ క్రమముగా అనగా షడ్జ, పంచమ, ప్రతిమధ్యమ, శుద్ధ దైవత. పంచమం మీద, కా॥ని॥ శుద్ధ రిషభం – షడ్జమం

గమకములు వేరు

జారు ˆ

వ్యక్తిగతంగా వుంటుంది. అనగా ఆ స్వరంపై నిలుపు గాని, ఆ పై స్వరంతో కూడి వుంటుంది జారు.

4 స్త్రీ, పురుష రాగాలు, నపుంస రాగాలు

ఉత్తమ, మధ్యమ, అధమ,

సూర్యాంశ, చంద్రాంశ

రాగ రాగిణి, పరివార్ విభాగములు
5 Time theory మనకి వర్తించదు ఎందుకంటే, scientific గా developments అంటే రేడియో, టీవీ లాంటి ఆధునిక సదుపాయాలు వచ్చాకా, Time theory మనకి apply అవదు. కాని దీనిలో Time theory వుంది. కాల నిర్ణయం morning, afternoon, evening, night అనే divisions ద్వారానే రాగాలు కూడ ఉంటాయి.
6 Nil రాగ, సంవాది స్వరాలుంటాయి
7 రాగాలు సంగతులతో కూడి ఉంటాయి. స్వరానికి ప్రాముఖ్యం వుంటుంది. స్వరాలతో వుంటుంది వారి రాగం.
8 సంగతులు లయబద్ధంగా, నిర్ణీత కాలంలో వుంటాయి. శ్రుతి treatment వీరిలో చాలా అద్భుతంగా వుంటుంది.
9 శహన – ఉదా: రీరీరీరీ – రిగమసామగరీ – 4 times అలాగే పాడాలి.

శ్రుతి, కాల, లయ, సంగతి నిర్ణయం

దేవగాంధారి – సరటి -ఆరభి – కేదారగౌళ – ప మ గ రి స – అనే స్వర ప్రయోగంలో మారుతూ వుంటాయి.

రెండు స్వరాల treatment ద్వారా మనం రాగాన్ని decide చేయచ్చు.

దాన్ని బట్టి రాగస్థాయిలంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది.

స్వరాలకి వ్యక్తిత్వం లేదు.

సా॥గా॥ చ॥రి॥ శు॥మ॥ మధ్య కంపితం.

శు॥దై॥ – అం॥గా॥ కై॥ని॥ చ॥దై – షడ్జ మధ్య కంపితం వుంటుంది.

 

వాది – సంవాది మార్చినంత మాత్రాన – మూర్చన ఒక్కటే అయినప్పటికీ – పూర్వాంగ – ఉత్తరాంగ భేదంతో రాగాలు వైవిధ్యంగా వుంటాయి.

ఉదా:

సరిగ పదస – సదపగరిస – మోహన

గ -వాదిగా – మోహన

ర – వాదిగా – దేశికార్

అలగే దర్బారీ కానడ్, అదాడ

(ఇంకా ఉంది)

Exit mobile version