[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 31 – మొదటి భాగం
Western Notation – మన సంగీతం:
స్వరములను వ్రాయు పద్ధతిని notation అని అందురు. మన కర్నాటక సంగీతం వలె కాకుండా western notationలో స్వరములు వ్రాయు పద్ధతి – 5 అడ్డగీతలను సమాంతరంగా గీసి, వాటి మధ్య గుండ్రని చుక్కల ద్వారా వివిధ సంగీత రచనలను, ఆయా శైలులలో పాడగలుగునట్లు చేయుదురు. దానినే European (or) Western Notation అని అందురు.
Western Notation లో కనబడు Symbols (Technical Terms):
Time Signature:
పాశ్చాత్య సంగీత రచనలపైన ఆయా స్వరములకు వేపన సంఖ్యచే ఏర్పడు కొన్ని రకములైన భిన్నములను వేయబడి యుండును. ఇట్లు వేయబడు పద్ధతినే ఆంగ్లంలో టైమ్ సిగ్నేచర్ అందురు.
Repertoire:
గేయముల యొక్క వరుస క్రమ విధానము. సుప్రసిద్ధులగు గాయకులు గాని, వాద్య, నట బృందములు గాని, వారు సంగీత కచ్చేరీలో, ఇతర ప్రదర్శనములలో గాని ప్రదర్శించుటకు ఏర్పర్చుకునేది.
Timeist:
తాళ జ్ఞానము నందు నిర్దిష్టమన జ్ఞానము కలిగినట్టి కళాకారుడు.
Musical Forms:
సంగీతములో గల వివిధ రచనల యొక్క రీతులను ఆంగ్లంలొ మ్యూజికల్ ఫార్మ్స్ అని అందురు.
Inverse Law:
తంత్రీ పొడవు తగ్గించినచో ఆ తంత్రి యొక్క వేపన సంఖ్య హెచ్చి ద్వని కూడా హెచ్చును. పొడవు ఎక్కువ చేసి మీటినచో ద్వని తగ్గును.
Pitch in Music:
ఏదైనా ఒక స్వరము కంటే మరియొక స్వరము ‘తీవ్రత’ను పొంది యున్నచో, అట్టి స్వరము, మొదటి స్వరము కంటే ఎక్కువ స్థాయిలో యున్నదని చెప్పబడును. ఉదా: స కంటే రి ఎక్కువగా ధ్వనించును.
Sharp – తీవ్రత ♯
Flat – ♭
Flat (దీర్ఘము) – 𝅘𝅥
3 అక్షరములు – 𝅘𝅥
Bar – 𝄥 Equal duration of time
Clef – 𝄞 Absolute pitch. Notes: G and f clefs are used.
Chord – Combination of 2 or more notes played simultaneously (or) depends of trials – 3 notes – 3rd or 5th. Major, minor, 3rd form the root.
Musical Alphabets:
స రి గ మ ప ద ని స
డో రే మ ఫా సో లా సి
Doh Ray me fa sah ha si
(or)
Ut ఉట్ అని కూడా అందురు.
మనం సప్తస్వరాలల్లోంచి సరిగమ పదని అను స్వరాక్షరములు తీసుకున్నట్లే పాశ్చాత్యులు కూడా
C | D | E | F | G | A | B | అని పిలుతురు |
(స) | (రి) | (గ) | (మ) | (ప) | (ద) | (ని) |
Natural Scale:
A diatonic scale is major scale.
పాశ్చాత్య సంగితములో శుద్ధ మేళమును natural scale అనిరి. అది ధీర శంకరాభరణం (29). దైవతము మాత్రము చ॥శు॥ దైవతము కాదు. త్రిశతి దైవతము. మన పూర్వులు శుద్ధ మేళమునే విధముగా ఏర్పర్చుకొనిరో పాశ్చాత్య సంగీతజ్ఞులు కూడా natural scale ను అట్లు ఏర్పర్చుకొనిరి.
పాశ్చాత్య సంగీతములో natural scale ఒక శుద్ధ మేళమే గాక, ఆధార స్వర సప్తకము కూడా. మన కర్నాటక సంగీతంలో ఖరహరప్రియ base. హిందుస్థానీ సంగీతంలొ బిలావల్ థాట్ base. శంకరాభరణంలో అన్ని శుద్ధ స్వరాలు. చ॥రి॥, అం॥గా, శు॥మ॥, చ॥దై॥, కా॥ని॥ అవి శుద్ధ స్వరాలు. అవి కానివి అన్నిటికి కూడా flat, sharp గుర్తులు వేయాలి.
శు॥రి: ష॥రి: శు॥గా॥: ప్రతి॥మధ్య శు॥దై॥, ష॥దై॥
శు॥ని: కై॥ని – వీటికి Sharp (♯) and Flat (♭) గుర్తులు వేయాలి
Sharp (♯) స్వరాలు:
చ॥రి॥: అం॥గా॥: ప్ర॥మి॥: చ॥దై॥: కా॥ని॥ – తీవ్ర స్వరములు – Sharp గుర్తు.
Flat (♭) స్వరాలు:
శు॥రి: సా॥గా॥: శు॥దై॥: కైశికి॥ని॥
కోమల స్వరములు అన్నిటికి Flat గుర్తులు వేయాలి. But that rule is not applied always.
Ex: చ॥రి॥ – తీవ్రం అయినప్పటికి sharp కాదు. అట్లే natural scale అందలి శు॥మ॥ కోమలం. కానీ కోమలం కాదు. Natural scale ని అనుసరించి అది నేచురల్ స్వరం అవుతుంది.
పాశ్చాత్య సంగీతంలో శం॥ natural scale.
స్థాన సంఖ్యను బట్టి షడ్జమం నుంచి సా వరకు పేర్లు గలవు.
- షడ్జమం – first note (or) tonic
- రిషభం – second note (or) Super tonic
- గాంధార (సాధరణ) – minor third note (or) mediant
- అంతర గాంధారం – major third note
- మధ్యమం – fourth note – sub – dominant
- పంచమం – fifth note – dominant
దైవతం – Sixth note – sub mediant
నిషాదము – seventh note – leading note
12 శ్రుతులు:
శు॥గా॥ will be equivalent of ‘E’ double flat (సా॥గా॥)
శు॥రి॥ will be equivalent of ‘b’ sharp (చ॥రి॥)
శు॥ని॥ will be equivalent of ‘B’ double flat (కై॥ని॥)
ష॥దై॥ will be equivalent of ‘A’ sharp (చ॥దై॥)
D sharp and equal ష॥రి.
Notation అన్నది మనకి చాలా ముఖ్యమైనది. Notation (లిపి) script అన్నది మనం letters, signs and symbols ద్వారా చెప్పవచ్చు. Western music లో notation ని staff notation అందురు. Western లో Tonic Sol Fa – భారతీయ సంగీతంలో (sa, ri, ga, ma) notation (Sargam notation)కి సమానం. Numerical Notation 1, 2, 3, 4, 5, 6 అది అంత favour గా లేదు. Staff notation represents graphical manner, the rise and fall of pitch. It enables one to appreciate visually the scheme of harmonical music. మనం ఒక సంగీతం రాయాంటే staff notation చాలా ముఖ్యం. Indian melodies ని western లో రాయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. Staff notation లో Indian melody ని represent చేయవచ్చు. Range అన్నది అన్ని compositions లో within two (or) half octave లో ఉంటుంది.
Staff notation వ్రాయాలంటే raga ని, rendering value of notes – pitch Values – mention చేయనక్కరలేదు (flat and sharp ద్వారా). భాషాంగ రాగాలలో అయితే అన్య స్వరములు వచ్చినచో దానిని మనం Sharp and flat signs ద్వారా తెలుపవచ్చు. Flat గాని Sharp గాని mention చేయకపోతే అది శం॥ (Western Notation). శం॥ Raga కి ఏ గుర్తులు అవసరం లేదు. మంద్ర స్వరములు వ్రాయాలన్న extra lines కింద వేయాలి. పై స్థాయి వ్రాయాలన్న extra lines పైన వేయాలి.
Explanation:
O indicates notes. Octave లో స
Lines మధ్య ఉండే gap – pitch ని తెలియజేస్తుంది.
Lines మీద ఉండే స్వరాలు, spaces – పై నుంచి కిందకి count చేస్తారు.
స్వరాలు ఆ 5 lines ని అధిగమిస్తే extra short lines – leger lines – ద్వారా చూపించవచ్చు.
స్వరముల యొక్క స్థానమును ఒక గుర్తు ద్వారా చెప్పవచ్చు.
Indian melodies – treble (or) G Clef
key note in middle – c
Key of C లో వ్రాసిన melodies – ఏ key లో పాడచ్చు.
ఆ విధంగా flutists higher octave లోను, violinists 6th higher లో వాయిస్తారు.
Treble Clef (or) G clef – మధ్యమ స్థాయి పంచమము – 2nd line లో 2nd line కి below వున్నది మధ్యమ స్థాయి షడ్జ.
f clef (or) bass clef – counted above the మంద్ర స్థాయి మధ్యమ.
thus
స రి గ మ ప ద ని స S r g m p d N S
స ని ద ప మ గ రి స S N d p m g r S
మధ్య స్థాయి notes అన్ని కూడా below the మధ్య స్థాయి line లో గల తార స్థాయి ri and other higher notes – తార స్థాయి షడ్జమంలో రాస్తారు.
శంకరాభరణం raga scale కి flat గాని sharp గాని mention చేయనక్కరలేదు.
For high pitch – extra lines and for low pitch extra lines.
శం॥ కానివి అన్ని రాగాలకి flat, sharp గుర్తులు వేయాలి.
Natural in introduced to bring the notes to its original character.
శం॥ scale లో flat and sharp notes – semi tone above (or) below notes (మన శాస్త్రీయ సంగీతంలో). అదీ Western Music లో Sharp or flat key notes.
(ఇంకా ఉంది)